LA Ganeshan
జాతీయం, లేటెస్ట్ న్యూస్

Nagaland Governor Died: తీవ్ర గాయాలతో నాగాలాండ్ గవర్నర్ గణేశన్ కన్నుమూత

Nagaland Governor Died: తమిళనాడు గవర్నర్‌గా, గతంలో నాగాలాండ్ గవర్నర్‌గా కూడా సేవలందించిన థిరు లా. గణేశన్ (La. Ganesan) శుక్రవారం చెన్నైలో కన్నుమూశారు. చెన్నైలోని టీ.నగర్‌లో ఉన్న తన నివాసంలో ఆగస్టు 8న ఆయన ప్రమాదవశాత్తూ జారిపడ్డారు. దీంతో, ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. అపస్మారక స్థితిలో పడివున్న ఆయనను వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చేర్చి చికిత్స అందించారు. శస్త్రచికిత్సలు కూడా నిర్వహించారు. ఈ క్రమంలో గత వారం రోజులుగా ఆయన ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం 6.23 గంటల సమయంలో ఆయన తుదిశ్వాస (Nagaland Governor Died) విడిచారు. ప్రస్తుతం ఆయన వయసు 80 సంవత్సరాలు.

ప్రధాని మోదీ విచారం

లా.గణేశన్ మృతిపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. నాగాలాండ్ గవర్నర్ తిరు లా. గణేశన్ మృతితో తీవ్ర విచారం కలిగించిందని చెప్పారు. దేశసేవకు అంకితమైన జాతీయవాది అని, దేశ నిర్మాణంలో ఆయన సేవలు చిరస్మరణీయమైనవని కొనియాడారు. తమిళనాడులో బీజేపీని విస్తరించేందుకు కృషి చేశారంటూ మోదీ గుర్తుచేసుకున్నారు. తమిళ సంస్కృతి పట్ల ఆయనకు ఎంతో మమకారం ఉండేదన్నారు. ఈ విషాద సమయంలో గణేశన్ కుటుంబసభ్యులకు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆయన స్పందించారు.

Read Also- PM Vikasit Bharat Rozgar Yojana: ప్రైవేటు ఉద్యోగులకు రూ.15 వేలు సాయం.. అర్హతలు ఇవే

తమిళనాడులోని తంజావూరులో తిరు లా. గణేశన్ జన్మించారు. గతంలో రాజ్యసభ సభ్యుడిగా కూడా సేవలు అందించారు. తమిళనాడులో బీజేపీ ప్రస్థానం మొదలుపెట్టడంలో, విస్తరణలో ఆయన కీలకపాత్ర పోషించారు. మణిపూర్, నాగాలాండ్ రాష్ట్రాలకు అపద్ధర్మ గవర్నర్‌గా కూడా వ్యవహరించారు. ప్రజాసేవ, రాజకీయాల్లో ఆయన చేసిన కృషిని గుర్తుచేసుకుంటూ దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలిపారు.

లా. గణేశన్ రాజకీయ ప్రస్థానం రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) ద్వారా ప్రారంభించారు. ఆ తర్వాత బీజేపీలో చేరారు. పార్టీ కోసం నిబద్ధతతో పనిచేశారు. తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా కూడా బాధ్యతలు నిర్వర్తించారు. పార్టీ పటిష్టత కోసం క్రమశిక్షణతో పనిచేసి గుర్తింపు పొందారు. ఒక్క తమిళనాడులోనే కాకుండా దక్షిణభారతదేశంలో కమలం పార్టీ విస్తరణకు పాటుపడ్డారు. మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికయ్యారు. సూటిగా, స్పష్టంగా మాట్లాడతారని ఆయనకు పేరుంది. వినయంగా ఉంటారు.

Read Also- Humayun Tomb complex: హుమాయూన్ సమాధి కాంప్లెక్స్‌లో తీవ్ర విషాదం

గవర్నర్‌గా విశేష అనుభవం
లా.గణేశన్‌కు గవర్నర్‌గా పనిచేసిన విశేష అనుభవం ఉంది. ఆగస్ట్ 2021లో మణిపూర్ గవర్నర్‌గా నియమితులయ్యారు. ఆ తర్వాత, జులై 2022 నుంచి నవంబర్ 2022 వరకు పశ్చిమబెంగాల్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు చేపట్టారు. 2023 ఫిబ్రవరి 20న నాగాలాండ్ 19వ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆయన చివరి వరకు అక్కడే సేవలందించారు. రాజ్యాంగ విలువలకు కట్టుబడి, కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వాలతో సమన్వయం చేసుకుంటూ గవర్నర్ బాధ్యతలను నెరవేర్చారు. నాగాలాండ్ గవర్నర్‌గా విధులు నిర్వహించిన సమయంలో ఆర్థిక, అభివృద్ధి అంశాలపై పలు వర్గాలతో చర్చలు జరిపి, సహకార వాతావరణం కల్పించేందుకు ఆయన విశేష కృషి చేశారు. ఆయన మృతితో భారత రాజకీయాల్లో క్రమశిక్షణగల మరో నేతను కోల్పోయినట్టు అయిందని రాజకీయవర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Just In

01

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?

Ganesh Nimajjanam 2025: అయ్యో గణపయ్య ఎంత ఘోరం.. నిమజ్జనం చేస్తుండగా.. కింద పడ్డ విగ్రహాలు

Bhatti Vikramarka: విద్యారంగం పై ఊహించని రీతిలో సర్కారు పెట్టుబడులు