Etala Rajender( image CREDIT: TWITTER)
Politics

Etala Rajender: ఈటల ఓపికకు హైకమాండ్ పరీక్ష పెడుతోందా?

Etala Rajender: తెలంగాణవాది, బీసీ సామాజికవర్గంలో కీలకమైన నేత, దాదాపు 22 ఏండ్లకు పైగా రాజకీయ జీవితం, ఏడేండ్ల పాటు మంత్రిగా కొనసాగిన మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Etala Rajender) పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. బీజేపీ (BJP) స్టేట్ చీఫ్​ పోస్టును ఆశించి చివరకు ఆయన భంగపడ్డారు. చివరి క్షణం వరకు హైకమాండ్ నుంచి కాల్ వస్తుందని ఎదురుచూసిన ఆయనకు నిరాశ తప్పలేదు. ఊరించి ఉసూరుమనిపించేలా పార్టీ వ్యవహరించిందనే భావనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒకానొక సమయంలో (BRS) బీఆర్ఎస్‌లో చక్రం తిప్పిన నేతగా ఆయనకు పేరుంది. కానీ ఆ పార్టీ నుంచి ఆయన్ను బయటకు పంపించడంతో కాషాయ పార్టీలో చేరాల్సి వచ్చింది. తీరా ఇక్కడ ఆయన అనుకున్న స్థానం లభించకపోవడంతో నిర్ణయం ఎలా ఉండబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

 Also ReadBalkampet Yellamma Kalyanam: అంగరంగ వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ మహోత్సవం!

ఈటలకేనంటూ ప్రచారం

బీజేపీ రాష్​ట్ర అధ్యక్షుడిగా (Bandi Sanjay) బండి సంజయ్‌ను తొలగించిన తర్వాత ఈటలకే పదవి వరిస్తుందని భారీగా ప్రచారం జరిగింది. అయితే, కొత్త నేతకు ఎలా ఇస్తారని పాత నేతలు తిరుగుబాటు చేశారు. దీంతో పార్టీ చివరకు అనూహ్యంగా కేంద్రమంత్రిగా ఉన్న (Kishan Reddy) కిషన్ రెడ్డిని నియమించింది. పార్టీ అదిగో ఇదిగో అని ఊరించి ఉసూరుమనిపించడంతో అప్పుడు కూడా ఈటల నిరాశకు గురయ్యారు. తాజాగా ఇప్పుడు అదే సీన్ రిపీట్ కావడంతో తీవ్ర నిరాశలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాంచందర్ రావుకు నామినేషన్ వేయాలని హైకమాండ్ నుంచి ఫోన్ వచ్చింది. కానీ తనకు రాకపోవడంతో ఈ కార్యక్రమానికి కూడా ఈటల (Etala Rajender) దూరంగా ఉన్నారని చెబుతున్నారు.

బుజ్జగింపులు లేవు

ఇప్పటికే తీవ్ర నిరాశలో ఉన్న ఈటల రాజేందర్‌కు హైకమాండ్ నుంచి ఇప్పటికీ ఎలాంటి బుజ్జగింపు కానీ భవిష్యత్ పైనా హామీ అందలేదని తెలుస్తోంది. ఎందుకంటే స్టేట్ చీఫ్ అంశంపై పార్టీలోని పాత నేతలంతా ఒక్క తాటిపైకి రావడంతో ఈటల ఒంటరి అయ్యారనే చర్చ పొలిటికల్ సర్కిల్స్‌లో జరుగుతోంది. పార్టీ కూడా స్టేట్ చీఫ్ అంశంపై ఆచితూచి వ్యవహరించిందని చెబుతున్నారు. ఎందుకంటే సంస్థాగత నిర్మాణంలో సీనియారిటీకి ప్రయారిటీ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఎందుకంటే సంస్థాగతంగా బలోపేతం వారితోనే సాధ్యమని, ఇతరులకు ఇస్తే ఇబ్బందులు ఎదురవుతాయనే ఆలోచనలో పార్టీ ఉన్నట్లు సమాచారం. అందుకే సంస్థాగత నిర్మాణంలో సీనియారిటీకి ప్రయారిటీ ఇచ్చి, ఇతర పదవుల్లో కొత్తవారికి ప్రయారిటీ కల్పిచాలనే యోచనలో హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఆకారణంగానే ఈటలకు స్టేట్ చీఫ్ పోస్ట్ దూరమైందని చెబుతున్నారు.

కాళేశ్వరమే కొంప ముంచిందా?

కాళేశ్వరం అంశంలో ఈటల రాజేందర్ (Etala Rajender) తీసుకున్న స్టాండ్ కూడా ఈ పదవికి ఆయన్ను దూరం చేసిందనే చర్చ పొలిటికల్ (Political) సర్కిల్స్‌లో జరుగుతోంది. ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ లైన్‌కు దూరంగా, గులాబీ పార్టీకి ప్లస్ అయ్యేలా ఉన్నాయి. ఈ అంశాలే ఆయనకు చెక్ పెట్టేలా చేశాయా అనే చర్చ సైతం జరుగుతోంది. దీనికి తోడు అధ్యక్ష పదవికి పోటీ చేసేందుకు హైకమాండ్ పలు నిబంధనలు పెట్టింది. పదేండ్ల నుంచి ప్రాథమిక సభ్యత్వంతో పాటు మూడు క్రియాశీల సభ్యత్వాలు, పదిమంది స్టేట్ కౌన్సిల్ మెంబర్లను బలపరచాలని నిబంధన ఉంది.

అలాంటివారికే అవకాశం కల్పించాలని షరతు విధించడం కూడా ఈటలకు ఇబ్బందికరంగా మారినట్లు సమాచారం. ఇప్పటికే బీజేపీలో గ్రూపు తగాదాలు ఎక్కువైపోయాయని విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కొత్త నేతకు స్టేట్ చీఫ్ పోస్ట్ ఇస్తే పార్టీ పరిస్థితి దుర్భరంగా మారే అవకాశముందని భావించి హైకమాండ్ ఈ నిర్ణయం తీసుకుందని చెబుతున్నారు. ఎందుకంటే రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా కాషాయ పార్టీ పావులు కదుపుతోంది. అయితే, స్టేట్ చీఫ్‌గా నామినేషన్ వేసేందుకు అవకాశం కల్పించలేదని రాజాసింగ్ (Raja Singh) పార్టీకి రాజీనామా చేశారు. మరి భవిష్యత్‌లో ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతారనేది ఆసక్తికరంగా మారింది.

Also Read: Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్‌లో రామ్‌కు ఊహించని ఘటన.. వెంటనే అలెర్ట్ అయ్యారు

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు