తెలంగాణ

Rajiv Yuva Vikas Scheme: మంచి అవకాశం మించిన దొరకదు.. దరఖాస్తు చేసుకోండి.. జిల్లా కలెక్టర్

మేడ్చల్  స్వేచ్ఛ: Rajiv Yuva Vikas Scheme: రాజీవ్ యువ వికాస పథకానికి వీలైనంత ఎక్కువమంది అర్హులు దరఖాస్తులు చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ గౌతం అధికారులకు సూచించారు. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క  రాజీవ్ యువ వికాసం పథకంపై హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారితో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నుంచి కలెక్టర్ గౌతం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉపముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని దాదాపు 5 లక్షల మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఇతర వెనకబడిన తరగతుల నిరుద్యోగ యువత ఆర్థికంగా ఎదిగేందుకై ఈ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రంలో నిరుద్యోగం తగ్గుతుందన్నారు. అర్హులైన వారు ఏప్రిల్ 5, 2025 లోపు దరఖాస్తు చేసుకునే విధంగా అధికారులు నిరుద్యోగ యువతకు అవగాహన కల్పించాలన్నారు.

 Also Read : Vennam Srikanth Reddy: సన్నబియ్యం పంపిణీ షురూ.. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కీలక వ్యాఖ్యలు

50 వేల రూపాయల లోపు రుణం వంద శాతం మాఫీ, లక్ష రూపాయల లోపు రుణం 90 శాతం మాఫీ, లక్ష నుంచి రూ.2 లక్షల వరకు 80 శాతం రాయితీ. 2లక్షల రూపాయల నుంచి రూ.4 లక్షల వరకు 70 శాతం రాయితీ లభిస్తుంది. రాయితీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు లోన్ల ద్వారా అందిస్తారు. ఈ పథకం కుటుంబంలో ఒక్కరికే వర్తిస్తుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 1.50 లక్షల లోపు ఉండాలని తెలిపారు.

Minister Komatireddy Venkat Reddy: హిందూ ముస్లింల సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కోమటిరెడ్డి

పట్టణ ప్రాంతాల్లో వార్షిక ఆదాయం రూ. 2 లక్షల లోపు ఉండాలన్నారు. అర్హులందరూ దరఖాస్తులు చేసుకున్న తర్వాత సంబంధిత పత్రాలన్నింటినీ మున్సిపల్ లేదా ఎంపీడీవో కార్యాలయాల్లో అందించాలన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నుండి జిల్లా కలెక్టర్ గౌతం, కూకట్ పల్లి తహసిల్దార్ కార్యాలయం నుంచి ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. కూకట్ పల్లి తహసిల్దార్ స్వామి, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి వినోద్ కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ బాబు మోజెస్, ఇతర అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/లింక్ క్లిక్ చేయగలరు 

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ