Fake Maize Seeds [ image credit: Ai]
నార్త్ తెలంగాణ

Fake Maize Seeds: రైతన్నకు భరోసా దక్కేనా? ఆశలన్నీ ఆ సమావేశంపైనే!

ములుగు/మహబూబాబాద్ స్వేచ్ఛ: Fake Maize Seeds: మలుగు జిల్లా వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు మరికొన్ని మండలాల్లో మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ వ్యవసాయంతో రైతులు తీవ్ర నష్టాల్లో చిక్కుకున్నారు. గత నాలుగేళ్లుగా సాగుతున్న తంతులో రైతులు ఈ ఏడాది తాము వ్యవసాయం చేయడంలో నిర్లక్ష్యంగా నష్టపోలేదని, మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలే తమను తీవ్రంగా నష్టాల ఊబిలోకి నెట్టేశారని తెలుసుకున్నారు.

ఫిబ్రవరి మొదటి వారం నుంచి మల్టీ నేషనల్ విత్తన కంపెనీల దురాగతాలపై రైతులు రోడ్డెక్కి ఆందోళన చేస్తూ వస్తున్నారు. ఇదే విషయం స్వేచ్ఛ ప్రత్యేక కథనాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇటు జిల్లా అధికారులను కదిలింపజేసింది. సీడ్ బాంబ్ పేరిట మొదలైన స్వేచ్ఛ కథనాలు మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలు చేస్తున్న మోసాలపై అందరికీ కళ్ళకు కట్టినట్లుగా ప్రచురిస్తూ వస్తుంది.

 Also Read: LRS Scheme: ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణకు గడువు పెంపు? గడువు పెంచనున్న ప్రభుత్వం…

ఈసారైనా రైతులకు పరిహారం చెల్లించేనా..?

మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీలతో తీవ్రంగా నష్టపోయిన రైతులు బుధవారం నలుగు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ఆర్గనైజర్లు, అధికారుల సమావేశంలో తమకు న్యాయం జరుగుతుందా…? పరిహారం చెల్లిస్తారా..? అనే ఆలోచనలో రైతులు పడ్డారు. ఒక్కో ఎకరానికి దాదాపు లక్ష 20 వేల పెట్టుబడి పెట్టిన రైతులు పరిహారం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు.

ఇప్పటికే రెండు దఫాలుగా నిర్వహించిన సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. 

ములుగు జిల్లా వెంకటాపురం వాజేడు మండలాల రైతులు మల్టీ నేషనల్ మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ లతో తీవ్రంగా నష్టపోయి పలుమార్లు ఆందోళన కార్యక్రమాలు చేస్తూనే ఉన్నారు. దీంతో స్వేచ్ఛ లో ప్రత్యేక కథనాలు అధికారులను కదిలింప చేశాయి. మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు, జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, రైతులతో రెండుసార్లు సమావేశాలు నిర్వహించారు. అయినప్పటికీ రైతులకు పరిహారం చెల్లించే విషయంలో ఎటువంటి స్పష్టత రాలేదు.

మొదటిసారి నిర్వహించిన ఆర్డిఓ సమావేశంలో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ఆర్గనైజర్లు ఒక్కో ఎకరానికి 80,000 చెల్లిస్తామని హామీ పత్రం రాసిచ్చారు. అయితే ఈ పరిహారం చెల్లించేందుకు అధికారులు ఎందుకు ఆచరణలో పెట్టడం లేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి మూడోసారైనా నిర్వహించే సమావేశంలో రైతులకు పరిహారం ఆశించిన స్థాయిలో దక్కుతుందని నమ్మకంలో రైతులు ఉన్నారు.

ఒకవైపు ఆర్గనైజర్ల మొండితనం… మరోవైపు అధికారుల నిర్లక్ష్యం

మల్టీ నేషనల్ విత్తన కంపెనీలతో తీవ్రంగా నష్టపోయిన రైతుల విషయంలో ఒకవైపు ఆర్గనైజర్లు మొండితనం ప్రదర్శిస్తున్నారు. మొదటి దఫాలోనే నష్టపోయిన రైతులకు 80 వేల రూపాయలు ఇస్తానని ఒప్పుకున్న ఆర్గనైజర్లు ఎందుకు స్పందించడం లేదో తేల్చే విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఇద్దరు యువ రైతులు పరిహారం రాదేమోనని ఆలోచనతో ఆత్మహత్యలు చేసుకోగా, మరి కొంతమంది రైతులు తీవ్ర నిరాశలో కొట్టుమిట్టాడుతున్నారు.

Also Read: Rajiv Yuva Vikas Scheme: మంచి అవకాశం మించిన దొరకదు.. దరఖాస్తు చేసుకోండి.. జిల్లా కలెక్టర్

పరిహారమా..? రైతుల పోరాటమా..? 

ఇప్పటిదాకా నిర్వహించిన రెండు సమావేశాల్లో రైతులకు పరిహారం ఇప్పించే దిశగా అధికారులు కృషి చేయలేదని ఆరోపణలు ఉన్నాయి. పంటి నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ఆగడాలపై స్వేచ్ఛ ప్రచురించిన కథనాలు రాష్ట్ర సీఎం దృష్టికి తీసుకెళ్లాయి. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే రాష్ట్ర వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి సందర్శించారు. ఆదివాసి రైతులకు మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ద్వారా జరిగిన నష్టాలను ఆరా తీసి తెలుసుకున్నారు.

గత మార్చి నెల 25న జిల్లాలోని వివిధ శాఖల అధికారులు, మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ఏజెంట్లు, ఆర్గనైజర్లు, రైతులతో రైతులకు చెల్లించే పరిహారం విషయంలో సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి త్వరలోనే శుభవార్త వింటారని రైతులకు స్పష్టం చేశారు. ఇప్పుడు రైతులంతా వ్యవసాయ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వంపై పూర్తి నమ్మకం పెట్టుకున్నారు. ఒకవేళ రైతులు ఆశించిన స్థాయిలో మల్టీ నేషనల్ మొక్కజొన్న విత్తన కంపెనీల ద్వారా పరిహారం అందకపోతే రైతుల పోరాటం కొనసాగిస్తామని ఆదివాసి రైతులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.

 Also Read: HCU Land Dispute: కేసీఆర్ బినామీలకు హెచ్ సీయూ భూములు.. లెక్కలు తీస్తే బొక్కలు విరుగుతాయి.. టీపీసీసీ చీఫ్

నష్టపోయిన రైతులకు జిల్లా కలెక్టర్ పరిహారం ఇప్పించాలి
నాలుగేళ్లుగా హైటెక్ కంపెనీ ఇస్తున్న మొక్కజొన్న క్రాస్ బ్రీడ్ విత్తనాలతో వ్యవసాయం చేస్తున్న. ప్రతి ఏడు ఒక్క ఎకరానికి రూ.90 వేల నుంచి 1,00,000 నష్టం వాటిల్లింది. ఇప్పటికే చాలా నష్టం వాటిల్లి కుటుంబం అంతా రోడ్డుపై పడ్డాము. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ ఆర్గనైజర్లు, కంపెనీలతో మాట్లాడి రైతులకు పరిహారం ఇప్పించేందుకు పూర్తిస్థాయి కృషి చేయాలి. రోజులు గడుస్తున్న కొద్ది ఆందోళన తీవ్రమవుతుంది. ఏం చేయాలో తోచడం లేదు. రైతులను మభ్యపెట్టి మాయ చేసిన ఆర్గనైజర్లు కోట్లల్లో కూడా పెట్టుకుని దర్జాగా జీవనం సాగిస్తున్నారు. అలాంటి వారితో మాకు పరిహారం ఇప్పించి, న్యాయం చేయాలని కోరుతున్నాం.

హైటెక్ కంపెనీ బాధిత రైతు కుర్సం రమేష్

మొక్కజొన్న వ్యవసాయం తో అప్పులపాలి రోడ్డున పడ్డాం మల్టీ నేషనల్ మొక్కజొన్న కంపెనీల విత్తనాలతో వ్యవసాయం చేసి అప్పలపాలు అయి రోడ్డున పడ్డాం. అప్పులు తీర్చలేక, వ్యవసాయం చేయలేక దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాం. ఆరు కాలం కష్టపడితేనె నాలుగు వెళ్ళు నోట్లోకి వెళ్తాయి. అలాంటి మమ్మల్ని ఆర్గనైజర్లు మోసగించి ఆదాయాన్ని సమకూర్చుకున్నారు. జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, వ్యవసాయ అధికారి తమకు న్యాయం చేయాలి.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ  https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు