Jangaon: పురిటి నొప్పులతో భాధ పడుతున్న ఓ గర్భిణికి 108 వాహానం ఆలస్యం అవుతుండగా, ప్రసవం కోసం ఆటోలో తరలిస్తుండగా మార్గమధ్యలోనే పురిటి నొప్పులు అధికం కావడంతో ఆశ వర్కర్లు ప్రసవం చేసి మగబిడ్డ ప్రాణాలు నిలిపారు. మగబిడ్డకు పురుడు పోసి ఆశ వర్కర్లు ఆ బాబు పాలిట దైవాలుగా నిలిచారు. ఈ సంఘటన సాయంత్రం జనగామ (Jangaon) జిల్లా లింగాల ఘనపురం నెల్లుట్ల గ్రామంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే లింగాల ఘనపురం మండల కేంద్రానికి చెందిన ఏదునూరి కనకలక్ష్మీ(22)కి పురిటి నొప్పులు వచ్చాయి. దీంతో కనకలక్ష్మీ భర్త ఉపేందర్ 108కు ఫోన్ చేయగా ఆలస్యం అవుతుంది అని సమాధానం ఇచ్చారు.
Also Read: Khammam district: ఖమ్మం జిల్లా గంగారంతండాలో.. యువ శాస్త్రవేత్త అశ్విని గుడి కట్టించి విగ్రహం ఏర్పాటు
ఆటోలోనే పురిటి నొప్పులు
దీంతో కనకలక్ష్మీ బందువైన శ్రీశైలంకు తన ఆటోలో జనగామ ఎంసీహెచ్‌కు తరలిస్తుండగా ఆటోలోనే పురిటి నొప్పులు అధికమయ్యాయి. శ్రీశైలంకు తెలిసిన నెల్లుట్లకు చెందిన ఆశ వర్కర్లకు ఫోన్‌లో సమాచారం అందించారు. విధులు ముగించుకుని ఇంటికి వెళుతున్న ఆశ వర్కర్లు చీటూరి అరుణ, కోండ్ర పుష్ప, జెగ్గం ఉమలు నెల్లుట్ల రోడ్డుపైనే ఆటోను ఆపి గర్భిణికి ప్రసవ చర్యలు తీసుకున్నారు. దీంతో మగబిడ్డ జన్మించాడు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. ఇంతలోనే 108కు అక్కడి చేరుకోవడంతో చికిత్స కోసం జనగామ ఎంసీహెచ్‌కు తరలించారు.
రోడ్డు మీదనే కాన్పు
ఈ సందర్భంగా ఆశ వర్కర్లకు కనకలక్ష్మీ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలుపగా, పలువురు అభినందించారు. ఈ సందర్భంగా ఆశ వర్కర్ అరుణ మాట్లాడుతూ మేము విధులు ముగించుకుని ఇంటికి పోతుండగా, ఆటో డ్రైవర్ ఫోన్ చేసి సమాచారం ఇవ్వడంతో రోడ్డు మీదనే కాన్పు చేయాల్సి వచ్చిందన్నారు. ఆటోలోనే కాన్పు చేసిన్పటికి బాబు ఆరోగ్యంగా ఉన్నాడని తెలిపారు. కాన్పు చేసినందుకు ఎంతో సంతోషంగా ఉందని, ప్రభుత్వం ఇచ్చిన శిక్షణ ఇలా ఉపయోగపడిందన్నారు.
Also Read: Bhadrachalam: భద్రాచలం ఎమ్మెల్యే పిఏ నవాబ్ ఆగడాలు.. రూ.3.60 కోట్లు ఇవ్వాలని డిమాండ్!
