Nano Urea (IAMGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Nano Urea: రైతన్నలకు గుడ్ న్యూస్…ఈ యూరియాతో పంట దిగుబడులు పెరగడం ఖాయం

Nano Urea: నానో యూరియా  రైతు మిత్రుడు, పర్యావరణ సంరక్షకుడు అని జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ అన్నారు. జిల్లా వ్యవసాయ శాఖ, ఇఫ్కో ఆధ్వర్యంలో చౌటుకూరు మండల కేంద్రం లోని రైతులతో నానో యూరియా వినియోగంపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న నానో యూరియా రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ఇఫ్కో సంస్థ ఆధ్వర్యంలో నానో యూరియా తయారు చేసి రైతులకు అందుబాటులో ఉంచుతోంది.

 Also Read: Urea Shortage: తొర్రూరులో యూరియా కోసం.. కాళ్లు పట్టుకున్న రైతులు

రైతుల జీవితాలను మార్చే సాంకేతిక ఆవిష్కరణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నానో యూరియా(Nano Urea) వాడకంపై అవగాహన కార్యక్రమాలు చేపట్టి, రైతులు(Farmers) నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయని అన్నారు. నానో యూరియా(Nano Urea) ప్రస్తుతం రైతుల(Farmers) జీవితాలను మార్చే సాంకేతిక ఆవిష్కరణగా నిలుస్తోంది అన్నారు. నానో టెక్నాలజీ ఆధారంగా తయారైన ఈ ఎరువు వాడకం వల్ల పంట దిగుబడులు పెరుగుతాయి, భూమి సారవంతం అవుతుందన్నారు., రైతుల(Farmers) ఖర్చులు తగ్గుతాయి అన్నారు.నానో యూరియా(Nano Urea) అనేది యూరియాను నానో టెక్నాలజీ ద్వారా ద్రవరూపంలో తయారు చేసిన ఎరువు. సాధారణ యూరియా, నానో స్థాయిలో (20–50 నానోమీటర్ల పరిమాణం) మార్చి, స్ప్రే రూపంలో వాడేలా శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

 Also Read: Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?