Ind vs Aus 4th T20: భారత బ్యాటర్లు తడబడినట్టు అనిపించినప్పటికీ.. మన స్పిన్నర్లు నిలబడ్డారు, మ్యాచ్‌ను మలుపు తిప్పేశారు. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా క్వీన్స్‌లాండ్ వేదికగా జరిగిన నాలుగవ మ్యాచ్‌లో టీమిండియా గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఆతిథ్య ఆస్ట్రేలియాను 48 పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది. 168 పరుగుల లక్ష్య చేధనలో ఆస్ట్రేలియా జట్టు 18.2 ఓవర్లలో 119 పరుగులకు ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ల ముందు ఆసీస్ బ్యాటర్లు తేలిపోయారు. వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 1 కలిపి వీరు ముగ్గురు ఆరు వికెట్లు పడగొట్టారు.
ఆసీస్ ఓపెనర్లు మిచెల్ మార్ష్, మాథ్యూ షార్ట్ తొలి వికెట్‌కు 37 పరుగులు జోడించడంతో చక్కటి ఆరంభం దక్కినట్టు అయింది. ఆ తర్వాత జాష్ ఇంగ్లిస్ కూడా ఫర్వాలేదనించడంతో ఆసీస్ లక్ష్యాన్ని చేరుతుందేమోనని అనిపించింది. కానీ, ఆ తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగడంతో వెంటవెంటనే వికెట్లు పడ్డాయి. దీంతో, భారత్ ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. 2 కీలకమైన వికెట్లు తీయడంతో పాటు బ్యాటింగ్‌లో 11 బంతుల్లోనే 21 పరుగులు సాధించిన ఆల్ రౌండర్ అక్షర్ పటేల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
Read Also- Duvvada Couple: దువ్వాడ జంట మంచి మనసు.. కాశీబుగ్గ బాధితులకు ఆర్థిక సాయం.. మేమున్నామంటూ భరోసా!
తబడిన ఆసీస్ బ్యాటింగ్..
మిచెల్ మార్ష్ 30, మ్యాథ్యూ షార్ట్ 25, జాష్ ఇంగ్లిష్ 12, టిమ్ డెవిడ్ 14, జాష్ ఫిలిప్ 10, మార్కస్ స్టోయినిస్ 17, గ్లెన్ మ్యాక్స్‌వెల్ 2, బెన్ 5, జావీయర్ బార్ట్‌లెట్ 0, నాథన్ ఎల్లీస్ 2 (నాటౌట్), ఆడమ్ జంపా 0 చొప్పున పరుగులు చేశారు. భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు, అక్షర్ పటేల్ 2, వరుణ్ చక్రవర్తి 1 వికెట్‌తో పాటు శివమ్ దూబే 2, అర్షదీప్ సింగ్, జస్ప్రీత్ బుమ్రా చెరో వికెట్ తీశారు. 5 మ్యాచ్‌లో సిరీస్‌లో తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దవ్వగా, ఆ తర్వాత జరిగిన మూడు మ్యాచ్‌ల్లో రెండింట భారత్, ఒకదాంట్లో ఆస్ట్రేలియా గెలిచాయి. చివరిదైన 5వ మ్యాచ్‌లో సిరీస్ ఎవరిదనేది తేలుతుంది. భారత్ గెలిస్తే 3-1 తేడాతో కైవసం చేసుకోవచ్చు. ఒకవేళ చివరి మ్యాచ్‌లో ఆసీస్ గెలిస్తే మాత్రం 2-2 తేడాతో సిరీస్ సమం అవుతుంది.
Read Also- Memory Improvement: ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెంచే అద్భుతమైన హెల్త్ టిప్స్
భారత బ్యాటింగ్
ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లు ఆడి 8 వికెట్ల నష్టపోయి 167 పరుగుల స్కోరు సాధించింది. శుభ్‌మన్ గిల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోరుతో కాస్త ఫర్వాలేదనిపించగా, మిగతా బ్యాటర్లు అంచనాలకు తగ్గట్టు రాణించలేదు. అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ చక్కటి ఆరంభాన్ని అందించారు. తొలి వికెట్‌కు 40 బంతుల్లో 56 పరుగులు జోడించారు. అభిషేక్ శర్మ 28, శుభ్‌మన్ గిల్ 46 పరుగుల వ్యక్తిగత స్కోర్ల వద్ద ఔటయ్యారు. శివమ్ దూబే 22, సూర్యకుమార్ యాదవ్ 20, తిలక్ వర్మ 5, జితేష్ శర్మ 3, వాషింగ్టన్ సుందర్ 12, అక్షర్ పటేల్ 21 (నాటౌట్), అర్షదీప్ సింగ్ 0, వరుణ్ చక్రవర్తి 1 (నాటౌట్) చొప్పున పరుగులు సాధించారు. ఆసీస్ బౌలర్లలో ఎల్లీస్, ఆడమ్ జంపా చెరో 3 వికెట్లు, జావీయర్, స్టోయినిస్ చెరో వికెట్ తీశారు.
