Collector Hanumantha Rao: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే
Collector Hanumantha Rao ( image credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Collector Hanumantha Rao: ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి : జిల్లా కలెక్టర్ హనుమంతరావు

Collector Hanumantha Rao: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులకు అధిక ప్రాధాన్యతనిచ్చి సమస్యలు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ లో ప్రజావాణి కార్యక్రమంలో రెవెన్యూ అదనపు కలెక్టర్ వీరా రెడ్డి, స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్ భాస్కరరావు తో కలిసి జిల్లా కలెక్టర్ వివిధ ప్రాంతాల ప్రజల నుండి 58 అర్జీలను స్వీకరించారు. ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలన్నారు.

Also Read: Collector Hanumanth Rao: మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు సార్‌.. కలెక్టర్‌ హనుమంత రావుకు విద్యార్థి విన్నపం!

ప్రజల సమస్యలు పరిష్కరించాలి!

అందులో రెవిన్యూ శాఖ 41, గ్రామీణాభివృద్ధి శాఖ 4, జిల్లా సంక్షేమ శాఖ 2, మున్సిపాలిటీ 2,ఆర్ అండ్ బి, ఎక్సైజ్, ఇరిగేషన్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్, జిల్లా పంచాయతీ, సివిల్ సప్లై, ఆర్టీసీ, ఎంప్లాయిమెంట్ టీం, విద్య శాఖలకు ఒక్కొకటి చొప్పున వచ్చాయని తెలియజేశారు. వివిధ శాఖలకు వచ్చిన దరఖాస్తులను తక్షణమే పరిశీలించి ప్రజల సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమం లో జడ్పీ సీఈవో శోభారాణి, జిల్లా రెవిన్యూ అధికారి జయమ్మ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ జయశ్రీ, హౌసింగ్ పీడీ విజయ సింగ్ ,వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

Also Read:Collector Hanumanth Rao: మాకు ఇందిరమ్మ ఇల్లు రాలేదు సార్‌.. కలెక్టర్‌ హనుమంత రావుకు విద్యార్థి విన్నపం! 

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..