Ram Pothineni
ఎంటర్‌టైన్మెంట్

Ram Pothineni: ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్‌లో రామ్‌కు ఊహించని ఘటన.. వెంటనే అలెర్ట్ అయ్యారు

Ram Pothineni: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, మహేష్ బాబు పి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ స్థాయిలో నిర్మిస్తున్న చిత్రం ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణను శరవేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ రాజమండ్రిలో ప్రారంభమైనట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. రామ్ పోతినేని, కన్నడ స్టార్ ఉపేంద్రలపై కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇందులో హీరో రామ్ డై హార్డ్ అభిమాని పాత్రను పోషిస్తుండగా, ఉపేంద్ర సూపర్ స్టార్ పాత్రలో కనిపించనున్నారు. ఆ విషయం ఇటీవల విడుదలైన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ టైటిల్ గ్లింప్స్ క్లారిటీ ఇచ్చేసింది. ఇక రాజమండ్రిలో జరుగుతున్న ఈ షూట్‌లో రామ్‌కు ఊహించని ఘటన ఎదురైనట్లుగా తెలుస్తుంది. వెంటనే అలెర్ట్ అయ్యారు కాబట్టి సరిపోయింది.. లేదంటే ఏదో ఒకటి జరిగే ఉండేదని అంతా అనుకుంటున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..

Also Read- Adivi Sesh: ‘డకాయిట్’ నుంచి శృతి హాసన్ ఎందుకు తప్పుకుందంటే.. అసలు విషయం చెప్పేసిన శేష్!

‘ఆంధ్రా కింగ్ తాలూకా’ షూటింగ్ ముగిసిన అనంతరం రాజమండ్రిలోని ఫైవ్‌స్టార్ హోటల్ అయిన షెరటాన్‌లో హీరో రామ్‌కి బస ఏర్పాటు చేశారు. అదే హోటల్‌లో ఎవరూ ఊహించని సంఘటన చోటు చేసుకుంది. సోమవారం రాత్రి ఆయన బస చేసిన హోటల్ గదిలోకి ఇద్దరు అనుమానితులు ప్రవేశించి అందరికీ షాక్ ఇచ్చారని తెలుస్తోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో దీని గురించే అంతా మాట్లాడుకుంటున్నారు. ఈ ఘటనతో చిత్ర బృందమే కాకుండా హోటల్ సిబ్బంది కూడా షాక్‌కి గురయ్యారట. సోమవారం రాత్రి సుమారు 10 గంటల టైమ్‌లో ఇద్దరు వ్యక్తులు, హీరో టీమ్‌కి చెందిన వాళ్లమని చెప్పి.. లిఫ్ట్ యాక్సెస్ తీసుకుని, వీఐపీ గెస్ట్‌గా 6వ అంతస్థులో ఉన్న రామ్ రూమ్ వరకు చేరుకున్నారు. హోటల్ సిబ్బంది నుంచి మాస్టర్ కీ తీసుకుని ఏకంగా రామ్ ఉన్న గదిలోకే వెళ్ళారని తెలుస్తుంది. పగలంతా షూటింగ్ చేసి వచ్చిన రామ్ అప్పటికే గాఢ నిద్రలో ఉండగా.. తలుపు తెరుచుకున్న శబ్దంతో, అనుమానం వచ్చి చూడగా.. ఎదురుగా ఇద్దరు తెలియని వ్యక్తులు ఉండటంతో.. అలెర్ట్ అయిన రామ్ వెంటనే యూనిట్‌కు కాల్ చేసి చెప్పారట.

Also Read- Shirish Reddy: క్షమించండి.. మెగా హీరోల ప్రతిష్టకు భంగం కలిగించేలా ఇకపై మాట్లాడం!

ఆ వెంటనే అలెర్ట్ అయిన హోటల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం అందివ్వడం, వారు వెంటనే అక్కడకు చేరుకుని, ఆ ఇద్దరినీ అరెస్ట్ చేసినట్లుగా టాక్ వినబడుతోంది. ఆ ఇద్దరూ ఎవరనేది ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయితే అక్కడున్న స్థానికులు మాత్రం వీరిద్దరూ పచ్చి తాగుబోతులని, మద్యం మత్తులోనే వారిలా చేసి ఉంటారని చెబుతుండటం విశేషం. ఏది ఏమైనా, ఈ ఇన్సిడెంట్‌తో అటు రామ్ అండ్ స్టాఫ్‌తో పాటు ఇటు అభిమానులు కూడా షాకవుతున్నారు. ఈ ఘటన తర్వాత హీరో రూమ్‌కి మరింతగా సెక్యూరిటీని పెంచారని తెలుస్తోంది. రామ్ సరసన ‘మిస్టర్ బచ్చన్’ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రానికి వివేక్-మెర్విన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా అప్డేట్స్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?