Vikarabad District: వికారాబాద్ జిల్లా (Vikarabad District) పరిగి ఫారెస్ట్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ కార్యాలయంలో పనిచేసే సెక్షన్ ఆఫీసర్ రూ.40 వేలు లంచం తీసుకుంటూ పట్టుపడ్డారు. రంగారెడ్డి జిల్లా రెంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి చెందిన ఓ వ్యక్తి సీతాఫలాల కాంట్రాక్టు సుమారు రూ.18 లక్షలకు టెండర్ వేసి దక్కించుకున్నాడు. పరిగి నియోజకవర్గంలో మూడు మండలాల్లో ఫారెస్ట్ లో ఉన్న సీతాఫలాలను సేకరించి పట్టణానికి తరలిస్తుంటాడు .ఈ విధంగా ఫారెస్ట్ లో సేకరించిన సీతాఫలాలకు పరిగి ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ల పర్మిట్లు తీసుకొని పట్టణాలకు ఎగుమతి చేసి వ్యాపారం నిర్వహిస్తాడు.
Also Read:Jangaon: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్!
రూ.50 వేలు ఇస్తేనే పర్మిట్లు ఇస్తా
కొంతకాలంగా సీతాఫలాలకు పర్వీట్లు ఇచ్చే విషయంలో సెక్షన్ ఆఫీసర్ బి. సాయి కుమార్, మహమ్మద్ మైనోద్దీన్ లు డబ్బులు డిమాండ్ చేశారు. రూ.50 వేలు ఇస్తేనే పర్మిట్లు ఇస్తామని రోజు గంటల తరబడి వాహనాలు ఆపి ఇబ్బందులకు గురి చేస్తున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ రూ.40 వేలు లంచం ఇచ్చేందుకు ఒప్పందం కుదిరించుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఏసిబీ అధికారులు పథకం ప్రకారం రూ.40 వేలు లంచం ఇస్తూ పరిగి ఫారెస్ట్ రేంజ్ కార్యాలయంలో సెక్షన్ ఆఫీసర్లను పట్టుకొని అదుపులోకి తీసుకున్నారు. ఈ డబ్బులు డిమాండ్ లో ఇంకా ఫారెస్ట్ అధికారుల ప్రమేయం ఉందో లేదో అన్న విషయం విచారణ చేస్తుమని డీఎస్పీ తెలిపారు.
Also Read: Jangaon: జనగామలో 108 ఆలస్యం.. ఆటోలోనే అరుదైన డెలివరీ చేసిన ఆశ వర్కర్లు!
