Medaram Jatara 2026: మేడారం జాతరకు వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ చర్యలు తీసుకుంటున్నదని, వివిధ ప్రాంతాల నుంచి వెళ్లే వారిని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసినట్లు సంస్థ వైస్ ఛైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ నాగిరెడ్డి(Nagireddy) తెలిపారు. ఉప్పల్ నుంచి మేడారం వెళ్లే దారిలో గురువారం కొన్ని ప్రధాన పాయింట్లను పర్యవేక్షించారు. యంత్రాంగం చేపట్టిన రవాణా సౌకర్య సేవల్ని పరిశీలించారు.
పిల్లలకు గుర్తింపు ట్యాగ్లు
జాతరకు వెళ్లే భక్తుల పిల్లల భద్రత కోసం ఉప్పల్ బస్టాప్, హన్మకొండ బస్టాండులో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సురక్షిత కేంద్రాల్లో పిల్లలకు గుర్తింపు ట్యాగ్లు వేస్తున్న విధానాన్ని పరిశీలించి.. స్వయంగా పిల్లలకు ట్యాగ్లు వేశారు. మేడారం వెళ్లే సమయంలో పిల్లలు తప్పిపోకుండా ఉండేందుకు ఈ సురక్షిత చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పటిష్టంగా చేపట్టాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. హన్మకొండ బస్టాండులోనూ క్యూలైన్లను పరిశీలించి అక్కడ ప్రయాణికులతో మాట్లాడి రవాణా సేవలను అడిగి తెలుసుకున్నారు. కరీంనగర్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సోలమాన్, వరంగల్ రీజినల్ మేనేజర్ విజయ భాను, అధికారులు పాల్గొన్నారు.
Also Read: Seethakka: గ్రామాల్లో తాగునీటి సరఫరా పటిష్టం చేయాలి.. ఉన్నతాధికారులతో మంత్రి సీతక్క సమీక్ష!

