MLAs Defection Case (imagecredit:twitter)
Politics, తెలంగాణ

MLAs Defection Case: ముగిసిన ఎమ్మెల్యేల క్రాస్‌ ఎగ్జామినేన్.. తిరిగి మల్లీ ఈ నెల 24న విచారణ

MLAs Defection Case: పార్టీ ఫిరాయింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేల క్రాస్‌ ఎగ్జామినేషన్ ముగిసింది. అయితే ఇరు పక్షాల ఎమ్మెల్యేల మౌఖిక వాదనలు వినేందుకు పిటిషన్ల విచారణను అసెంబ్లీ స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌(Speekar Gadam prasad Kumar) నేతృత్వంలోని ట్రిబ్యునల్‌ ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసినట్లు సమాచారం. పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న గూడెం మహిపాల్‌రెడ్డి(Gude Mahipall Reddy), బండ్ల కష్ణమోహన్ రెడ్డి(Bandla Krishna Mohan Reedy)ని పిర్యాదుదారులుగా ఉన్న బీఆర్‌ఎస్‌(BRS) ఎమ్మెల్యేలు చింత ప్రభాకర్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి(Palla Rajeshwar Reddy) తరపు న్యాయవాదులు శనివారం అసెంబ్లీలోని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ట్రిబ్యునల్ ఎదుట క్రాస్‌ ఎగ్జామినేషన్ చేశారు. తాము పార్టీ మారలేదని బీఆర్‌ఎస్‌లోనే ఉన్నామని స్పీకర్‌ ట్రిబ్యునల్‌ ఎదుట ఆరోపణ ఎదురుకుంటున్న ఎమ్మెల్యేలు పేర్కొన్నారు.

వీడియోలు ఫోటోలు సరైనవి కావు

క్రాస్‌ ఎగ్జామినేషన్‌లో పార్టీ మారినట్లు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు చూపిన ఆధారాలను ఎమ్మెల్యేలు బండ్ల క్రిష్ణమోహన్‌రెడ్డి, గూడెం మహిపాల్‌రెడ్డి నిరాకరించినట్లు సమాచారం. పార్టీ మారినట్లుగా వచ్చిన వార్తలు, ప్రకటనలు, వీడియోలు, ఫోటోలు సరైనవి కావని పేర్కొన్నట్లు తెలిసింది. అసెంబ్లీలో వేరుగా ఎందుకు కూర్చుంటున్నారనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ తమకు ట్రెజరీ బెంచ్‌లో సీట్లు కేటాయించలేదని చెప్పినట్లు తెలిసింది. ఇటీవల సీఎం నివాసంలో పార్టీ మారిన ఎమ్మెల్యేలతో రేవంత్‌రెడ్డి(Revanth Reddy) జరిపిన భేటీకి సంబంధించిన ఫుటేజీ కావాలని బీఆర్‌ఎస్‌ తరపు న్యాయవాదులు స్పీకర్‌కు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. సాక్షులను కూడా విచారణ జరిపేందుకు అనుమతి ఇవ్వాలనే యోచనలో బీఆర్‌ఎస్‌ ఉన్నట్లు సమాచారం.

Also Read: Woman Found Alive: రెండేళ్లుగా వరకట్న వేధింపులు, హత్య కేసు.. ఇప్పుడు ఊహించని ట్విస్ట్

రాజీనామా చేసి కాంగ్రెస్లో చేరితే అభ్యంతరం లేదు

రాజీనామా చేసి కాంగ్రెస్‌(Congress)లో చేరితే అభ్యంతరం లేదని, కానీ చట్టాలను తుంగలో తొక్కడం సమర్థనీయం కాదని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమ భరత్ కుమార్(Soma Barath Kumar) అన్నారు. ఫిరాయింపుదారులు సమాజానికి ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌ రెడ్డి, బండ్ల కష్ణమోహన్‌ రెడ్డి క్రాస్‌ ఎగ్జామినేషన్‌ జరిగిందని, ఇప్పటివరకు అనేక నిజాలు వెల్లడయ్యాయని అన్నారు. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విచారణ అనంతరం అసెంబ్లీ బయట ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌ రెడ్డి ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సమావేశమై క్రాస్‌ ఎగ్జామినేషన్ ను ఎలా ఎదుర్కోవాలో వివరించారని, దీనికి సంబంధించిన ఫుటేజీ కోసం ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రోసీడింగ్స్‌ అన్నీ ఎవిడెన్స్ , క్రాస్‌ ఎగ్జామినేషన్ పైనే జరిగాయని, ఇంకా అనేక మంది సాక్షులను విచారణకు తీసుకురావాల్సి ఉందని ఆయన వెల్లడించారు. స్పీకర్‌ బార్బడోస్‌ సమావేశానికి వెళ్తుండటం వల్ల తదుపరి విచారణ ఈ నెల 24కు వాయిదా పడిందని తెలిపారు. పార్టీ ఫిరాయించలేదని ఎమ్మెల్యేలు బుకాయిస్తూ అబద్ధాలతో మాట్లాడుతున్నారని, ప్రతిదీ నిరాకరించడమే వారి పద్ధతిగా మారిందని విమర్శించారు.

రేపు బార్బడోస్‌కు స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌

అసెంబ్లీ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి(Gutta Sukhender Reddy), వైస్‌ ఛైర్మన్ బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌(Banda Prakash Mudiraj) నేతత్వంలోని ప్రతినిధి బందం సోమవారం దక్షిణ అమెరికా దేశం బార్బడోస్‌కు బయలుదేరి వెళ్లనుంది. బార్బడోస్‌లోని బ్రిడ్జిటౌన్ లో ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు 68వ కామన్వెల్త్‌ పార్లమెంటరీ సదస్సు (సీపీసీ)లో ఈ బందం పాల్గొంటుంది. సదస్సు ముగిసిన తర్వాత ఇంగ్లాండ్, ఫ్రాన్స్ , ఇటలీ దేశాల్లో స్పీకర్, మండలి ఛైర్మన్ నేతత్వంలోని తెలంగాణ అసెంబ్లీ ప్రతినిధి బందం పర్యటిస్తుంది. ఈ అధ్యయన పర్యటన అనంతరం ఈ నెల 22న స్పీకర్‌ తిరిగి హైదరాబాద్‌కు రానున్నారు. ఆ తర్వాత ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న మిగతా ఎమ్మెల్యేల విచారణ ప్రక్రియ షెడ్యూలను స్పీకర్‌ ప్రకటించే అవకాశముంది. ఇప్పటి వరకు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న నలుగురు ఎమ్మెల్యేల విచారణ పూర్తయింది. మరో ఆరుగురు ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్‌రావు, కడియం శ్రీహరి, దానం నాగేందర్, పోచారం శ్రీనివాస్‌రెడ్డి, అరికెపూడి గాంధీ, ఎం.సంజయ్‌ కుమార్‌ విచారణ షెడ్యూలును స్పీకర్‌ ఖరారు చేయాల్సి ఉంది.

Also Read: Unique Train Toilet: ఓరి దేవుడా ఇది కలా నిజమా.. రైలులో 5 స్టార్ బాత్రూమ్.. ఎంత బాగుందో!

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?