Anganwadi centres: హైదరాబాద్ జిల్లాలోని అంగన్ వాడి కేంద్రాల నిర్వహణ తీరు సరిగా లేకపోవడంతో సంబంధిత అధికారులు సిబ్బంది పై కలెక్టర్ హరిచందన(Collector Harichandana) ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సుభాష్ చంద్రబోస్ ప్రాంతంలో గల అంగన్ వాడి కేంద్రం (Anganwadi centres) సరిగా లేకపోవడంతో పిల్లలను ఆరోగ్య నగర్ అంగన్ వాడి కేంద్రానికి పంపించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా పిల్లలు, గర్భవతులు, బాలింతలకు పిల్లలకు నాణ్యమైన పోషక ఆహారం ఇవ్వాలని హైదరాబాద్(Hyderabad) జిల్లా కలెక్టర్ హరి చందన (Harichandana) దాసరి సంబంధిత సిబ్బందిని ఆదేశించారు. యూసుఫ్ గూడ ఆరోగ్యనగర్ లోని నాట్కో అంగన్ వాడీ కేంద్రం, (Anganwadi centres) సుభాష్ నగర్ లోని మరో అంగన్ వాడి కేంద్రాన్ని ఆమె సందర్శించారు.
Also Read: Thummala Nageswara Rao: రైతులకు గుడ్ న్యూస్.. ఇక యూరియా కష్టాలు తీరినట్లే.. మంత్రి కీలక ఆదేశాలు
ఆరోగ్య పరిరక్షణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలి
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు, గర్భవతులు, బాలింతలకు నాణ్యమైన పోషకాహారం అందించాలని, గర్భవతులకు క్రమం తప్పకుండా టీకాలు అందించాలని సూచించారు. జిల్లాలో వర్షాలు తరచుగా కురుస్తున్నందున పిల్లలకు వ్యాధులు సోకకుండా వారి ఆరోగ్య పరిరక్షణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అదేవిదంగా అంగన్ వాడీ కేంద్రాలతో పాటు పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎన్ హెచ్ పీసీ ( న్యూట్రీషియన్ హెల్త్ ప్యాకింగ్ సిస్టమ్) యాప్ ను పరిశీలించి, సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
తదుపరి పిల్లల సంఖ్య, స్టాక్ వివరాలు, హాజరు పట్టికను పరిశీలించారు. నిబంధన మేరకు పిల్లల వయస్సుకు తగిన విధంగా ఎదుగుదలను ఎప్పటికప్పుడు పరిశీలించి సంబంధిత యాప్ లో నమోదు చేయాలని సూచించారు. అంగన్ వాడీ కేంద్రాలను తరచుగా సీడీపీవోలు, సూపర్ వైజర్లు తనిఖీలు నిర్వహించాలని సూచించారు. ఈ సందర్శనలో తహశీల్దార్ ప్రేమ్ కుమార్, సీడీపీఓ పుష్ప, భారతీరత్నం, టీచర్లు చంద్రకళ,ఝాన్సీ తదితరులు పాల్గొన్నారు.
Also Read: BRS Leaders Protest: మేడ్చల్లో జాతీయ రహదారి పై బీఆర్ఎస్ నాయకులు ధర్నా..?