Jogulamba Gadwal(image credit: sswetcha reporter)
నార్త్ తెలంగాణ

Jogulamba Gadwal: ఇంకెన్నాళ్లీ యూరియా కష్టాలు.. తెల్లవారుజాము నుంచే క్యూలో నిల్చున్న మహిళలు

Jogulamba Gadwal:  యూరియా కోసం తెల్లవారుజామున మూడు గంటల నుండి క్యూ లైన్‌లో రైతులు(Farmers) నిల్చున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా(Jogulamba Gadwal District) కేంద్రంలో రైతుల(Farmers) ఆవేదన మరోసారి బయటపడింది. తెల్లవారుజామున మూడు గంటల నుండే గద్వాల(Gadwala) మండలానికి చెందిన వందలాది మంది రైతులు(Farmers) గద్వాల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (PACS) కార్యాలయం ముందు క్యూ లైన్‌లో నిలబడి యూరియా ఎరువుల కోసం బారులు తీశారు. వానాకాలం పంటల పనులు ఉద్ధృతంగా సాగుతున్న తరుణంలో ఎరువుల కొరత తీవ్రంగా ఉంది. దాంతో మహిళలు, రైతులు(Farmers) రాత్రి పూటే ఇళ్ల నుంచి బయలుదేరి, గంటల తరబడి లైన్లలో వేచి ఉండే పరిస్థితి ఏర్పడింది.

 Also Read: Jubilee Hills Byelection: జూబ్లీ‌హిల్స్ ఉప ఎన్నికకు ఏర్పాట్లు షురూ.. నోటిఫికేషన్ ఎప్పుడంటే?

కొందరు రైతులు(Farmers) ఆహారం కూడా తీసుకోకుండా తాగునీరు లేకపోయినా సహనం కోల్పోకుండా క్యూలోనే ఎదురుచూస్తున్నారు.ఎరువుల కోసం ఇన్ని కష్టాలు పడినా సరిపడా అందడం లేదు. కొందరికి లభిస్తే, మరికొందరికి దక్కడం లేదు. రైతుల(Farmers) సమస్యలను అధికారులు సకాలంలో పరిష్కరించకపోతే పంటల నష్టం తప్పదు.”స్థానికంగా డిమాండ్ ఎక్కువగా ఉండటం, సరఫరా తక్కువగా రావడంతో ఈ పరిస్థితి నెలకొంది. గడిచిన వారం రోజులుగా PACS కేంద్రాల ముందు ఇలాంటి క్యూలైన్లు తరచూ కనిపిస్తున్నాయి. ఎరువులు సరిపడా లభించడం లేదని, కొందరు మధ్యవర్తుల చేతుల్లోకే చేరుతున్నాయన్న ఆరోపణలు ప్రయత్నం నుంచి వస్తున్నాయి.

అరకొర స్టాక్ తో రైతుల ఇబ్బందులు

గత రెండు నెలలుగా అరకొర నిల్వలు ఉండడంతో రైతులు(Farmers) తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే జిల్లాకు కేటాయించిన యూరియా అయిపోవడంతో కొరత ఏర్పడింది.అదనపు యూరియా కొద్దిపాటిగా వస్తున్నడంతో కేవలం ఒక్క రోజుకే సరిపోతుంది. వచ్చిన రైతుల(Farmers)కు టోకెన్ ఇచ్చి పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం వరి సాగు విస్తీర్ణం పెరగడంతో గద్వాల(Gadwala) తాలూకాలో వరి వినియోగం పెరిగింది. దీంతో పిఎసిఎస్ కార్యాలయం చుట్టూ రైతులు(Farmers) తిరగాల్సి వస్తుంది. స్టాక్ అయిపోయిందని,నేడు,రేపు వస్తుంది అని అంటూ అధికారులు రైతులకు సూచిస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే అదనపు యూరియా బస్తాలను గద్వాల(Gadwala) జిల్లా కేంద్రానికి పంపాలని,PACS కార్యాలయాల ద్వారా పారదర్శకంగా పంపిణీ జరిగేలా చూడాలని, రైతుల అవస్థలు గమనించి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?

Tummala Nageshwar Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇకపై రైతు వేదికల వద్ద యూరియా అమ్మకం

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!