Warangal District: వరంగల్ జిల్లాలోని నల్లబెల్లి తహశీల్దార్ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ ఆత్మహత్య యత్నానికి పాల్పడింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తహసిల్దార్ కార్యాలయం లో పనిచేసే వాంకుడోత్ కల్పన(Wankudoth Kalpana) సోమవారం సాయంత్రం పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అంతకు ముందు ఆమె రాసిన సూసైడ్ నోట్ లో రాసిందాన్ని బట్టి చరణ్ సింగ్ వేదింపులు కారణంగానే ఆత్మహత్య యత్నానికి పాల్పడినట్టు పేర్కొంది. వెంటనే ఆమెను నర్సంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Also Read: GHMC: స్ట్రీట్ లైట్ల నిర్వహణ కోసం ప్రభుత్వం కసరత్తు.. త్వరలో టెండర్లు
సూసైడ్ నోట్‌లో సంచలన ఆరోపనలు
ఆత్మహత్యకు ముందు తను రాసుకున్న సుసైడ్ నోట్ లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బిల్ నాయక్ తండాకు చెందిన మాలోతు చరణ్ సింగ్ అనే వ్యక్తి వల్లనే తన వేదింపులకు కారణం అని అందులో రాసింది. తనపై తప్పుడు ఆరోపణలు చేస్తు నేను అతనికి లోంగక పోవడంతో తనను ఇబ్బంది పెట్టేవాడని తెలిపింది. తనపై జిల్లా కలెక్టర్ కు పదే పదే ఫిర్యాదులు చేసేవాడని, పత్రికలలో తనపై తప్పుడు ఆరోపణలు చేయించే వాడని తన లేఖలో పేర్కోంది. సైసైడ్ నోట్ ఆదారంగా దీంతో పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో స్ధానికంగా కలంకలం రేపింది.
ఓక ప్రభుత్వ ఉద్యోగికే మహిళా ఉద్యోగిని ఇంత దారుణంగా వేదిస్తే.. ఇక సాదారణ ప్రజల పరిస్తితి ఏంటని, ఆ వేదింపులు బరించలేక ఆత్మహత్యయత్నం పాల్పడడంతో అక్కడి ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ఇ సంఘటనకు సంబందించిన బాద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని అక్కడి స్ధానికులు డిమాండ్ చేస్తున్నారు.
Also Read: Rajinikanth- Kamal Haasan: ఇద్దరు పెద్ద హీరోలతో ఒక సక్సస్‌ఫుల్ దర్శకుడు.. ఇక బాక్సాఫీస్ బద్దలే