N Ramachandra Rao (imagecredit:swetcha)
Politics, లేటెస్ట్ న్యూస్

Ramchanadr Rao: స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటుదాం!

Ramchanadr Rao: రానున్న రోజుల్లో మానుకోట బిజెపి కోటగా మారుతుందని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటి మానుకోటను బిజెపి(BJP) అడ్డాగా చేసుకుంటామని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు(Ramchandr Rao) వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా(Mehabubabad) పర్యటన సందర్భంగా వీఆర్ఎన్ గార్డెన్లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇక్కడి గిరిజనులకు బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) ప్రభుత్వాలు అన్యాయం చేశాయన్నారు. సేవాలాల్, కురవి వీరభద్ర స్వామి, మానుకోట ప్రజల ఆశీస్సులు బిజెపి(BJP) పార్టీకి ఉంటాయన్నారు. ఉత్తర తెలంగాణ(Telangana)లో బిజెపి పార్టీ పొంచుకున్న విధంగానే దక్షిణ తెలంగాణలోనూ పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉత్తర తెలంగాణలో గెలుచుకున్న సీట్లకు దీటుగా దక్షిణ తెలంగాణలోనూ జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు బిజెపి పార్టీ గెలుచుకుంటుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేయాలని కుట్ర చేస్తుందని, 42 శాతం లో 10 శాతం ముస్లింలకే రిజర్వేషన్లు కేటాయించడం ఏంటని ఆయన ప్రశ్నించారు.

ప్రకటించిన జాబ్ క్యాలెండర్

తెలంగాణ రాష్ట్రంలో స్వతహాగా బీసీల(BC)కు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తే కేంద్ర ప్రభుత్వం మద్దతు తెలుపుతుందని స్పష్టం చేశారు. మతపరమైన రిజర్వేషన్లు రాజ్యాంగం ఒప్పుకోదన్నారు. ఆపరేషన్ సింధూర్లో(Operation Sindhur) 9 ఉగ్ర స్థావరాలపై దాడులు చేస్తే రాహుల్ గాంధీ(Rahula Gndhi) దాడులపై అనుమానం వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్(BRS), కాంగ్రెస్(Congress) పార్టీలది ఒక్కటే డిఎన్ఏ(DNA) అని దుయ్యబట్టారు. రాష్ట్రంలో రైతుబంధు కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని బంద్ చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో రైతాంగానికి కావాల్సిన యూరియాను దిగుమతి చేసి, యూరియాను కాంగ్రెస్ బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటుందని ఆరోపించారు. రేవంత్ రెడ్డి(Revanth Reddy) మీరు ప్రకటించిన జాబ్ క్యాలెండర్(Job Calender) ఏమైందని ప్రశ్నించారు. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా విద్యార్థులను ఇబ్బందులకు గురి చేస్తుందన్నారు. అంతకుముందు బిజెపి నాయకులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం టిఆర్ఎస్(TRS) పార్టీకి టాటా చెప్పిందన్నారు. పదేళ్లలో 50 ఏళ్లకు సరిపడా ఆదాయాన్ని కేసీఆర్(KCR) కుటుంబం సంపాదించుకుందని విమర్శించారు. రుణమాఫీ పేరుతో కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మోసం చేసిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపిని గెలిపిస్తే కాంగ్రెస్కు కర్రు కాల్చి వాత పెట్టినట్లు అవుతుంది అన్నారు.

Also Read: 10th class student Suicide: మహబూబాబాద్ జిల్లాలో దారుణం.. విద్యార్థి ఆత్మహత్య

ప్రభుత్వం సహకరిస్తేనే రాష్ట్రానికి దిక్కు

మహబూబాబాద్ జిల్లాలో 12 ఎంపీటీసీ(MPTC) సీట్ల గాను బిజెపి అత్యధిక సీట్లు గెలుచుకుంటుందని చెప్పారు. మహబూబాబాద్ జాతీయ రహదారులు కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తుందని, రహదారుల వెంట ఇండస్ట్రియల్ను ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఇంటిగ్రేటెడ్ రైల్వే కోచ్(Integrated Railway Coach) కాజీపేటలో 9 నెలల్లో ప్రొడక్షన్ ప్రారంభం అవుతుంది అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్కు ధీటుగా బిజెపి పార్టీ ఎనిమిది సీట్లను గెలుచుకుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం చేతిలో చిల్లి గవ్వ కూడా లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరిస్తేనే రాష్ట్రానికి దిక్కుగా మారే పరిస్థితి ఏర్పడ్డాయి అన్నారు. గడిచిన 11 ఏళ్లలో 12 లక్షల కోట్లు రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందన్నారు. 18 నెలలుగా ఎన్నికలు నిర్వహించాల్సిన బాధ్యత కాంగ్రెస్(Congress) ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వస్తే నిజాం(Nizam) రాజులు పెట్టిన మహబూబాబాద్ పేరును మార్చి మానుకోటగా తీర్చిదిద్దుతామన్నారు. కులాలు, మతాల పేరుతో 42 శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి బీసీ(BC)లకు 42 శాతం ఇస్తున్నామని కాంగ్రెస్(Congress) డబ్బా కొడుతుందని మండిపడ్డారు. 42 శాతం లో 10 శాతం ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తూ బిజెపి(BJP) పార్టీని కాంగ్రెస్ ప్రభుత్వం బదనం చేయాలని చూస్తుందని విమర్శించారు. రాష్ట్రంలో, కేంద్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ తోనే అభివృద్ధి చెందుతుందన్నారు. మహబూబాబాద్ లో బిజెపి పార్టీకి మున్సిపల్ చైర్మన్ పదవి ఇస్తే ఫ్లై ఓవర్ ను ఇస్తామని వెల్లడించారు. దేశాన్ని రక్షించే మోడీని కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శిస్తుందని మండిపడ్డారు.

Also Read: Doctors Fraud: సంతాన సాఫల్య కేంద్రాల పేర చైల్డ్ ట్రాఫికింగ్!

Just In

01

Crime News: హుజురాబాద్‌లో దారుణం.. విద్యుత్ షాక్‌ తగిలి ఉద్యోగి మృతి!

Allu Sirish: నయనికతో నిశ్చితార్థం.. అధికారికంగా ప్రకటించిన అల్లు శిరీష్

US shutdown: అమెరికా ప్రభుత్వం షట్‌డౌన్.. విమాన, రైలు సర్వీసులు నిలిచిపోతాయా?

High Speed Rail: సరికొత్త హై స్పీడ్ రైల్ వచ్చేస్తోంది.. గంటకు 200 కి.మీ వేగంతో రయ్ రయ్

Nayanthara: మన శంకర వరప్రసాద్ గారి శశిరేఖను చూశారా?