Adivi Sesh: అడివి శేష్ హీరోగా నటిస్తున్న హైలీ యాంటిసిపేటెడ్ పాన్-ఇండియన్ థ్రిల్లర్ చిత్రం ‘డకాయిట్’ (Dacoit). మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి ఇటీవలే విడుదలైన ఫైర్ గ్లింప్స్ ఇంటెన్స్ యాక్షన్, స్టైలిష్ విజువల్స్‌తో మంచి రెస్పాన్స్‌ను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం రాబోయే క్రిస్మస్ స్పెషల్‌గా డిసెంబర్ 25న గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు రానుంది. ఇక ఈ సినిమా ప్రారంభమైనప్పుడు మొదట హీరోయిన్‌గా శృతి హాసన్ (Shruti Haasan)ని హీరోయిన్‌గా అధికారికంగా ప్రకటించారు. కొంతమేర షూటింగ్ అనంతరం శృతి హాసన్ ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడంతో.. మృణాల్ ఠాకూర్ ఈ చిత్రంలో హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. అయితే శృతి తప్పుకోవడంపై అప్పట్లో రకరకాల వార్తలు వైరల్ అయ్యాయి. ఎందుకు ఈ ప్రాజెక్ట్ నుంచి శృతి హాసన్ తప్పుకుందనేది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. ఫస్ట్ టైమ్.. ఈ విషయమై స్పందించారు హీరో అడివి శేష్. తాజాగా ఆయన ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
Also Read- Boycott SVC Movies: శిరీష్ కామెంట్స్‌తో.. మెగా ఫ్యాన్స్ సంచలన నిర్ణయం!
ఈ ప్రాజెక్ట్ విషయంలో శృతి హాసన్ తప్పుకోవడంపై వస్తున్న రూమర్స్‌ను అడివి శేష్ ఖండించారు. ఇది పెద్ద కాంట్రవర్సీ విషయమేం కాదన్నారు. అసలు ఎటువంటి ఇష్యూస్ కూడా జరగలేదని శేష్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ‘‘మా ప్రాజెక్ట్ విషయంలో ఆమె సరిగా సెట్ కాలేదు. మా షూటింగ్, పని శైలి వంటి విషయాలు సరిగా సెట్టవ్వలేదు. అదే టైమ్‌లో ఆమె ‘కూలీ’ సినిమాకు డేట్స్ ఇచ్చి ఉన్నారు. ఆ షూట్‌లో పాల్గొనాల్సి రావడం, అందులో ఆమె లుక్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉండటంతో.. నార్మల్‌గానే ఆమె ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంది. మా మధ్య ఇప్పటికీ స్నేహ పూర్వక వాతావరణమే ఉంది. అందులోనూ నేను ఒక సినిమా చేయడానికి చాలా సమయం తీసుకుంటాను. దానికి అందరూ సింక్ కాలేరు. నిజంగా ఇదే పెద్ద కారణం తప్పితే.. ఎటువంటి కాంట్రవర్సీ లేదు. శృతి వెళ్లిన తర్వాత.. మళ్లీ కొన్ని సీన్స్ చేయాల్సి వచ్చింది అంతే..’’ అని చెప్పుకొచ్చారు.
Also Read- Dil Raju: శిరీష్ మాట్లాడింది తప్పే.. రామ్ చరణ్ వివాదంపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్!
ఇంకా మృణాల్ ఠాకూర్ గురించి మాట్లాడుతూ.. ‘సీతా రామం’ చూసినప్పటి నుంచి మృణాల్ ఠాకూర్‌తో సినిమా చేయాలని అనుకున్నాను. అందులో ఆమె నటన నాకు చాలా ఇష్టం. ఈ ప్రాజెక్ట్ విషయం చెప్పిన తర్వాత ఇతర బాలీవుడ్ నటీనటుల మాదిరిగా ఒక నెల, రెండు నెలలు సమయం కావాలని అడగకుండా.. కేవలం కొన్ని గంటల్లోనే ఈ సినిమా చేస్తానని ఆమె చెప్పారు. ఆమె కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. ఫస్ట్ గ్లింప్స్‌లో కూడా ఆమెకు చోటివ్వడంతో చాలా హ్యాపీగా ఫీలయ్యారు. ఇందులో నా పాత్రకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో.. మృణాల్ పాత్రకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ‘డకాయిట్’ ఇద్దరు హీరోల చిత్రం’ అని అభివర్ణించారు. ఈ సినిమాతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను హిందీ, తెలుగు వెర్షన్స్‌లో ఏక కాలంలో చిత్రీకరిస్తున్నారు. ఇందులోని కొన్ని పాత్రలను రెండు వెర్షన్లలో వేర్వేరు నటులు పోషిస్తున్నారని టీమ్ తెలిపింది. ఈ సినిమాతో పాటు శేష్ ‘గూఢచారి’ సీక్వెల్ ‘జీ2’ చేస్తున్న విషయం తెలిసిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు