Miss World Contestants: పట్టు, పావడ, పరికిణిలు ధరించి కట్టు బొట్టుతో తెలుగుదనం ఉట్టిపడేలా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే అలంకరణలతో ప్రపంచ సుందరిమణులను అలరించారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీల్లో పాల్గొనే పలు దేశాల సుందరిమణులు హెరిటేజ్ టూర్ లో భాగంగా బుధవారం సాయంత్రం వరంగల్ ఉమ్మడి జిల్లాల్లోని ములుగు, హన్మకొండ, వరంగల్ జిల్లాలోని చారిత్రాత్మక కట్టడాలు, ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించారు.
ఈ సందర్భంగా వివిధ దేశాలకు చెందిన సుందరిమణుల తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అనుగుణంగా కట్టు బొట్టుతో సందర్శనకు రావడం విశేషంగా ఆకర్షించింది. హనుమకొండకు చేరుకున్న అందాల బామల బృందానికి వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్, హనుమకొండ వరంగల్ జిల్లాల కలెక్టర్లు లావణ్య, డాక్టర్ సత్య శారద, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అశ్విని తానాజీ వాకడే, ఇతర నగర అధికారులు సాధరంగా స్వాగతం పలికారు.
Also Read: Cyberabad Crime DSP: ఊరెళుతున్నారా జర భద్రం.. సైబరాబాద్ క్రైం డీసీపీ సూచనలు!
ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయానికి చేరుకున్న మరో అందగత్తెల బృందానికి గిరిజన సాంప్రదాయ కొమ్ము కోయ, గుస్సాడీ నృత్య ప్రదర్శన ఒగ్గుడోలు ప్రదర్శన ద్వారా కళాకారులు, జిల్లా కలెక్టర్ టి.ఎస్. దివాకర, ఎస్పీ శబరిష్ జిల్లా అధికారులు టూరిజం శాఖ అధికారులు ఆత్మీయ స్వాగతం పలికారు. బతుకమ్మ ఆట పాటలతో ముద్దుగుమ్మల సందడి వరంగల్ ఉమ్మడి జిల్లాలోని రామప్ప ఆలయం, శిల్ప కళను, హనుమకొండ వెయ్యి స్తంభాల దేవాలయం, వరంగల్ కాకతీయుల కోటల వీక్షణకు వచ్చిన పలు దేశాలకు చెందిన సుందరీమణులు హరిత కాకతీయ వద్ద మహిళలతో కలిసి తెలంగాణ ప్రజల బతుకులో భాగమైన బతుకమ్మ ఆటపాట, కోలాటం కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు.
ఆలయ కట్టుబాట్లు గౌరవిస్తూ దర్శనం
వరంగల్ లోని ప్రసిద్ధ దేవాలయాలను దర్శించుకున్న పరదేశాల అందాల భామలు ఇక్కడి ఆలయాల సాంప్రదాయాలను గౌరవిస్తూ దర్శనం చేసుకోవడం విశేషం. రామప్ప దేవాలయంలోకి చేరుకున్న సుందరిమణులు ఎవరికి వారే స్వయంగా కాళ్లు కడుక్కొని పూజలు చేసేందుకు ఆలయంలోకి వెళ్లారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు సిబ్బంది వారికి ఘన స్వాగతం పలికారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ విశిష్టత, చరిత్రను ఆలయ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పురాతన ఆలయం రామప్ప ఆలయాన్ని, శిల్ప సంపదను, నీటిలో తేలియాడే అరుదైన ఇటుకులను పరిశీలించారు.
AlsoRead: Phone Tapping Case: ఇక ప్రభాకర్ రావు వంతు.. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో మూసుకుపోయిన దారులు!
అనతంరం కాకతీయుల కాలంలోనే పురుడు పోసుకున్న పేరిణి నృత్య ప్రదర్శనను తిలకించిన అందాల బామలు మంత్ర ముగ్ధులయ్యారు. ఆలయ తీరుతన్నులను తనివి తీర తిలకించి ఫిదా అయ్యారు. రామప్ప ఆలయం ఆవరణలో ఏర్పాటు చేసిన సభా ప్రాంగణం వద్ద తెలంగాణ సాహిత్య అకాడమీ మరియు భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలో కాకతీయ రాజుల పరిపాలన చారిత్రాత్మక అంశాలను నృత్య రూపంలో కళాకారులు ప్రదర్శించినారు.
చీరకట్టు బొట్టుతో హనుమకొండ లోని వెయ్యి స్తంభాల దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలుగుదనం ఉట్టిపడేలా చీరలు, పరికిణీలు కట్టుకొని తిలకం దిద్దుకొని అచ్చం తెలంగాణ అమ్మాయిల లాగా రామప, వెయ్యి స్తంభాల ఆలయాలను సందర్శించిన తీరు ముచ్చటేసింది. ఆలయాల విశిష్టతను తెలుసుకున్న ప్రపంచ దేశాల అందగత్తెలు ఆలయానికి దీనికి సంబంధించిన చిత్రాలను సెల్ఫోన్లో బంధించుకున్నారు. కాకతీయుల కోటను సందర్శించి కోట ప్రత్యేకతను గైడ్ సహాయంతో తెలుసుకున్నారు. వరంగల్ కు వచ్చే ముద్దుగుమ్మలను మంత్ర ముగ్ధులను చేసేందుకు జిగేల్ జిగేల్ మనిపించే లైట్లు, సౌండ్స్ ఏర్పాటు చేశారు. ఆధ్యంతం ప్రపంచ సుందరీమణుల పర్యటన ఆసక్తికరంగా సాగింది.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు