Minister Seethaka (imagecredit:swetcha)
నార్త్ తెలంగాణ

Minister Seethaka: పుట్టింటి ద్వారానే అభివృద్ధి సాధ్యం: మంత్రి సీతక్క

Minister Seethaka: గత ప్రభుత్వంలో నియోజకవర్గాలు ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క(Min Seethakka) అన్నారు. చేవెళ్ల(Chevella) నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న సీతక్క ప్రసగించారు. ఆనాడు కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్కు పోయినా.. నేడు బీఆర్ఎస్(BRS) నుంచి కాంగ్రెస్(Congress)కు మద్దతు పలికిన చేవెళ్ల అభివృద్ధి కోసమేనని అన్నారు. ఎమ్మెల్యే కాలే యాదయ్య(MLA Kale Yadav) పుట్టింటి ద్వారానే అభివృద్ధిని సాధించుకుంటున్నాడని అన్నారు. అవసరమైన చోట రోడ్లు(Roads), అంగన్వాడీ, గ్రామ పంచాయతీ భవనాలు, బ్రిడ్జిల నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని అన్నారు.

Also Read: Nagarjuna Sagar dam: నాగార్జున సాగర్‌కు పోటెత్తిన వరద.. 26 గేట్లు ఎత్తివేత

వివిధ పనులు శంకుస్ధాపన

అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డులు, ఫ్రీ బస్సు ప్రయాణం(Free Bus), సన్న బియ్యం, రైతు భీమా, రుణా మాఫీ, భరోసా లాంటి సంక్షేమ పథకాలు అమలు చేసే దిశగా సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పాలన కొనసాగుతుందని అన్నారు. ఎంఎల్ఏ కాలే యాదయ్య ఆధ్వర్యంలో రూ. 3 కోట్ల 35 లక్షల నిధులతో మల్కాపురం -మూడిమ్యాల బీటీ రోడ్డు పనులను మంత్రి సీతక్క(Min Seethakka) ప్రారంభించారు. చేవెళ్లలో రూ.కోటి 30 లక్షల నిధులతో సిసి రోడ్లను మంత్రి సీతక్క ప్రారంభించారు.

పంచాయతీరాజ్ శాఖ ఆధ్వర్యంలో రంగారెడ్డి(Ranga Reddy) డివిజన్లో కొత్తగా 1583 పనులకు రూ. 571 కోట్లు మంజూరయ్యాయని అన్నారు. ఇప్పటివరకు 1176 పూర్తి చేసి రూ. 132 కోట్లను విడుదల చేసినట్లు తెలిపారు. చేవెళ్ల డివిజన్లో 9 పనులకు రూ.25 కోట్ల 10 లక్షలు మంజూరయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి , ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender Reddy), ఎమ్మెల్యే కాలే యాదయ్య, జిల్లా గ్రంధాలయ చైర్మన్ మధుసూదనరెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు షాబాద్ దర్శన్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Bandi Sanjay: మార్వాడీలకు ఫుల్ సపోర్ట్ పలికిన కేంద్రమంత్రి బండి సంజయ్

Just In

01

Ram Charan Next movie: రామ్ చరణ్ నెక్స్ట్ సినిమా దర్శకుడు ఎవరో తెలిస్తే ఫ్యాన్స్‌కు పండగే..

Swetcha Effect: స్వేచ్ఛ కథనంతో సంచలనం.. రంగంలోకి దిగిన నిఘా వర్గాలు డీఎస్పీ అరాచకాలకు తెర!

Ellamma movie: బలగం వేణు ‘ఎల్లమ్మ’ సినిమాకు సంగీత దర్శకుడు ఎవరంటే?

Liquor License: వైన్​ షాపుల లాటరీకి హైకోర్టు గ్రీన్ సిగ్నల్!

Telugu States Disasters 2025: ప్రకృతి గట్టిగానే హెచ్చరిస్తుందిగా.. లోకంలో పాపాలు ఆపకపోతే ఇలాంటి వినాశనాలు తప్పవా?