10th class student Suicide: మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలోని అభ్యాస్ టెక్నో ప్రైవేట్ పాఠశాల(Abhyas Techno Private School)లో విషాదం చోటు చేసుకుంది. తిరుమలగిరి మండలం వెలిశాల గ్రామం పరిధిలోని మర్రికుంట తండాకు చెందిన బానోతు వెంకట చైతన్య(Bhanothu Venkata Chaitanya) అనే పదవ తరగతి విద్యార్థి హాస్టల్ గదిలో ఎలుకల మందు(Rat poison) తాగిన ఘటన ఆందోళన కలిగించింది. ఆదివారం సాయంత్రం ఈ ఘటన జరగగా, సహచరులు గమనించి వెంటనే ఆసుపత్రికి తరలించారు. అయితే హనుమకొండ(Hanumakoda) ప్రైవేట్ ఆసుపత్రి నుంచి హైదరాబాద్(Hydrabad) కు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలో చైతన్య మృతి చెందాడు.
స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే
ఈ విషయం తెలిసిన వెంటనే విద్యార్థి కుటుంబ సభ్యులు, బంధువులు పాఠశాల గేటు వద్ద శవంతో బైఠాయించారు. నా అబ్బాయి చాలా బుద్ధిమంతుడు. ఇలా ఆత్మహత్య చేసుకునే వారు కాదు, స్కూల్(School) యాజమాన్యం చెప్పినట్టు తనే తాగాడా? లేదా ఏదైనా కుట్రనా? అంటూ తండ్రి వెంకన్న కన్నీరు మున్నీరయ్యాడు. స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్యమే మా బిడ్డ మృతికి కారణం అంటూ వారు ఆరోపించారు. పాఠశాల యాజమాన్యం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ, గేటు ముందు విద్యార్ధినాయకలు ధర్నాకు దిగాయి.
Also Read: Cyber Criminals: ఏటా పెరిగిపోతున్న సైబర్ నేరాలు.. ప్రతీ నెల19 వందల కోట్లు మాయం
మియాపూర్‌లో పదవ తరగతి విద్యార్ధి
పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. విద్యార్థి మృతి నేపథ్యంలో పలువురు స్థానికులు, ప్రజాప్రతినిధులు, విద్యార్ది సంఘాల నాయకులు అక్కడికి చేరుకొని మృతిని కుటుంబాన్ని పరామర్శించారు. గత కొన్ని రోజులు క్రితం మియాపూర్(Miyapur)లో పదవ తరగతి విద్యార్ధి హన్సిక(Hansika) అనే అమ్మాయి తను నివాసం ఉంటునటువంటి భవణం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు హత్యకు తల్లితండ్రులు, స్కూల్ యాజమాన్యమే కారణమని హన్సిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
Also Read: Etela Rajender: ప్రభుత్వాలు ప్రేమతో ఇవ్వట్లేదు.. పోరాటాల ద్వారానే పథకాలు