Nizamabad Crime: భూములు ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి అక్రమంగా ప్రజల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న మహిళను నిజామాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. సౌత్ రూరల్ సీఐ సురేష్ తెలిపిన వివరాల ప్రకారం.. నిజామాబాద్ కు చెందిన స్వర్ణ ప్రమీల.. మోపాల్ పోలీసు స్టేషన్ పరిధిలో ఐదుగురు వ్యక్తులకు మూడు ఎకరాల భూమి ఇప్పిస్తానని చెప్పి నమ్మించింది. వారి వద్ద నుంచి రూ.38,15,000 డబ్బులు తీసుకొని మోసం చేసింది.
Also Read: Ind vs Aus 4th T20: వారెవా.. మ్యాచ్‌ను తిప్పేసిన స్పిన్నర్లు.. నాలుగో టీ20లో భారత్ గ్రాండ్ విక్టరీ
కేసు నమోదు చేసిన మోపాల్ పోలీసులు నిందితురాలిని గురువారం అరెస్టు చేశారు. ఆమె వద్ద నుంచి బాధితులు సంతకాలు చేసిన ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లను స్వాధీనం చేసుకుని రిమాండ్ కు తరలించారు. సదరు మహిళ చేతిలో మోసపోయిన బాధితులు ఇంకా ఎవరైనా ఉంటే తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేయాలని సీఐ కోరారు. బాధితులు ఫిర్యాదు చేస్తే తగిన చర్య తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజలను మోసం చేస్తూ అక్రమంగా డబ్బులు సంపాదించాలని చూసే వారిపై చట్టరీత్యా కఠినమైన చర్యలు తీసుకుంటామని సీఐ హెచ్చరించారు. ఆయన వెంట మోపాల్ ఎస్సై సుస్మిత, ఇతర సిబ్బంది ఉన్నారు.
