BJP MLA: భారతీయ రాజకీయ వ్యవస్థలో ఆది నుంచి కొన్ని కుటుంబాల కేంద్రంగా పాలిటిక్స్, వారి వారసుల పెత్తనం, ఆధిపత్యాల కనిపిస్తున్నాయి. ప్రాంతీయ, జాతీయ అనే తేడా లేకుండా, దాదాపుగా అన్ని పార్టీలలోనూ ఇదే ట్రెండ్ కనిపిస్తుంది. ఆ నాయకులే రాజకీయం చేస్తుంటారు, వారు కాకపోతే కొడుకులు లేదా, కూతుళ్ల కేంద్రంగా రాజకీయాలు నడుస్తుంటాయి. ప్రాంతీయంగా కూడా ఇలాంటి ట్రెండ్ జోరుగా కనిపిస్తూనే ఉంది. ఇంతకీ ఈ విషయం ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, 70 ఏళ్ల వయసు, అపార రాజకీయ అనుభవం ఉన్న బీజేపీ ఎమ్మెల్యే ఒకరు.. ఆత్మగౌరవాన్ని చంపుకొని.. ఓ బడా పొలిటీషియన్ కొడుకు కాళ్లు (BJP MLA Viral) పట్టుకున్నాడు. అది కూడా తన పుట్టిన రోజు వేడుకల్లో నాయకులు, నేతలు, కార్యకర్తల మధ్య కాళ్లను తాకడం చర్చనీయాంశంగా మారింది.
ఈ ఆసక్తికర రాజకీయ ఘటన మధ్యప్రదేశ్‌లోని శివ్‌పురిలో జరిగింది. బీజేపీకి చెందిన 70 ఏళ్ల దేవేంద్ర జైన్ అనే సీనియర్ ఎమ్మెల్యే తన పుట్టిన రోజు సెలబ్రేషన్స్‌కు హాజరైన 29 ఏళ్ల యువకుడి కాళ్లను తాకారు. తమరి ఆశీస్సులు కావాలన్నది సదరు ఎమ్మెల్యే ఉద్దేశం. మరి, ఇంతకీ 29 ఏళ్ల ఆ యువకుడు ఎవరంటే, బీజేపీ సీనియర్ లీడర్, కేంద్రమంత్రి జ్యోతిరాధిత్య సింథియా కొడుకు మహానార్యమాన్ సింథియా (Mahanaaryaman Scindia). రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసిన ఈ ఘటన బుధవారం (జనవరి 7) జరిగింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగచక్కర్లు కొడుతోంది.
మహానార్యమాన్ సింథియా చిన్న కేక్ ముక్కను ఎమ్మెల్యేకి తినిపించారు. దీంతో, ఎమ్మెల్యే దేవేంద్ర జైన్ వెంటనే రెండు చేతులు జోడించి నమస్కారం చెప్పారు. ఆ వెంటనే కిందకు వంగి మహానార్యమాన్ సింథియా కాళ్లను రెండు చేతులతో తాకారు. సింథియా హత్తుకునేందుకు ప్రయత్నిస్తుండగా ఎమ్మెల్యే ఈ విధంగా నడుచుకున్నారు.
దుమ్మెత్తిపోస్తున్న జనాలు
ఈ వీడియో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై తెగ వైరల్‌గా మారింది. దీంతో, నెటిజన్లు విమర్శల దాడి చేస్తున్నారు. అంత సీనియర్ పొలిటీషియన్ అయ్యుండి, ఒక పిల్లాడి కాళ్లు ఎలా పట్టుకున్నారంటూ ఎమ్మెల్యే దేవేంద్ర జైన్‌ను ప్రశ్నిస్తున్నారు. వెన్నెముకలేని రాజకీయ నాయకులు వీళ్లు అంటూ మండిపడుతున్నారు. ఎమ్మెల్యే దేవేంద్ర జైన్ చాలా కాలంగా ఎమ్మెల్యేగా ఉన్నారని గుర్తుచేస్తున్నారు. పార్టీలలో ఆధిపత్యం చెలాయిస్తున్న నాయకులు.. తమ కిందిస్థాయి నేతలను ఏవిధంగా ప్రభావితం చేస్తారో చాటిచెప్పేందుకు ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమేనని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. సింథియా రాజ కుటుంబానికి చెందిన వ్యక్తి కావడంతోనే మహార్యమాన్ సింథియా వద్ద ఎమ్మెల్యే ఆశీర్వాదం తీసుకున్నారని వ్యాఖ్యానిస్తున్నారు. అతడి వయసు కేవలం 29 ఏళ్లే అయినా ఇప్పటికే చాలా పొలిటికల్ పవర్ సంపాదించారంటూ విశ్లేషిస్తున్నారు. అంత సీనియర్ ఎమ్మెల్యే కాళ్లు పట్టుకుంటున్నా మహార్యమాన్ కనీసం వద్దని వారించలేదని గుర్తుచేస్తుననారు. ఇలాంటివాటిని చూస్తుంటే, నేటి రాజకీయాల్లో నిజంగా గౌరవ మర్యాదలు ఉన్నాయా?, రాజకీయాలు నిజాయితీగా జరుగుతున్నాయా? అని చాలా మంది ప్రశ్నలు సంధిస్తున్నారు.
This man is 70 year old BJP MLA from Madhya Pradesh, Devendra Jain.
But he is bowing down & touching the feet of this 29 year old boy.
Only because he is the son of Union Minister Jyotiraditya Scindia. Sanskar of BJP 🤡pic.twitter.com/suFK0Y3pze
— Ankit Mayank (@mr_mayank) January 8, 2026

