Collector Hanumantha Rao: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ
Collector Hanumantha Rao ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Collector Hanumantha Rao: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.. అధికారులకు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు!

Collector Hanumantha Rao: యాదాద్రి భువనగిరి జిల్లాలో రోడ్డు భద్రతా పై సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టరేట్లో సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ హనుమంతరావు (Collector Hanumantha Rao) మాట్లాడుతూ జిల్లా రోడ్డు ప్రమాదంలో మరణాల సంఖ్య తగ్గిందని, గత సంవత్సరం లో రోడ్డు ప్రమాదాల వలన మరణించిన వారి సంఖ్య 204, ఉండగా ఈ సంవత్సరం రోడ్డు ప్రమాదాల వలన 174 మంది మాత్రమే చనిపోవడం జరిగిందన్నారు. యాక్సిడెంట్ రోడ్డు ప్రమాదాల నివారణకు మరిన్ని పకడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అన్నారు. జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గత సమావేశంలో గుర్తించిన బ్లాక్ స్పాట్స్ వద్ద ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు చేపట్టారు.

Also Read: Collector Hanumantha Rao: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

నివారణకు చర్యలు చేపట్టాలి 

జిల్లాలో ఎన్ని బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి వాటి పై తీసుకున్న చర్యలు ఏమిటని సంబంధిత శాఖల అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో తరచుగా ప్రమాదాలు జరుగుతున్న బ్లాక్ స్పాట్ లను గుర్తించి రోడ్డు ప్రమాదాలు, ప్రాణ నష్టం జరగకుండా రక్షణ నివారణకు చర్యలు చేపట్టాలన్నారు. ప్రమాద ప్రదేశాలలో సైన్ బోర్డులను ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రమాద అవకాశం ఉన్న స్థలాల్లో వాహనాల వేగ నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. తరచుగా ప్రమాదాలు జరుగుతున్న చోట్ల వాటికి గల కారణాలను విశ్లేషించి నివారణ చర్యలు చేపట్టాలన్నారు. నేషనల్ హైవే అథారిటీ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు రోడ్ సేఫ్టీ సమావేశాల్లో చర్చించిన అంశాలకు సంబంధించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏఎస్పీ రాహుల్ రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కువగా ప్రమాదాలు జరిగే బ్లాక్ స్పాట్లను గురించి వివరించారు. ఈ సమావేశంలో ట్రాఫిక్ ఏసిపి ప్రభాకర్ రెడ్డి, ట్రాన్స్పోర్ట్ అధికారి సాయి కృష్ణ, రోడ్డు భవనాల శాఖ అధికారి సరిత, ఆర్ టి ఏ నర్సింహా,వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

Also Read: Collector Hanumanth Rao: మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు సార్‌.. కలెక్టర్‌ హనుమంత రావుకు విద్యార్థి విన్నపం!

Just In

01

Komatireddy IAS Issue: మంత్రి కోమటిరెడ్డి వర్సెస్ ఎన్టీవీ వివాదం.. తెర వెనుక ఇంత కుట్ర దాగుందా?

AV Ranganath: చెరువుల్లో మట్టి వేసి కబ్జాలకు పాల్పడితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం.. హైడ్రా కమిషనర్ హెచ్చరిక!

Medak District: ఆ జిల్లాలో అమావాస్య వేడుకలకు సిద్ధం.. పుణ్యస్నానం ఏడుపాయలకు రానున్న లక్షలాది మంది భక్తులు!

Collector Hanumantha Rao: రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టాలి.. అధికారులకు కలెక్టర్ హనుమంతరావు ఆదేశాలు!

Seethakka: మేడారంలో ఏర్పాటు చేసిన కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ను పరిశీలించిన మంత్రి సీతక్క!