Minister Konda Surekha (imagecredit:swetcha)
తెలంగాణ

Minister Konda Surekha: అర్చక ఉద్యోగుల‌కు గుడ్ న్యూస్.. ప్రత్యేక నిధి ఏర్పాటు చేసిన మంత్రి.

Minister Konda Surekha: దేవాయాల‌యాల్లో ప‌ని చేస్తున్న అర్చకుల చిర‌కాల కోరిక‌ను రాష్ట్ర ప్రభుత్వం తీర్చింది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఆల‌యాల్లో సుదీర్ఘ కాలంగా సేవ‌లు అందిస్తున్న అర్చక‌, ఉద్యోగ సంక్షేమ నిమిత్తం ప్రత్యేకంగా నిధిని ఏర్పాటు చేశారు. సచివాలయంలో మంత్రి కొండా సురేఖ అర్చకఉద్యోగుల సంక్షేమనిధి పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి సురేఖ మాట్లాడుతూ సంక్షేమ ట్రస్టు ద్వారా దేవాదాయ శాఖ పరిధిలోని సహాయ కమిషనర్ స్థాయి వరకు గల దేవాలయాలలో పని చేసే సుమారు 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు సంక్షేమ నిధితో ల‌బ్ధి చేకూరుతుంద‌న్నారు. అర్చకులు, ఇతర ఉద్యోగులకు మరణానంతరం లేదా రిటైర్మెంట్ గ్రాట్యూటీ ఇవ్వడం జ‌రుగుతుంద‌న్నారు.

ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం

ధూపదీప నైవేద్య అర్చకులకు మరణానంతరం చెల్లించు గ్రాట్యూటీ నిర్ధారించిన‌ట్టు చెప్పారు. మరణానంతరం చెల్లించే ఎక్స్ గ్రేషియా, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం చెల్లింపు ఈ నిధి ఉప‌యోగ‌ప‌డుతుంద‌న్నారు. ఈ నిధి కింద ఉద్యోగుల‌కు, మెడికల్ రీయింబ‌ర్స్ మెంట్‌, వివాహ నిమిత్త పథకం, ఉపనయన పథకం, గృహ నిర్మాణ, కొనుగోలు, మరమ్మత్తుల నిమిత్తం పథకం, విద్యా పథకం, విధులు నిర్వహించలేని వికలాంగులైన ఉద్యోగులకు ఆర్థిక సహాయ పథకం అంద‌జేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు.

Also Read: Minister Kishan Reddy: భూగర్భ గనుల తవ్వకాల్లో.. సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలి!

రూ 4 లక్షల నుంచి 8 లక్షలకు పెంపు

పథకాలలో రెగ్యులర్ అర్చకులు, ఇతర ఉద్యోగులకు గ్రాట్యూటీ పథకానికి ఈ ఏడాది మే 28 నుంచి అర్చక సంక్షేమ బోర్డు గతంలో చెల్లించిన గ్రాట్యూటీ రూ 4 లక్షల నుంచి రూ 8 లక్షలకు పెంచిన‌ట్టు చెప్పారు. ఈ గ్రాట్యూటీ సదరు ఉద్యోగి బ్యాంకు ఖాతాలో ఏక మొత్తంలో వారి సర్వీసు కాలానికి లోబడి చెల్లిస్తామ‌న్నారు. ఎవ‌రైనా అకాలంగా చ‌నిపోతే, అంతిమ సంస్కారాల ఖర్చుల నిమిత్తం రూ20,000 నుంచి రూ 30,000 లకు పెంచిన‌ట్టు చెప్పారు. ఈ అంశంపై ప్రాంతీయ, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు అర్చక, ఉద్యోగ సంఘాలతో సమావేశాలు ఏర్పాటు చేస్తారని మంత్రి వివరించారు. ఈ సమావేశంలో ఎండోమెంటు ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ శైల‌జా రామ‌య్యార్‌, డైరెక్టర్ వెంక‌ట‌రావు, అధికారులు పాల్గొన్నారు.

Also Read: HC Lawyer Kidnap case: హైకోర్టు న్యాయవాది కిడ్నాప్.. కోటి రూపాయల డిమాండ్!

 

Just In

01

Ganja Racket: గంజాయి బ్యాచ్ అరెస్ట్! .. ఎలా దొరికారో తెలుసా?

Huzurabad Gurukulam: గురుకులంలో విద్యార్థులకు టార్చర్?.. ప్రిన్సిపాల్, ఓ పోలీస్ ఏం చేశారంటే?

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!