MLA Bhukya Murali Naik: మహబూబాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యంలో ప్రతి వార్డుకు సంబంధించి సర్వే జరుగుతుందని ప్రజల అభిప్రాయం మేరకే టికెట్స్ కేటాయిస్తామని, పార్టీ నిర్ణయం మేరకు ఎవరికి టికెట్ ఇచ్చిన వారికి మిగతా నాయకులు, కార్యకర్తలు పనిచేయాలని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్(MLA Dr. Bhukya Murali Naik) స్పష్టం చేశారు. శనివారం మున్సిపాలిటీ ఎన్నికల నేపథ్యం, రానున్న నోటిఫికేషన్ నేపథ్యంలో మున్సిపాలిటీలో ఉన్న ముఖ్య కార్యకర్తలు, నాయకులతో క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పైరవీలు పనికిరావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎమ్మెల్యే(MLA), ఎంపీ(MP), జిల్లా అధ్యక్షురాలు, మంత్రుల, ఇతర ముఖ్య నేతల అండదండలు తమకు ఉన్నాయని చెప్పుకొని టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటే పార్టీ సహించేదని హెచ్చరించారు. ప్రతి వార్డులో సర్వే నిర్వహిస్తున్నామని ఆ క్రమంలోనే ప్రజల అభిప్రాయం మేరకే టికెట్స్ కేటాయిస్తామని స్పష్టం చేశారు. పార్టీ ఎవరికి టికెట్ ఇస్తే వారికోసం మిగతా నాయకులు, కార్యకర్తలు పనిచేయాల్సిన అవసరం ఉందని వెల్లడించారు. చైర్మన్ టికెట్ అయినా.. వార్డులకు సంబంధించిన టికెట్స్ అయినా మహబూబాబాద్ తోపాటు కేసముద్రం మున్సిపాలిటీ చైర్మన్ టికెట్స్ అయినా, వార్డు కౌన్సిలర్లకు సంబంధించిన టికెట్స్ అయినా అన్ని విధాలుగా ప్రజాభిప్రాయం సేకరణ జరిగిన తర్వాతే టికెట్స్ పార్టీ నిర్ణయిస్తుందని ఆ నిర్ణయం మేరకే కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పనిచేయాలని ఎమ్మెల్యే మురళి నాయక్ స్పష్టం చేశారు.
Also Read: CP Sajjanar: సైబర్ బాధితులకు అండగా సీ-మిత్ర.. దేశంలోనే తొలిసారిగా అమలు : కమిషనర్ సజ్జనార్!
ప్రజల్లో నిత్యం ఉండి సేవ
టికెట్స్ విషయంలో పైరవీలకు చోటు లేదని ప్రజల్లో నిత్యం ఉండి సేవలో అందిస్తూ కాంగ్రెస్(Congress) పార్టీకి పటిష్టంగా పనిచేసే వారికి మాత్రమే అవకాశాలు లభిస్తాయని వెల్లడించారు. ప్రజల్లో నిత్యం ఉంటూ సేవలు అందించాలని, ఇప్పటికే రాష్ట్ర హై కమాండ్ గత ఎమ్మెల్యే ఎలక్షన్ల నుంచి నేటి వరకు ఆదేశాలు జారీ చేశారని తెలిపారు. పార్టీకి సంబంధించిన ప్రతి కార్యక్రమంలో యాక్టివ్ గా పనిచేస్తూ ప్రభుత్వం అందించే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను వివరిస్తూ ప్రజల కోసం పనిచేసే వారికి ప్రథమ ప్రాధాన్యత ఉంటుందని చెప్పారు.
Also Read: Minister Komatireddy: నన్ను ఏమైనా అనండి.. మహిళా అధికారిపై రాతలు బాధాకరం.. నోరువిప్పిన మంత్రి కోమటి

