Nizamabad Crime: తమకు తెలిసిన దుకాణంలో పని చేస్తున్న మహిళే కదా అని పరి చయం పెంచుకుని ఇంట్లోకి రానిస్తే.. ఆ ఇంట్లోనే చోరీకి పాల్పడి సీసీ కెమెరాలకు అడ్డంగా దొరికిపో యిన ఘటన నగరంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నగరంలోని కుమార్గల్లీలో నివా సముంటున్న విషన్ తమ ఇంట్లోని గ్రౌండ్ ఫ్లోర్ను ఓ బ్యూటీపార్లర్ నిర్వాహకురాలికి అద్దెకిచ్చారు. అందులో నిర్మల్ జిల్లాకు చెందిన గాయత్రి అలియాస్ గౌతమి (37) (ప్రస్తుతం వినాయక్ నగర్లో అద్దెకుంటోంది) పనిచే సేది. ఆమె ఇంటి యజమాని, ఆయన కుటుంబ సభ్యులతో స్నేహం చేసి ఇంట్లో కలివిడిగా తిరు గుతూ నమ్మకంగా ఉండేది.
Also Read:Nizamabad Crime: రియల్ ఎస్టేట్‌లో మాఫియా లేడి.. నమ్మించి రూ.లక్షల్లో వసూలు.. అరెస్ట్ చేసిన పోలీసులు
బీరువాలోని 18 తులాల బంగారం
పూర్తిగా నమ్మకం ఏర్ప డిన తర్వాత గాయత్రి విషన్ ఇంటి తాళం చెవిని సంపాదించి నకిలీది తయారు చేయించింది. వారు బయటకు వెళ్లినప్పుడల్లా ఇంట్లోంచి డబ్బులు ఎత్తు కెళ్లేది. తాళం వేసింది వేసినట్లే ఉండగా.. డబ్బులు ఎలా పోతున్నాయనే అనుమానంతో ఇంటి యజమాని స్పై సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. ఈ విషయం తెలియని గాయత్రి ఎప్పటిలాగే ఇటీవల ఇంట్లో చొరబడి బీరువాలోని 18 తులాల బంగారు, కిలో పావు వెండి ఆభరణాలు, కొంత నగదు ఎత్తుకెళ్లింది. ఇదంతా అక్కడ ఉన్న కెమె రాలో నిక్షిప్తం కావడంతో చోరీ విషయం బయటప డింది. శుక్రవారం విషన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సదరు మహిళను అదుపులోకి తీసుకుని విచారించారు. చోరీకి గురైన కొంత బంగారం, వెండి ఆభరణాలతోపాటు నగదు స్వాధీనం చేసుకున్నామని ఎస్ఎచ్వో రఘుపతి తెలిపారు. విచారణ కొనసాగుతుందని పేర్కొన్నారు.
Also Read: Nizamabad Crime: తల్లి కోసమే హత్య? కారు డిక్కీ డెడ్ బాడీ కేసులో సంచలన నిజాలు..
