Bandi Sanjay
తెలంగాణ, లేటెస్ట్ న్యూస్

Bandi Sanjay: మార్వాడీలకు ఫుల్ సపోర్ట్ పలికిన కేంద్రమంత్రి బండి సంజయ్

Bandi Sanjay: హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలో భాగమే ‘మర్వాడీలు గో బ్యాక్’ నినాదం

మీరు మర్యాడీ గో బ్యాక్ ఉద్యమాలు చేస్తే.. మేము రోహింగ్యాలు గో బ్యాక్ ఆందోళనలు చేస్తాం
కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం డ్రామాలివి
పాతబస్తీని ఐఎస్ఐ అడ్డాగా మార్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడరు?
హిందూ కుల వృత్తులను కాపాడే ఉద్యమం చేస్తాం: కేంద్ర మంత్రి బండి సంజయ్

తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: మార్వాడీ గో బ్యాక్ పేరిట హిందూ సమాజాన్ని చీల్చే కుట్రలు మొదలయ్యాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ( Bandi Sanjay) వ్యాఖ్యానించారు. మార్వాడీ గో బ్యాక్ పేరుతో కమ్యూనిస్టుల ముసుగులో కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల నాయకులు డ్రామాలు ఆడుతున్నాయని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్ గూడలో ఉన్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం వద్ద ప్రారంభమైన ‘హర్ ఘర్ తిరంగా బైక్ ర్యాలీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్ మాట్లాడారు.

మార్వాడీలు వ్యాపారం చేసుకుంటే తప్పేముందని బండి సంజయ్ ప్రశ్నించారు. మార్వాడీలు ఏనాడూ అధికారం కోసం పాకులాడలేదని, తెలంగాణను దోచుకోలేదని, వ్యాపారాలు చేసుకుంటూ సంపదను సృష్టించారని అన్నారు. జీడీపీ వృద్ధిలో వారి పాత్ర చాలా ఉందని, హిందూ సనాతన ధర్మం కోసం పాటుపడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి మార్వాడీలు తెలంగాణ నుంచి ఎందుకు వెళ్లిపోవాలని సంజయ్ ప్రశ్నించారు. హిందూ కుల వృత్తులను దెబ్బతీసే విధంగా మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులను ఒక వర్గం వారే నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ‘మర్వాడీ గో బ్యాక్’ ఉద్యమాలు చేస్తే.. బీజేపీ పక్షాన ఒక వర్గం నిర్వహించే మటన్ షాపులు, డ్రై క్లీనింగ్ షాపులకు వ్యతిరేకంగా హిందూ కుల వృత్తులను కాపాడుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.

Read Also- Nagaland Governor Died: తీవ్ర గాయాలతో నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత

రోహింగ్యాల గో బ్యాక్ ఉద్యమాన్ని కూడా తీవ్రతరం చేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. వాస్తవానికి హిందువులైన కటికవాళ్లు మటన్ కొట్టాలని, హిందూ రజకులు బట్టలుతుకుతారని, కానీ ఇక్కడ ఏం జరుగుతోందని బండి ప్రశ్నించారు. నయీం మటన్ షాపు, సలీం డ్రై క్లీన్ షాపులు పెడుతుంటే ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. ఇతర దేశాల నుంచి వచ్చిన రోహింగ్యాలపై ఎందుకు మాట్లాడటం లేదని బండి ప్రశ్నించారు. హైదరాబాద్‌లో ఎంతోమంది రోహింగ్యాలు పాతబస్తీని అడ్డాగా మార్చి ఐఎస్ఐ కార్యకలాపాలను సాగిస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయని, రోహింగ్యాల వల్ల ఎప్పటికైనా తెలంగాణకు ప్రమాదముందని నివేదికలు వస్తున్నా ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు.

Read Also- Bhuvneshwar Kumar: బుమ్రా ‘వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌’పై భువీ ఆసక్తికర వ్యాఖ్యలు

ఓట్లపై స్పందిస్తూ…
ఓట్లను తొలగించేది, చేర్చించేది ఎన్నికల సంఘం పని అని, ఓట్లకు బీజేపీకి సంబంధం ఏముందని బండి ప్రశ్నించారు. నిజంగా ఓట్ల చోరీ తమ చేతుల్లో ఉంటే తమకు 240 ఎంపీ సీట్లు మాత్రమే ఎందుకు వస్తాయని ఆయన ప్రశ్నించారు. అన్నీ సీట్లలో గెలిచేవాళ్లం కదా అని చెప్పుకొచ్చారు. తెలంగాణ, కర్నాటకలో బీజేపీయే అధికారంలోకి వచ్చేది కదా? అని ప్రశ్నించారు. అలా అయితే తెలంగాణలో ఓట్ల చోరీ చేసే కాంగ్రెస్ గెలిచిందా? అని ఆయన నిలదీశారు. ఓట్ల చోరీ చేసే కర్నాటకలో గెలిచిందా? అని వ్యాఖ్యానించారు. పాతబస్తీలో అడ్డగోలుగా దొంగ ఓట్లున్నాయని అనేక ఆందోళనలు చేస్తున్నారని, ఒక్క ఇంటిలో 300 ఓట్లున్నాయని, వాటిని తీసేయాలా? వద్దా? కాంగ్రెస్ సమాధానం చెప్పాలన్నారు. వాటిని తొలగించాలని ఎందుకు ఈసీకి చెప్పడం లేదని ఆయన ప్రశ్నించారు. 60 ఏండ్లు కాంగ్రెస్ పార్టీ దేశాన్ని దోచుకుందన్నారు. 11 ఏండ్లపాటు బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెసోళ్లు ఓర్వలేకపోతున్నారని పేర్కొన్నారు. రాహుల్ గాంధీ కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, అందుకే కాంగ్రెస్ పార్టీ బతుకు కుక్కలు చింపిన విస్తరిలా మారిందని బండి విమర్శించారు. ఇకనైనా తీరు మార్చుకోకపోతే ఆ పార్టీకి పుట్టగతులుండవని హెచ్చరించారు.

Just In

01

Harish Rao: పాలకులే నెగిటివ్ మైండ్ సెట్.. అభివృద్ధి ఎలా సాధ్యం..?

Ashish Warang death: ప్రముఖ నటుడు కన్నుమూత.. సోకసంద్రంలో ఇండస్ట్రీ

Telangana politics: బీజేపీలో బిగ్ డిస్కషన్.. ఆపరేషన్ ఆకర్ష్ కవిత వర్తిస్తుందా..?

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?