Begari Vishnu (image Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Begari Vishnu:పేదరికాన్ని జయించి.. పీహెచ్‌డీ పట్టా

Begari Vishnu: తెలంగాణ ఉద్యమంలో ఓయూ వేదికగా కీలక పాత్ర పోషించిన విద్యార్థి నాయకుడు బేగారి విష్ణు(Begari Vishnu) పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలం పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బేగారి విష్ణు ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ విభాగంలో ప్రొఫెసర్ అమరేందర్ రెడ్డి(Professor Amarender Reddy) పర్యవేక్షణలో విష్ణు ‘సర్వ శిక్ష అభియాన్: ఇంపాక్ట్ ఆన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇన్ గవర్నమెంట్ స్కూల్స్ ఆఫ్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ స్టేట్’ అనే అంశంపై పరిశోధన చేసి పీహెచ్‌డీ పట్టా అందుకున్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

పార్ట్ టైం ఉద్యోగాలు

ఇటీవల జరిగిన ఓయూ స్నాతకోత్సవంలో విష్ణుకు గవర్నర్‌, వీసీ పట్టా అందించారు. తమ గ్రామానికి చెందిన యువకుడు పీహెచ్‌డీ పట్టా పొందడం పోతిరెడ్డిపల్లి గ్రామస్తులు, సన్నిహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బేగారి విష్ణు చిన్ననాటి నుంచి పేదరికంలోనే మగ్గారు. మారుమూల గ్రామానికి చెందిన ఆయన చదువు కోసం పడరాని కష్టాలు పడ్డారు. ప్రభుత్వ పాఠశాలలు, కాలేజీల్లోనే ఆయన విద్య కొనసాగించారు. పాఠశాల విద్య మొదలు పీహెచ్ డీ వరకు చదువు అలాగే కొనసాగింది. పేదరికంతో చదువుకునేందుకు ఆర్థిక ఇబ్బందులు రావడంతో పార్ట్ టైం ఉద్యోగాలు చేస్తూ చదువును కొనసాగించారు. చివరకు తన లక్ష్​యమైన పీహెచ్‌డీ పట్టాను ఓయూ వీసీ మొలుగారం కుమార్ చేతుల మీదుగా అందుకున్నారు. అనేక సామాజిక ఉద్యమాల్లోనూ చురుకుగాఉండేవారు. తెలంగాణ ఉద్యమంలోనూ చురుకుగా పాల్గొన్నారు.

 Also Read: Jogulamba Gadwal: గద్వాల జిల్లాలో ప్రైవేట్ స్కూల్‌ల దుర్మార్గాలు.. ఫీజుల కోసం విద్యార్థులపై దాడులు

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!