Jangaon ( IMAGE Credit: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Jangaon: లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన అసిస్టెంట్ ఇంజనీర్!

Jangaon : జనగమ జిల్లా విద్యాశాఖ పరిధిలో ఇంజనీరింగ్ విభాగంలో అసిస్టెంట్ ఇంజనీర్ గా విధులు నిర్వహిస్తున్న రమేష్ లంచం డిమాండ్ చేసి ఏసీబికి చిక్కాడు. ఎసిబి అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కొడకండ్ల మండలంలోని ఒక పాఠశాలలో భవనం నిర్మాణం చేపట్టిన వ్యక్తికి బిల్లులు చెల్లించడానికి అవసరమైన ఫైలును ముందుకు కదిలించడానికి 18 వేల రూపాయల లంచం కోరినట్టు సమాచారం. డబ్బులకోసం రమేష్ వేధిస్తుండడంతో విసిగిపోయిన పాఠశాల నిర్వాహకులు నేరుగా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులను ఆశ్రయించారు. బాధితుని ఫిర్యాదులపై స్పందించిన ఏసీబీ అధికారులు విసిరిన వలలో చిక్కుకున్నాడు.

Also Read: Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!

రమేష్ రూ.8వేలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు

హనుమకొండలోని ఎడ్యుకేషన్ వెల్ఫేర్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కార్యాలయంలో రమేష్ రూ.8వేలు లంచం స్వీకరిస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. రమేష్ అరెస్టుతో అధికార వర్గాల్లో కలకలం రేగింది. నిష్కళంకంగా ఉండాల్సిన విద్యా విభాగంలోనే ఇటువంటి అవినీతి బహిర్గతం కావడం తల్లిదండ్రులు, ఉపాధ్యాయ వర్గాల్లో తీవ్ర ఆగ్రహానికి దారి తీస్తోంది. పాఠశాల భవిష్యత్తు కోసం మంజూరైన నిధులకే ముళ్లుపెట్టి లంచం కోరడం సిగ్గుచేటు అంటూ స్థానికులు మండిపడుతున్నారు.ఈ ఘటనతో జనగమ జిల్లా విద్యశాఖలో మరిన్ని అవకతవకలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పలువురు భావిస్తున్నారు. లోతుగా విచారణ చేపడితే మరికొందరు అవినీతి అధికారుల పాత్ర బయట పడే అవకాశం ఉందని చర్చ సాగుతుంది.

 Also Read: OG Movie: ఓజీ లో ఆ హీరోయిన్ కి ఘోర అవమానం .. ఆమెను ఎడిటింగ్ లో తీసేశారా?

Just In

01

Sujeeth: ‘ఓజీ 2’లో ప్రభాస్.. సుజీత్ ఏమన్నారంటే..

Hyderabad Metro: ఇకపై సర్కారు మెట్రో రైలు.. చర్చలు సఫలం

US Deportation: 73 ఏళ్ల పెద్దావిడను అమానవీయంగా భారత్ తిప్పిపంపిన అమెరికా.. ఇంతదారుణమా?

Jagapathi Babu: రూ. 800 కోట్ల మోసం.. ఈడీ విచారణకు జగపతి బాబు

KTR: స్థానిక ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు