CM Revanth Reddy (IMAGE CREDIT: SWETCHA REPORTER)
తెలంగాణ, నార్త్ తెలంగాణ

CM Revanth Reddy: 220 కోట్లతో ఆదర్శంగా కొండారెడ్డిపల్లి.. సీఎం సొంతూరులో అభివృద్ధి పనులు ఇవే!

CM Revanth Reddy: ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన నేను ఆ ఊరికి మాత్రం బిడ్డనే అంటూ మాటలు కాదు చేతుల్లో చేసి చూపించారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) రాజకీయాల్లో ఉన్నత స్థానానికి వెళ్లిన నాయకులు సొంతూరు పేరును చెప్పుకోవడం కూడా మరిచిపోయే ఈ కాలంలో తనకు జన్మనిచ్చిన గ్రామాన్ని మరవకుండా తనను ఈ స్థాయికి తీసుకొచ్చిన ఊరు ఋణం కొంతయినా తీర్చుకోవాలని కొండారెడ్డిపల్లి శ్రీమంతుడిలా మారారు సిఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సంపాదించినదాంట్లో కొంతయినా తిరిగివ్వాలనే సినిమా డైలాగ్ ను మరిపించేలా అచ్చేరువోందేలా జరుగుతున్నాయి అభివృద్ధి పనులు.

 Also  Read: Gadwal District: గద్వాల జిల్లాలో సమాచార హక్కు చట్టానికి తూట్లు.. పట్టించుకోని అధికారులు

ఆదర్శంగా కొండారెడ్డిపల్లి అభివృద్ధి

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట అసెంబ్లీ నియోజకవర్గం వంగూరు మండల పరిధిలో ఉంది కొండారెడ్డిపల్లి గ్రామం. రేవంత్ రెడ్డి సిఎం అయ్యే వరకు ఒకలా… ఇప్పుడు ఒకలా అన్నట్లు మారిపోయింది ఈ గ్రామ ముఖ చిత్రం. ఎక్కడో మారుమూల ప్రాంతంలో విసిరేసినట్లు ఉన్న ఈ గ్రామం ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధికి చిరునామాగా మరింది. ఇరుకు ఇరుకు సందులు, మట్టి రోడ్లు, చిన్న వానొచ్చిన నడవలేని స్థితిలో గోతుల మయంగా ఉండే ఈ గ్రామ రోడ్లు అద్దంలా మారాయి. పోల్కంపల్లి గ్రామానికి నాలుగు లెన్ల రోడ్డు పనులు మరింత అందాన్ని తీసుకొచ్చింది. గ్రామం నుంచి పొరుగు గ్రామాలను కలిపేలా రోడ్లు వేసేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఇక అన్ని వీధుల్లో సీసీ రోడ్స్ ఏర్పాట్లు అయ్యాయి. రోడ్డు పనుల కోసం సిఎం ఇంటి ప్రహరీ కుడా కూల్చేశారు. నష్టపోయిన ప్రజలకు పరిహారం అందిచడం విశేషం. ఇక ఎల్ఈడి బుల్బులు వచ్చాయి. రాత్రి పూట కుడా గ్రామం మిరుమిట్లు గోల్పుతోంది. గ్రామ స్వాగత తోరణం కుడా జరుగుతుంది. దాదాపు గ్రామంలో 90 శాతం పనులు పూర్తయ్యాయి.

రాష్టంలో ప్రత్యేకం..!

గ్రామంలోని అన్ని ఇండ్లకు సోలార్ కనెక్షన్ ఇచ్చారు. అలాగే వ్యవసాయ మోటార్లకు, వాణిజ్య సముదయాలకు సైతం సోలార్ ఇవ్వడం గమనార్హం. ప్రజలెవరు ఒక్క రూపాయి కరెంటు బిల్లు చెల్లించాల్సిన అవసరం లేదు. పైగా ప్రజలే మిగులు కరెంటు అమ్మి లాభాలు అర్జీంచే పరిస్థితులు రావడం మార్పుకు సంకేతం. గ్రామంలో ప్రతి ఇంటి నుంచి నెలకు 360 యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇలా గత సెప్టెంబర్ నెలలోనే లక్ష యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి కాగా ప్రజలకు 5 లక్షల ఆదాయం లభించడం గమనార్హం. అలాగే గ్రామంలో విద్యుత్ స్తంభాలు కొత్తగా విద్యుత్ లైన్ల ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి. పాడి రైతుల కోసం బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రం నిర్మాణం అయింది. ఈ కేంద్రంలో 13వేల లీటర్ల నుంచి 30వేల లీటర్ల పాలు సేకరించే స్థాయికి చేరుకొంది.

కొండారెడ్డిపల్లి అభివృద్ధి స్వరూపం

రాష్టంలో ఇలా పాల సేకరన చేసే యూనిట్ కొండారెడ్డిపల్లి కావడం మరింత ప్రత్యేకత. అలాగే బీసీ ఎస్సీలకు కమ్యూనిటీ భవనాలు మోడర్న్ బస్సు షెల్టర్, పాఠశాల భవన నిర్మాణం, ఓపెన్ జిమ్, పిల్లల పార్క్, పచ్చదనం కోసం ప్లాంటేషన్ లాంటి పలు అభివృద్ధి పనులు జరగడం వల్ల కొండారెడ్డిపల్లి అభివృద్ధి స్వరూపం మొత్తం మారిపోయింది. ఇక పోల్కంపల్లి వరకు నాలుగు వరసల రహదారి పనులు, స్వాగత తోరణం గ్రామానికి కొత్త శోభను సంతరించి పెట్టింది. పరిశుధ్య సమస్య లేకుండ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణం అవుతుంది. పేదలందరికి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు అయ్యాయి.

220కోట్లతో అభివృద్ధి పనులు

అచంపేట్ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, కలెక్టర్ బాధవత్ సంతోష్ గ్రామ అభివృద్ధి పనుల పురోగతిపై ప్రత్యేక ద్రుష్టి సారించారు. నిరంతరం పనులను పరిశీలించడం, అధికారులతో సమావేశం అవుతూ వస్తున్నారు. దీనివల్ల పనుల పురోగతి వేగం అయింది. దసరా సందర్బంగా గ్రామం వచ్చిన సిఎం రేవంత్ రెడ్డి పట్ల గ్రామస్తులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులు అందులోను పదవులు వచ్చాక తమ ఊరును పట్టించుకోలేని కాలంలో ఊరు అడగకున్న తనకు ఎంతో చేసిందన్న కృతజ్ఞఠా భావనతో సిఎం రేవంత్ రెడ్డి గ్రామంలో ఏడాదిన్నరలోనే 220కోట్లతో అభివృద్ధి పనులు చేయడం విశేషం. సిఎం చేసిన అభివృద్ధి పట్ల గ్రామంలో ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ గ్రామ బిడ్డ సిఎం స్థాయికి ఎదిగినా పుట్టిన ఊరును, తమను మర్చిపోకుండా ఇలా అభివృద్ధి చేయడంతోపాటు దసరా రోజు గ్రామంలో, తమతో కలిసి పండుగ చేసుకోవడం సిఎం సింప్లిసిటీకి నిదర్శనంగా భావిస్తున్నారు.

ఇటీవలే మంత్రులచే 134 కోట్ల అభివృద్ధి పనులు

రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజానర్సింహ, జూపల్లి కృష్ణరావు, వాకిటి శ్రీహరి చేతుల మీదుగా గత నెల చివరి వారంలో 134 కోట్ల రూపాయల విలువైన 18 రకాల అభివృద్ధి పనులకు అంకురార్పణ జరిగింది. 6 కోట్ల రూపాయలతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు కొత్త సముదాయ భవనాల నిర్మాణాలు, 30 లక్షల రూపాయలతో పాల సేకరణ కేంద్రం, 30 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ (మాల), 30 వేల లీటర్ల సామర్థ్యంతో ఆధునిక పరికరాలతో పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభించబడ్డాయి. 20 లక్షల రూపాయలతో 10 సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు, 1 కోటి 30 లక్షల రూపాయలతో సోలార్ వీధి దీపాల ఏర్పాట్లకు శంకుస్థాపనలు చేశారు.
10 లక్షల రూపాయలతో పశువైద్యశాల కంపౌండ్ వాల్ మరియు భవన బ్యాలెన్స్ పనులు, 85 లక్షల రూపాయలతో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ (OHSR) నిర్మాణం, 7 కోట్ల రూపాయలతో 6 కిలోమీటర్ల రహదారి డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులు, 20 లక్షల రూపాయలతో 7 కిలోమీటర్ల పరిధిలో 30 వేల మొక్కల అవెన్యూ ప్లాంటేషన్ పనులు ప్రారంభించబడ్డాయి.

అలాగే 25 లక్షల రూపాయలతో అంగన్‌వాడీ కేంద్రం, 5 కోట్లు 50 లక్షల రూపాయలతో కొండారెడ్డిపల్లి–రాంనగర్ బిటి రహదారి, 50 లక్షల రూపాయలతో డ్వాక్రా భవనం, 35 లక్షల రూపాయలతో గ్రంథాలయం భవనం ఫస్ట్ ఫ్లోర్‌లో కల్చరల్ సెంటర్ పనులు ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా 10 కోట్లు 31 లక్షల రూపాయలతో వ్యవసాయ పంపుసెట్ల సోలరైజేషన్ కోసం మౌలిక వసతుల పనులకు శంకుస్థాపన చేశారు. 50 లక్షల రూపాయలతో కమ్యూనిటీ సెంటర్ నిర్మాణం, 55 కోట్ల రూపాయలతో కొండారెడ్డిపల్లి గేట్ నుండి పోల్కంపల్లి గ్రామం వరకు రహదారి మెరుగుదల పనులు (భూసేకరణతో సహా), కొండారెడ్డిపల్లి ఓవర్ హెడ్ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుండి పోల్కంపల్లి వరకు మిషన్ భగీరథ గ్రిడ్ పైప్‌లైన్ పనులు ప్రారంభించబడ్డాయి.

గ్రామ అభివృద్ధి ఇలా

కొండారెడ్డిపల్లి గేటు నుంచి పోల్కంపల్లి గ్రామం వరకు నాలుగు లేన్ల రోడ్డు పనుల కోసం 16 కోట్లు
పాఠశాల భవన మరమ్మత్తుల కోసం 3 కోట్ల 70 లక్షలు
భూగర్భ మురుగునీటి నిర్మాణ పనులకు 18 కోట్లు
విద్యుత్ లైన్ల పనులుకు 2కోట్ల 85లక్షలు
ఎల్ఈడి బుల్బులకు 40 లక్షలు
ప్లాంటేషన్ కోసం 20లక్షలు
పశువైద్యశాలకు 45 లక్షలు
బీసీ కమ్యూనిటీ హాల్ కు 58 లక్షలు
ఎస్సీ కమ్యూనిటీ హాల్ కు 20 లక్షలు గ్రంధాలయానికి 55 లక్షలు గ్రామపంచాయతీ భవనానికి 72 లక్షలు మంజూరయ్యాయి.
అలాగే 30 వేల లీటర్ల సామర్థ్యం ఉన్న బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రానికి 2 కోట్ల యాభై లక్షలు
మోడర్న్ బస్సు షెల్టర్ నిర్మాణానికి 24 లక్షలు ఓపెన్ జిమ్ కు 18 లక్షలు
పిల్లల పార్కుకు 14 లక్షలు

ఆదర్శ గ్రామంగా కొండారెడ్డిపల్లి : బాధవత్ సంతోష్, కలెక్టర్

కొండారెడ్డిపల్లిలో 220 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. పనులు తుది దశకు వచ్చాయి. గత నెలలో 113 కోట్ల విలువైన అభివృద్ధి పనులుకు మంత్రులతో శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు జరిగాయి. సిఎం ఆలోచన మేరకు ప్రజాప్రతినిధులు, నాయకులతో పాటుగా ప్రజల సహకారంతో గ్రామం రాష్టంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దేలా పని చేస్తున్నాం. తుది దశలో పనులు త్వరలో పూర్తయ్యేలా చర్యలు తీసుకొంటాం.

 Also Read: MLAs Defection Case: ముగిసిన ఎమ్మెల్యేల క్రాస్‌ ఎగ్జామినేన్.. తిరిగి మల్లీ ఈ నెల 24న విచారణ

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు బస్సు ప్రమాద ఘటనలో ట్విస్ట్.. చనిపోయిన వ్యక్తిపై కేసు.. ఏం జరగబోతోంది?

Drinking Culture: మందు బాబులు మద్యం సేవించిన తర్వాత ఎందుకు ఎక్కువగా తింటారో తెలుసా?

Bigg Boss Telugu 9: సంజన నోటికి లాక్.. క్లౌడ్ గేమ్ షురూ.. మేఘం వర్షిస్తేనే సేఫ్, లేదంటే?

Biggest Scams in India: భారతదేశాన్ని కుదిపేసిన అతిపెద్ద స్కామ్స్ ఇవే..

Napoleon Returns: జంతువు ఆత్మతో కథ.. ‘నెపోలియన్ రిటర్న్స్’ టైటిల్ గ్లింప్స్ అదిరింది