MLC Kavitha ( Image Source: Twitter)
తెలంగాణ

MLC Kavitha: స్థానిక ఎన్నికల్లో జాగృతి పోటీ.. కేటీఆర్‌ ను అడుగుదాం.. ఎమ్మెల్సీ కవిత

MLC Kavitha: స్థానిక సంస్థల ఎన్నికల్లో జాగృతి నాయకులు పోటీ చేయాలని అనుకుంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి విజ్ఞప్తి చేయండి అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సూచించారు. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో గురువారం మీడియాతో చిట్ చాట్ చేశారు. లోకల్ బాడీ ఎన్నికల్లో 80% స్థానాల్లో గులాబీ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలు విసిగిపోయి ఉన్నారని వ్యాఖ్యానించారు. జాగృతి కార్యక్రమాలకు బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారని, తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనేనని స్పష్టం చేశారు. మీ సమస్యలపై కేటీఆర్‌కు రాత పూర్వకంగా లేఖ రాయండి అంటూ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశానన్నారు. రైల్ రోకో కార్యక్రమానికి మద్దతు కోసం ఈ నెల 10న అన్ని పార్టీలకు లేఖ రాస్తానని, బీఆర్ఎస్ పార్టీకి సైతం ఇస్తానని స్పష్టం చేశారు. నిరుద్యోగుల ఛలో సెక్రటేరియట్ కార్యక్రమానికి జాగృతి సంపూర్ణ మద్దతు ఇస్తుందని వెల్లడించారు. జర్నలిస్టుల అక్రిడిటేషన్ పదేపదే పొడిగింపు సరైంది కాదని, కొత్తవ ఇవ్వాలని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి లేఖ రాస్తానని స్పష్టం చేశారు.

 

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!