Nagarkurnool District Collector: పశువులను మేపుతూ కూడా చదువుపై అంకితభావంతో పీహెచ్‌డీ(PHD) పట్టా సాధించిన యువకుడిని నాగర్‌కర్నూల్ జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ అభినందించారు. జిల్లాలోని బల్మూర్ మండలం కొండనాగుల గ్రామానికి చెందిన పరమేష్(Pramesh) కార్మికుడిగా ఉంటూ, 14 ఏళ్లకు పాఠశాలలో ఏడోవ తరగతి చేరి బ్రిడ్జి కోర్స్(Bridge Crse) పద్ధతిలో విద్యనభ్యసించి పీహెచ్డీ సాధించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్(Collector Badawat Santosh) పీహెచ్‌డీ పట్టాసాధించిన పరమేశ్‌ను శాలువాతో సత్కరించి అభినందించారు.
ఉస్మానియా యూనివర్సిటీలో
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చదువు నుంచి దూరంగా ఉన్న యువతకు పరమేష్ ఒక స్ఫూర్తిదాయక వ్యక్తిగా నిలుస్తున్నారని, అతని విద్యా జీవితం ఎంతో మందికి మార్గదర్శకమవుతుందని అన్నారు. పశువుల కాపరిగా ఉంటూ, 14 ఏళ్ల తర్వాత నేరుగా ఏడో తరగతిలో పాఠశాలలో చేరి నేడు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో పీహెచ్డీ పూర్తి చేయడం జిల్లాలోని చదువుకు దూరంగా ఉంటూ చదువుకోలేకపోతున్నామనే యువతకు స్ఫూర్తిగా నిలిచాడని కలెక్టర్ ఈ సందర్భంగా కొనియాడారు.
Also Read: Handloom Workers Loan: చేనేత కార్మికులకు గుడ్ న్యూస్.. మంత్రి తుమ్మల
అవకాశాలు అన్వేషిస్తే ప్రతిభ
చదువుకు దూరంగా ఉన్న యువతను సైతం మార్గనిర్దేశించగల శక్తి పరమేష్ కలిగి ఉన్నాడని, అతని జీవన ప్రయాణం వారికి స్ఫూర్తిగా నిలుస్తుందని, పశువులు మేపుతూ జీవితం గడిపిన యువకుడు నేడు డాక్టరేట్ సాధించి ఎంతో మంది యువతకు స్ఫూర్తిగా నిలిచాడని, అతని అంకితభావాన్ని అభినందించారు. అవకాశాలు అన్వేషిస్తే ప్రతిభ బయటపడతుందని, పరమేష్(Paramesh) జీవితం అందుకు నిలువెత్తు ఉదాహరణ అన్నారు. జిల్లాలో చదువుకు దూరంగా ఉంటున్న యువతకు స్ఫూర్తిదాయకంగా నిలవడం వారికి జిల్లాలో విద్యాపరంగా విద్యార్థులకు ప్రేరణ తరగతులను అందించేందుకు పరమేష్ సేవలు వినియోగించుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.
Also Read: MLC Kavitha: స్థానిక ఎన్నికల్లో జాగృతి పోటీ.. కేటీఆర్ ను అడుగుదాం.. ఎమ్మెల్సీ కవిత