Mahabubabad: పంట పొలాల్లో పోలీసుల వేట.. దేనికోసమంటే?
Special-Police (Image source X)
నార్త్ తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Mahabubabad: మహబూబాబాద్ జిల్లాలో పంట పొలాల్లో తిరుగుతున్న పోలీసులు.. ఎందుకో తెలుసా?

Mahabubabad:

మహబూబాబాద్, స్వేచ్ఛ: మహబూబాబాద్ జిల్లా (Mahabubabad) పరిధిలోని పంట పొలాల్లో స్పెషల్ పార్టీ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపడుతున్నారు. డ్రోన్ల సహాయంతో మరి అన్వేషిస్తున్నారు. అయితే, దీనివెనుక పెద్ద కారణమే ఉంది. గంజాయి అక్రమ సాగు అడ్డుకట్ట వేసేందుకు సీసీఎస్ (CCS), స్పెషల్ పార్టీ పోలీసులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపడుతున్నారు. మహబూబాబాద్ జిల్లా పరిధిలో గంజాయి అక్రమ సాగు జరుగుతున్న ప్రాంతాలను గుర్తించేందుకు విస్తృత స్థాయి తనిఖీలు చేపడుతున్నారు. ఈ తనిఖీల్లో భాగంగా డ్రోన్ల సహాయంతో వ్యవసాయ భూములు, అటవీ ప్రాంతాలు, కొండ ప్రాంతాలు, ఒంటరి పొలాలు, దూర గ్రామ ప్రాంతాలపై రైతులకు ఇబ్బంది లేకుండా గగనతల పర్యవేక్షణ చేస్తున్నారు.

జిల్లాలోని నర్సింహులపేట పోలీస్ స్టేషన్ పరిధి నర్సింహులపేట మండలంలోని వ్యవసాయ ప్రాంతంలో అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై చట్టప్రకారం కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో తనిఖీలను ముమ్మరం చేశారు.

Read Also- Widow Remarriage Case: భర్త చనిపోయాక భార్య రెండో పెళ్లి.. మృతుడి ఉద్యోగం ఇచ్చే విషయంపై హైకోర్టు కీలక తీర్పు

గంజాయి లాంటి మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపుతూ జిల్లా మొత్తం జల్లెడ పట్టే విధంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి సాగుకు అనుకూలంగా ఉన్న ప్రాంతాలను గుర్తించడం, పాత గంజాయి నేరస్తులు, గంజాయి విక్రయించే వ్యక్తులు, అక్రమ రవాణా మార్గాలు, గంజాయి నిల్వ చేసే ప్రాంతాలు, విక్రయ కేంద్రాలపై నిరంతర నిఘా కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గంజాయి అక్రమ సాగు, రవాణా, నిల్వ, విక్రయం, వినియోగంపై జీరో టాలరెన్స్ విధానం అమలు చేస్తూ, ఎవరైనా ఈ అక్రమాలకు పాల్పడితే కఠిన చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు  హెచ్చరించారు.

Read Also- YS Jagan on CM Chandrababu: స్వలాభం కోసం.. జన్మనిచ్చిన సీమకే అన్యాయం.. చంద్రబాబుపై జగన్ ఫైర్

సీసీఎస్ బృందాలు, స్పెషల్ పార్టీ పోలీసులు, స్థానిక పోలీస్ సిబ్బంది సమన్వయంతో రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తూ గంజాయి అక్రమాలను పూర్తిగా నిర్మూలించేందుకు కృషి చేస్తున్నారు. యువత భవిష్యత్తును నాశనం చేసే మత్తు పదార్థాలపై పోలీస్ శాఖ రాజీపడబోదని స్పష్టం చేశారు.
గంజాయి సాగు, అక్రమ రవాణా లేదా విక్రయాలకు సంబంధించిన సమాచారం ఎవరికైనా తెలిసినట్లయితే, భయపడకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని ఎస్పీ తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలను పూర్తిగా గోప్యంగా ఉంచుతామని హామీ ఇస్తూ, ప్రజల సహకారంతోనే గంజాయి రహిత మహబూబాబాద్ జిల్లా సాధ్యమవుతుందని తెలిపారు.

Just In

01

Municipality Elections: ఆ జిల్లా మున్సిపాలిటీపై బీజేపీ ఫుల్ ఫోకస్.. గెలుపే లక్ష్యంగా వ్యూహం!

Tirumala: తిరుమలలో మద్యం బాటిళ్ల వివాదం.. టీటీడీ ఛైర్మన్‌పై భూమన సంచలన ఆరోపణలు

Prabhas Fan: ‘ది రాజాసాబ్’ ప్రీమియర్ వెయ్యలేదని అభిమాని చేసింది చూస్తే షాక్ అవుతారు..

MLA Rajesh Reddy: గ్రామీణ క్రీడాకారుల ప్రతిభను వెలికితీయడమే సీఎం కప్ లక్ష్యం : ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి!

Seethakka: మేడారం జాతరలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలి : మంత్రి సీతక్క!