Bhanakacherla Project: తనకు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి రాయలసీమ రొయ్యల పులుసుతో పని లేదని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కులు, అవసరాలతోనే తమ పని అంటూ క్లారిటీ ఇచ్చారు. ఇందుకోసం న్యాయమైన విధానంతో ఎక్కడైనా కొట్లాడేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం నొక్కి చెప్పారు. కృష్ణా బేసిన్‌లో తాము కట్టుకునే ప్రాజెక్టులకు ఏపీ అభ్యంతరాలు చెబుతోందని, నికర జలాల కేటాయింపు ఉన్న (Telangana projects) తెలంగాణ ప్రాజెక్టులకు అభ్యంతరాలు ఎందుకు అంటూ సీఎం నిలదీశారు.
చర్చలతోనే నీటి సమస్యలు, వాటాలు పరిష్కరించబడతాయని సీఎం వివరించారు. పెద్దన్న పాత్ర పోషించాల్సిన కేంద్రం లిటిగేషన్లు పెట్టడం విచిత్రంగా ఉన్నదన్నారు. బనకచర్ల వివాదాన్ని సృష్టించి బీఆర్ఎస్ (BRS) రాజకీయ లబ్ధి పొందాలని డ్రామాలు ఆడుతుందని మండిపడ్డారు. బీజేపీ (BJP) ఇందుకు స్పష్టంగా సహకరిస్తుందన్నారు. ఇందులో భాగంగానే (BRS) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) రచించిన స్క్రిప్టును కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ( Kishan Reddy) చదువుతున్నారని, పబ్లిక్ లోకి ఆయనే లీకులు ఇస్తున్నారని సీఎం మండిపడ్డారు.
Also Read: Negative Energy: ఆడవాళ్ళు ఎక్కడపడితే అక్కడ తలదువ్వుకుంటున్నారా? అయితే జరిగేది ఇదే!
బీఆర్ఎస్ (BRS ప్లానులన్నీంటినీ అమలు చేసేందుకు బీజేపీ సంపూర్ణంగా సహకరిస్తుందని సీఎం వెల్లడించారు. ఆయన ప్రజా భవన్‌లో జరిగిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో పాల్గొని ప్రసంగించారు. నీళ్లకు నాగరికతకు ఎంత సంబంధం ఉన్నదో, నీళ్లకు తెలంగాణ ప్రజలకు అంతే సంబంధం ఉన్నదని వివరించారు. మిగతా విషయాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా నీళ్ల విషయంలో తెలంగాణ ప్రజలందరికీ ఏకాభిప్రాయం ఉన్నదన్నారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత గత ప్రభుత్వంలో కేసీఆర్, (KCR) హరీశ్ సాగునీటి మంత్రులుగా ఉన్నారని గుర్తు చేశారు. నిర్లక్ష్యమో, అహంకారమో తెలియదు కానీ వారు తీసుకున్న నిర్ణయాలు తెలంగాణకు గుదిబండగా మారాయని స్పష్టం చేశారు. రాష్ట్ర విభజన సందర్భంలో నీళ్ల విషయంలో వివాదాలు తలెత్తుతాయని మన్మోహన్ సింగ్ రివర్ మేనేజ్మెంట్ బోర్డును ఏర్పాటు చేశారని వివరించారు. కానీ, బీఆర్ఎస్ ఆ బోర్డుకు ఎప్పుడూ స్పష్టమైన వివరాలు ఇవ్వలేదన్నారు.
కేసీఆర్, హరీశ్ సంతకాల వల్లే..
2015 జూన్ 18 సమావేశంలో తెలంగాణ ప్రాంతానికి మరణశాసనం రాసి నీటి కేటాయింపులపై కేసీఆర్, హరీశ్ సంతకాలు పెట్టి వచ్చారన్నారు. కల్వకుర్తి, పాలమూరు, ఎస్ఎల్బీసీ, బీమా, నెట్టెంపాడు వంటి నిర్మాణాలను గత ప్రభుత్వం పూర్తి చేయలేదన్నారు. దీంతో తెలంగాణకు 299 టీఎంసీలను వాడుకోలేకపోయామని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో మొదలు పెట్టిన ప్రాజెక్టులను పూర్తి చేయకపోవడం వల్లే ఆ నీటిని తెలంగాణ వాడుకోలేకపోయిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచన చేయలేదని విమర్శించారు.
కృష్ణా పరివాహక ప్రాంతంలో రైతుల పట్ల కేసీఆర్, హరీశ్ మరణశాసనం రాశారన్నారు. గోదావరి బేసిన్‌లో 1486 టీఎంసీలు ఉంటే 968 టీఎంసీలు తెలంగాణకు 518 టీఎంసీలు ఆంధ్రాకు కేటాయించారని గుర్తు చేశారు. తుమ్మిడిహట్టి వద్ద నిర్మించాల్సిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కేసీఆర్ (KCR) ధనదహంతో రీ ఇంజినీరింగ్ పేరుతో ఊరు పేరు అంచనాలు మార్చారన్నారు. లక్ష కోట్లు ఖర్చు చేసిన ప్రాజెక్టుతో 50 వేల ఎకరాలకు నీళ్లు ఇచ్చారని చెప్పారు. బనకచర్లపై కేసీఆర్, (KCR) హరీశ్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇలా అబద్ధాలు చెప్పడం వల్లే ఆ పార్టీ అధికారం కోల్పోయిందని, ఎంపీ ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోగా, ఇప్పుడు అభ్యర్థులే దొరకని పరిస్థితి నెలకొన్నదని సెటైర్లు వేశారు.
Also Read:Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి స్పందించిన టూరిజం శాఖ!
జగన్‌తో కలిసి కుమ్మక్కు..
3 వేల టీఎంసీలు వరద జలాలు ఉన్నాయని (KTR) కేసీఆర్‌కు ఏ దేవుడు చెప్పిండో కానీ, చంద్రబాబు దీన్ని అదనుగా తీసుకున్నారని సీఎం వివరించారు. అసలు ఈ రాచపుండు సృష్టించిందే కేసీఆర్ అని మండిపడ్డారు. చంద్రబాబు ప్రపోజల్‌కు కొనసాగింపుగా ఇదే ప్రజా భవన్‌లో జగన్‌కు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి కేసీఆర్, గోదావరి జలాలు తీసుకుపొమ్మన్నారని వివరించారు. ‘మా ఇంటికొస్తే ఏం తెస్తావ్.. మీ ఇంటికొస్తే ఏం ఇస్తావ్’ అనే విధానంతో వారు ముందుకెళ్లారని మండిపడ్డారు. గోదావరి బేసిన్‌లో తెలంగాణ పెండింగ్ ప్రాజెక్టులు పూర్తయిన తరువాతే మిగులు జలాల లెక్క తేలుతుందన్నారు. మిగులు, వరద జలాల లెక్క తేలాలంటే ఇరు రాష్ట్రాలు చర్చించుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
బీజేపీ చొరవ చూపాలి
ప్రజలకు నిజాలు చెప్పకపోతే బీఆర్ఎస్ (BRS) వాళ్లు చెప్పే అబద్ధాలే నిజమనుకుంటారని, దీన్ని పార్టీ నాయకులు కూడా జనాలకు స్పష్టత ఇచ్చేలా ప్రచారం చేయాలన్నారు. అవసరమైతే రెండు రోజుల పాటు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేస్తామని, ఒక రోజు కృష్ణా, మరోక రోజు గోదావరి బేసిన్‌లపై చర్చిస్తామన్నారు. స్పీకర్ ఫార్మాట్‌లో బీఆర్ఎస్ (BRS) లేఖ రాయాలని, ఈ రాచపుండును తెలంగాణ ప్రజలకు అంటగట్టింది ఎవరో తేలాల్సిన అవసరం ఉన్నదన్నారు. తమ శాశ్వతమైన నీటి హక్కులను సాధించుకునేందుకు స్పష్టమైన విధానంతో ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉన్నదని చెప్పారు.
ఇక, రాష్ట్రాల హక్కులను కాలరాయడానికి బీజేపీకి 8 మంది ఎంపీలను ఇవ్వలేదని సీఎం మండిపడ్డారు. బీజేపీ (BJP) నూతన అధ్యక్షుడు రామచందర్ రావుకు విజ్ఞప్తి చేస్తున్నానని, గోదావరి నదీ జలాల సమస్యను పరిష్కరించేందుకు చొరవ తీసుకోవాలన్నారు. ప్రధాని దృష్టికి తీసుకువెళ్లాలని, ఇందుకు కావాల్సిన సమాచారాన్ని తమ మంత్రులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు.
Also Read: Employees: సమస్యలపై ప్రశ్నించినోళ్ల ఇక్రిమెంట్లు కట్!