Krishnamohan Reddy( IMAGE credit: twitter)
నార్త్ తెలంగాణ

Krishnamohan Reddy: అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధం.. డీకే అరుణకు సవాల్ చేసిన ఎమ్మెల్యే

Krishnamohan Reddy: ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇష్టారీతిన మాట్లాడడం పద్ధతి కాదని ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి(Krishnamohan Reddy) డీకే అరుణపై మండిపడ్డారు. రెండు రోజుల క్రితం డీకే అరుణ మాట్లాడుతూ ఎమ్మెల్యే హయంలో అభివృద్ధి కుంటుపడిందని, నా హాయంలో చేసిన అభివృద్ధి తప్పా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉందని ఆమె విమర్శించడంపై ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి(Krishnamohan Reddy) స్పందించారు. ఆమె అధికారంలో ఉన్నప్పుడు ఉన్న అవకాశాలను సద్వినియోపరుచుకొని నియోజక అభివృద్ధికి పాటుపడకుండా తన స్వలాభం కోసం పాకులాడిందని అలాంటి ఆమె నా హాయంలో చేసిన అభివృద్ధిపై మాట్లాడడం సిగ్గుచేటన్నారు.

 Also Read: Kaleshwaram Project: కాలేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ కుట్రలు.. మాజీ ఎంపీ కవిత సంచనల కామెంట్స్!

ఆమె సిద్ధమా?

ఆమె 15 ఏళ్ళు ప్రజాప్రతినిధిగా ఉన్నారని ఆమె చేసిన అభివృద్ధి ఏమిటో.. నేను ఏడున్నర సంవత్సరాలలో చేసిన అభివృద్ధి ఏమిటో ప్రభుత్వ పథకాలు,నివేదికల ఆధారంగా బహిరంగ చర్చకు సిద్ధమని ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆమెకు సవాల్ విసిరారు. వివిధ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి వివరాలు ఇవ్వడానికి సిద్ధమని, ఆమె సిద్ధమా అని ఆయన ప్రశ్నించారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమే ఇలాంటి చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఆమె ఓడిపోయి ఇతర నియోజకవర్గానికి వలస వెళ్లిందని, ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు హుందాగా వ్యవహరించాలన్నారు

యూరియా కొరతను అధిగమిస్తున్నాం

జిల్లాలో ఏరియా కొరత ఉన్న మాట వాస్తవమేనని జూరాల ప్రాజెక్టు ద్వారా జిల్లాలో 1.50 లక్షల ఎకరాలలో వరి పంట సాగు చేస్తున్నారని ఈ మేరకు యూరియా వినియోగం ఎక్కువగా ఉందన్నారు. నార్త్ ఇండియాతో పోలిస్తే మన దగ్గర యూరియ కొరత ప్రభావం తక్కువగా ఉందన్నారు. గద్వాలలో జరుగుతున్న అభివృద్ధిని గౌరవ లేక ప్రజలను తప్పుదారి పట్టించే చౌకబారు విమర్శలు చేయడం మానుకోవాలని ఆయన హితవు పలికారు.

 Also Read: Anganwadi centres: ఇలాంటి ఆహారమా పెట్టేది? అంగన్‌వాడి నిర్వాహకులపై కలెక్టర్ ఫైర్!

Just In

01

Coolie: ‘కూలీ’ మూవీ ‘చికిటు’ ఫుల్ వీడియో సాంగ్.. యూట్యూబ్‌లో రచ్చ రచ్చ!

JD Chakravarthy: ‘జాతస్య మరణం ధ్రువం’ టైటిల్ క్రెడిట్ నాదే..

Malkaajgiri Excise: డిఫెన్స్ మద్యం స్వాధీనం.. వ్యక్తి అరెస్ట్

Chiranjeevi Team: ‘స్పిరిట్’, ‘ది ప్యారడైజ్‌’ చిత్రాలలో చిరు.. క్లారిటీ ఇచ్చిన టీమ్!

GHMC: ఎంటమాలజీలో ఇష్టారాజ్యంగా జీతాల చెల్లింపులు.. చార్మినార్ జోన్ లో వెలుగు చూసిన అక్రమం