మహబూబాబాద్ స్వేచ్ఛ : Vennam Srikanth Reddy: తెలంగాణ రాష్ట్రంలో నిరుపేద లకు అందించే సన్న బియ్యం పంపిణీ ఓ బృహత్తర కార్యక్రమని టిపిసిసి ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తున్న సన్న బియ్యం కార్యక్రమాన్ని రెడ్యాల గ్రామంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెన్నం శ్రీకాంత్ రెడ్డి గారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వెన్నం శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ… ఈ పథకం నిరుపేదలకు ఓ వరమ్మన్నారు.
Minister Komatireddy Venkat Reddy: హిందూ ముస్లింల సమైక్యతతోనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కోమటిరెడ్డి
నియోజకవర్గంలో 2,59,148 మంది ప్రజలకు ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందించనున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో నెలకు రూ.9 కోట్ల 45 లక్షలను ప్రభుత్వం ఖర్చు చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో సూరయ్య, దేశెట్టి మల్లయ్య, బొంగు మల్లయ్య, కుడుముల సురేందర్, డీలర్ బిక్షం రెడ్డి, చిరంజీవి, సౌడబోయిన బిక్షం, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు