Handloom Workers Loan: చేనేత కార్మికులకు లక్ష వరకు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ప్రభుత్వం చేనేతల రుణమాఫీ కోసం రూ.33కోట్లకు పరిపాలన అనుమతులు జారీ చేసింది. 5,691 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరుతుంది. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు , జిల్లా సహకార కేంద్ర బ్యాంకుల్లో చేనేత వస్త్రాల ఉత్పత్తి, వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకొన్న రూ. లక్ష వరకు రుణాల (అసలు, వడ్డీ కలిపి)కే మాఫీ వర్తిస్తుంది.
మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాల వారిగా లబ్ధిదారుల వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతుంది. వెరిఫికేషన్ పూర్తయిన వెంటనే కార్మికుల ఖాతాలలో రుణమాఫీని జమ చేయడం జరుగుతుంది. రుణ మాఫీ జరిగిన అనంతరం చేనేత కార్మికులు కోరుకుంటే బ్యాంకర్లు మళ్లీ ఆ మేరకు రుణాన్ని బ్యాంకులు మంజూరు చేయనున్నాయి.
Also Read: Bhanakacherla Project: మాకు సీమ రొయ్యల పులుసు అవసరం లేదు!
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి చేనేత కార్మికుల(Handloom Workers) సంక్షేమం( కోసం దాదాపు రూ.920 కోట్లు ఖర్చు చేశామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Min Tummala Nageswara Rao) తెలిపారు. చేనేత కార్మికులకు ఎల్లప్పుడు పనికల్పించాలనే ఉద్ధేశ్యంతో అన్ని ప్రభుత్వ శాఖలు టీజీసీఓ(తెలంగాణ టెస్కో) నుంచే వస్త్రాలు కొనుగోలు చేయాలని ఆదేశాలు ఇచ్చామని, అందుకు అనుగుణంగా ఇప్పటికే 579 కోట్ల విలువైన వస్త్రాలకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి ఆర్ఢర్లు వచ్చాయని అన్నారు.
ఇందిరా మహిళాశక్తి(Indira’s Women Power) చీరల పథకం ద్వారా సిరిసిల్లలోని 16 వేల మరమగ్గాలకు నిరంతరం పని కల్పించడానికి చర్యలు తీసుకున్నామన్నారు. రూ.193 కోట్లు చేనేత అభయహస్తం పథకాన్ని అమలు చేస్తున్నామని, గత ప్రభుత్వం కార్మికులకు చెల్లించకుండా పెండింగ్ లో పెట్టిన రూ. 290 కోట్లను నేతన్నకు చేయూత పథకం కింద కార్మికుల ఖాతాలలో జమ చేశామన్నారు. మా ప్రభుత్వం చేనేత కార్మికుల అభివృద్ధి కోసం కట్టుబడి ఉందని వెల్లడించారు.
Also Read; Minister Jupally Krishna Rao: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై.. జూపల్లి కీలక వాఖ్యలు!