తెలంగాణ

Swetcha Effect: స్వేచ్ఛ కథనానికి స్పందించిన టూరిజం శాఖ!

Swetcha Effect: పీ వివక్ష. టీటీడీ (TTD) దర్శన టికెట్ల నిరాకరణ. తెలంగాణ టూరిజానికి ప్రతి నెలా 50లక్షల నష్టం’ అనే శీర్షికతో ‘స్వేచ్ఛ’ పత్రిక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనంపై తెలంగాణ టూరిజం శాఖ (Telangana Tourism Department) స్పందించింది. స్పెషల్ దర్శనం టికెట్ల కోటాను పునరుద్ధరించాలని మంగళవారం ప్రభుత్వ అనుమతి (ఎల్ఆర్ నెంబర్ 742/ టీఅండ్/పీఎంయూ/ఏ1/2024)తో టీటీడీ కార్యనిర్వాహక అధికారికి లేఖ రాసింది. భక్తుల సౌకర్యార్థం తెలంగాణ టూరిజం డెవల‌ప్‌మెంట్ కార్పొరేషన్‌కు రోజుకు 300 టికెట్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

Also ReadMahesh Kumar Goud: కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ పిలుపు!

2015 మే 4 నుంచి ఏపీలోని టీటీడీ 350 టికెట్లను టూరిజం శాఖకు కేటాయిస్తున్నదని అధకారులు గుర్తు చేశారు. గతేడాది 2024 డిసెంబర్ 1 నుంచి టీఎస్ ఆర్టీసీకి, టూరిజం శాఖకు స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్లను నిలుపుదల చేశారని తెలిపారు. దీంతో 2024 డిసెంబర్ నుంచి 2025 మే వరకు 6 నెలల్లో తిరుపతికి ప్యాకేజీ పర్యటనల రద్దుతో 14.28 కోట్ల రూపాయల నష్టం జరిగిందని వివరించారు. భక్తుల సౌకర్యార్థం టూరిజం శాఖ హైదరాబాద్, (Hyderabad) కాణిపాకం, శ్రీకాళహస్తి, తిరుమల వారాంతపు ప్యాకేజీతో బస్సు సర్వీసులను నడుపుతున్నదని చెప్పారు. వసతి, కొండ రవాణా, గైడ్ సేవల ప్యాకేజీలతో సర్వీసులను కొనసాగిస్తున్నదని లేఖలో వివరించారు.

Also Read: Etala Rajender: ఈటల ఓపికకు హైకమాండ్ పరీక్ష పెడుతోందా?

Just In

01

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు