Connplex Cinemas
ఎంటర్‌టైన్మెంట్

Connplex Cinemas: ‘ఓజీ’ సినిమాతో హైదరాబాద్‌లో మరో లగ్జరీ మల్టీప్లెక్స్‌ ప్రారంభం.. వివరాలివే!

Connplex Cinemas: థియేటర్లకు జనాలు రావడం లేదని సినిమా వాళ్లు చెబుతూనే ఉన్నారు. మరో వైపు మల్టీఫ్లెక్స్ థియేటర్ల నిర్మాణం జరుగుతూనే ఉంది. తాజాగా హైదరాబాద్‌లోని పంజాగుట్ట ఏరియాలో ఉన్న నాగార్జున సర్కిల్‌లో ఓ లగ్జరీ మల్టీప్లెక్స్‌ను బుధవారం (సెప్టెంబర్ 24) ఘనంగా ప్రారంభించారు. విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలి భాగస్వామ్యంలో నిర్మించిన ఈ కాన్‌ప్లెక్స్ సినిమాస్ (Connplex Cinemas) లగ్జరియన్ థియేటర్‌ లాంచింగ్‌కు.. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్, స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ, ఎస్. రాధాకృష్ణ (చినబాబు), నిర్మాత నాగవంశీ, ప్రణీత్ గ్రూప్ ఎండీ నరేంద్ర కామరాజు వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ మల్టీఫ్లెక్స్‌లో మొట్టమొదటి సినిమాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా ‘ఓజీ’ (Pawan Kalyan OG) విడుదల కాబోతోంది.

Also Read- Operation Numkhor: భారతదేశంలోకి అక్రమంగా లగ్జరీ కార్ల తరలింపులో కదులుతున్న డొంక – లిస్ట్‌లో ప్రముఖ నటులు!

ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌‌ను సందర్శించాలి

ప్రారంభోత్సవం అనంతరం తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Gaddam Prasad Kumar) మాట్లాడుతూ.. తెలంగాణలో కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌‌ను నిర్మించిన వారికి నా అభినందనలు. ఈ మల్టీఫ్లెక్స థియేటర్ చాలా బాగుంది. ప్రతీ ఒక్కరూ, ఒక్కసారైనా ఈ మల్టీప్లెక్స్‌ను సందర్శించాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి సినీ హీరో సిద్దు, నిర్మాతలు చినబాబు, నాగవంశీ రావడం ఆనందంగా ఉందని తెలిపారు. స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) మాట్లాడుతూ.. కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్‌ ప్రారంభోత్సవానికి నన్ను కూడా ఆహ్వానించినందుకు థాంక్స్. ఈ థియేటర్ చాలా బాగుంది. స్క్రీన్ నాకు చాలా నచ్చింది. ఈ రోజు ఇక్కడికి రావడం చాలా ఆనందంగా ఉంది. మంచి సెంటర్‌లో ఇలాంటి మల్టీఫ్లెక్స్ అందుబాటులోకి తెచ్చిన విజ్ఞాన్ యార్లగడ్డ, హర్ష కొత్తపల్లి, సుజిత్ రెడ్డి గోలిలకు నా అభినందనలు తెలియజేస్తున్నానని అన్నారు.

Also Read- Reba Monica John: ‘కూలీ’ సినిమాపై సంచలన వ్యాఖ్యలు.. అప్పుడలా, ఇప్పుడిలా అంటూ నెటిజన్లు ఫైర్!

‘ఓజీ’తోనే ప్రారంభం

అనంతరం ఈ థియేటర్ స్థాపకులలో ఒకరైన విజ్ఞాన్ యార్లగడ్డ మాట్లాడుతూ.. కాన్‌ప్లెక్స్ సినిమాస్ లగ్జరియన్ థియేటర్ ప్రారంభోత్సవానికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు. ఇది గుజరాత్ బ్రాండ్. దేశ వ్యాప్తంగా 250కి పైగా స్క్రీన్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఇదే మొదటి థియేటర్ అని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. యూఎస్‌లో మాస్టర్స్ చేసిన మేము ముగ్గురుం కలిసి ఈ థియేటర్‌ను ప్రారంభించాం. ఆడియెన్స్‌కి లగ్జరీ సీటింగ్, అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వాలనే ఈ థియేటర్‌ను ప్రారంభించాం. మూడు స్క్రీన్లలో కలిపి 171 సీటింగ్ కెపాసిటీ ఉంటుంది. త్వరలోనే మరో రెండు స్క్రీన్లను యాడ్ చేస్తాం. భవిష్యత్తులో ఏపీ, తెలంగాణలో చాలా ఏరియాల్లో ఈ స్క్రీన్లను ప్రారంభించాలని అనుకుంటున్నాము. అన్ని చిత్రాలకు ఫస్ట్ డే ఫస్ట్ షోని ఇక్కడ ప్రారంభిస్తాం. ‘ఓజీ’ మూవీతో మా స్క్రీన్లను ప్రారంభించబోతున్నందుకు హ్యాపీ. అందరూ వచ్చి మా థియేటర్‌ను సందర్శించాలని కోరుతున్నామని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Medchal News: వివాదంలో శ్రీ శివ్వంపేట పోచమ్మ-మైసమ్మ ఆలయం.. నోటీసులు జారీ..!

Gold Price Today: అతి భారీగా పెరిగి బిగ్ షాకిచ్చిన గోల్డ్ రేట్స్?

SEBI Warning: మెరిసే ప్రతి పెట్టుబడి సురక్షితం కాదు.. డిజిటల్ గోల్డ్‌పై జాగ్రత్త.. SEBI హెచ్చరిక

RV Karnan: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సర్వం సిద్ధం: ఎన్నికల అధికారి కర్ణన్

Bigg Boss Malayalam Winner: బిగ్ బాస్ మలయాళం సీజన్ 7 విజేతగా నటి అనుమోల్.. ప్రైజ్‌మనీ ఎంతంటే?