Jogulamba Gadwal Railway (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal Railway: గుడ్ న్యూస్.. ఆ జిల్లాలో రైల్వే పనులు జూన్ నాటికి పూర్తి

Jogulamba Gadwal Railway: జోగులాంబ గద్వాల జిల్లాలో పెండింగ్‌లో ఉన్న రైల్వే పనులను వచ్చే జూన్ నాటికి పూర్తి చేస్తామని సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీ(Sanjay Kumar Sri) వాస్తవ తెలిపారు. జోగులాంబ హాల్ట్ వద్ద నిర్మిస్తున్న కోచ్ ఫ్యాక్టరీని, గద్వాలలో జరుగుతున్న రైల్వే స్టేషన్(Railway Station) అభివృద్ధి పనులను, డబ్లింగ్ ట్రాక్ పనులను జీ.యం. శ్రీవాస్తవ పరిశీలించారు. ప్రధాన బ్రిడ్జిల నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని వాటిని సకాలంలో వేగవంతంగా పూర్తి చేస్తామన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జోగులాంబ హాల్ట్ వద్ద కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని పరిశీలించానని, పనులు ఆశించిన స్థాయిలో నిర్దేశం మేరకు వేగంగా జరుగుతున్నాయన్నారు.

Also Read: Ramchanadr Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం!

స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు
కోచ్‌ ఫ్యాక్టరీ పూర్తయితే స్థానిక యువతకు ఉపాధి(Employment) అవకాశాలు కలుగుతాయని, సమీప జిల్లాల రైల్వే సేవలకు శక్తివంతమైన వనరుగా మారుతుందని చెప్పారు. గద్వాల ప్రధాన రైల్వే స్టేషన్ లో జరుగుతున్న ఆధునీకరణ పనులు, మరింత సదుపాయాల కల్పన, ప్లాట్‌ ఫామ్ ల విస్తరణ, ప్రయాణికుల భద్రత కోసం చేపట్టిన చర్యలను జీ.యం(GM) పరిశీలించారు. రైల్వే స్టేషన్‌ను ఆధునిక సదుపాయాలతో తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. గద్వాల మార్గంలో రైలు ద్వితీయ లైన్ (డబ్లింగ్ ట్రాక్) పనులను సైతం జీ.యం స్వయంగా తనిఖీ చేశారు. ఈ పనులు పూర్తి అయిన తర్వాత రైళ్ల రద్దీ తగ్గి, వేగవంతమైన రైలు సేవలు అందుబాటులోకి వస్తాయని తెలిపారు.

పనులకు నిధులు మంజూరు
జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District)లో రైల్వే అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. మేము నిర్దేశించిన ప్రణాళిక ప్రకారం పనుల పూర్తికి కృషి చేస్తున్నాం. వచ్చే జూన్ నాటికి అన్ని పనులను పూర్తి చేయడమే లక్ష్యం. ఇది ప్రాంతీయ అభివృద్ధికి దోహదం చేస్తుంది అని అన్నారు.

Also Read: School Bus: బడి బస్సులు భద్రమేనా.. రవాణా శాఖ ఏం చేస్తున్నట్టు?

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!