RTC Retirement Benefits: ఆర్టీసీ ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ వెంటనే ఇవ్వాలని, 36 నెలల లీవ్ ఎన్ క్యాష్మెంట్, ఐదు నెలల గ్రాట్యూవిటీ ఇవ్వాలని ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయిస్ సీనియర్ సిటి జన్స్ ఫోరం డిమాండ్ చేసింది. రాంసగర్ లోని లలిత నగర్ కమిటీ హాల్లో ఆర్టీసీ రిటైర్డ్ ఎం ప్లాయిస్ సీనియర్ సిటిజన్స్ ఫోరం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగుల రాష్ట్రస్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా బి సుధాకర్, అధ్యక్షులుగా ఎంవి కృష్ణ, ప్రధాన కార్య దర్శిగా కె. నాగేశ్వరరావు ఎన్నికయ్యారు.
హెల్త్ కార్డులు
అనంతరం నాగేశ్వరరావు మాట్లాడుతూ రిటైర్డ్ అయిన ఉద్యోగులను బాధించకుండా ప్రభుత్వం, యాజమాన్యం వెంటనే 2017 నుంచి నేటి వరకు బెనిఫిట్స్ ఫే స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నామని, యాజమాన్యం, ప్రభుత్వం ఇబ్బంది పెట్ట కుండా నగదు రహిత వైద్యం అందించి, హెల్త్ కార్డులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రిటైర్మెంట్ అయిన వెంటనే సెటిల్మెంట్ చేసే అమౌంట్ ను ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Also Read: Minister Konda Surekha: అర్చక ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిన మంత్రి.
రాష్ట్ర వ్యాప్తంగా నిరసన
హయ్యర్ పెన్షన్ కోసం రిజెక్ట్ చేసిన అప్లికేషన్లను తిరిగి పరిశీలించి హయ్యర్ పెన్షన్ సాంక్షన్ చేయాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం వేసిన మినిమం పెన్షన్ కమిటీల ప్రకారం పెన్షన్ రివైజ్ చేయాలని, రిటైర్మెంట్ డబ్బులు, సిసిఎస్, పీఎఫ్ దబ్బులు ఇవ్వాలని విజ్ఞప్తి వేశారు. డిమాండ్లకు స్పందించని పక్షంలో వృద్ధాప్యంలో ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలుపుతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు, నాయకులు భారీగా పాల్గొన్నారు.
Also Read: HYDRA Commissioner: చింతల్ బస్తీలో నాలా ఆక్రమణలపై.. హైడ్రా కమిషనర్ ఫైర్!