Humayuns Tomb complex
జాతీయం

Humayun Tomb complex: హుమాయూన్ సమాధి కాంప్లెక్స్‌లో తీవ్ర విషాదం

Humayun Tomb complex: ఐక్యరాజ్య సమితి ప్రపంచ వారసత్వ స్థలంగా గుర్తించిన ఢిల్లీలోని హుమాయిన్ సమాధి కాంప్లెక్స్‌లో (Humayun Tomb complex) ఉన్న ఓ దర్గా వద్ద ఒక గోడ కూలింది. శుక్రవారం సాయంత్రం 3:51 గంటల సమయంలో జరిగిన ఈ దుర్ఘటనలో ఐదుగురు మృత్యువాతపడ్డారు. మృతుల్లో ముగ్గురు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. ఒక గోడ కొంత భాగం కూలిపోయిందని, మొత్తం 11 మందిని రెస్క్యూ చేసి కాపాడినట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. శిథిలాల కింద మరికొందరు చిక్కుకొని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. దీంతో, రెస్క్యూ చర్యలను కొనసాగిస్తున్నారు. క్షతగాత్రులను సమీపంలోని హాస్పిటల్స్‌లో చేర్చినట్టు వివరించారు.

Read Also- Bhuvneshwar Kumar: బుమ్రా ‘వర్క్‌లోడ్‌ మేనేజ్‌మెంట్‌’పై భువీ ఆసక్తికర వ్యాఖ్యలు

హుమాయిన్ సమాధి కాంప్లెక్స్ ఢిల్లీలోని నిజాముద్దీన్ ప్రాంతంలో ఉంది. ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే ఢిల్లీ ఫైర్ సర్వీస్, ఇతర ఎమర్జెన్సీ బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. సాయంత్రం 3.51 గంటల సమయంలో తమకు కాల్ వచ్చిందని, వెంటనే ఘటనా స్థలానికి బయలుదేరి వెళ్లామని ఓ అధికారి తెలిపారు. తక్షణమే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టి కొందరిని కాపాడామని వివరించారు. దర్పణవీధిలో గోడ భాగం కుప్పకూలిందని వివరించారు. ముస్లిం సంత్‌కు చెందిన దర్గా షరీఫ్ పట్టే షాలో అంతర్భాగంగా ఉన్న ఓ పాత ఇంటి గోడ కుప్పకూలినట్టు స్థానికులు చెబుతున్నారు. ప్రమాద సమయంలో అక్కడ 15-20 మంది వరకు ఉన్నారని సమాచారం. ఇందులో ఇమామ్ కూడా ఉన్నట్టు అనధికార వర్గాల ద్వారా తెలుస్తోంది. కాగా, ప్రమాదం తర్వాత దర్గా ప్రాంగణాన్ని అధికారులు సీజ్ చేశారు. ఘటనాస్థలంలో రెస్క్యూ టీమ్స్ పని చేస్తున్నారు.

Read Also- Dogs in Countries: కుక్కలు ఎక్కువగా ఉన్న టాప్-10 దేశాలు ఇవే

కాగా, హుమాయిన్ సమాధి కాంప్లెక్స్‌‌ను 16వ శతాబ్దం మధ్యకాలంలో నిర్మించారు. దీనికి యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తింపు ఉంది. ఢిల్లీలోని ప్రధాన పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా ప్రసిద్ధి గాంచింది. ఏడాది పొడవునా పెద్ద సంఖ్యలో పర్యాటకులు సందర్శిస్తుంటారు. ఢిల్లీ నగరంలోని మొగల్ చరిత్రకుకేంద్రంగా హుమాయూన్ సమాధి సముదాయం ఉంది. మొగలుల శిల్ప శైలిలో నిర్మించారు. ఈ ప్రాంతంలో పలు మతపరమైన నిర్మాణాలు, తోటలు ఉన్నాయి.

Read Also- Karun Nair on Gambhir: ఎట్టకేలకు కోచ్ గంభీర్‌పై నోరువిప్పిన ఆటగాడు

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?