Karun Nair on Gambhir: కోచ్ గంభీర్‌పై నోరువిప్పిన ఆటగాడు
gautam gambhir
Viral News, లేటెస్ట్ న్యూస్

Karun Nair on Gambhir: ఎట్టకేలకు కోచ్ గంభీర్‌పై నోరువిప్పిన ఆటగాడు

Karun Nair on Gambhir: ఇటీవల జరిగిన భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సీరిస్‌లో 4 మ్యాచ్‌లు ఆడిన బ్యాటర్ కరుణ్ నాయర్, భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై (Karun Nair on Gambhir) ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లండ్ టూర్ సమయంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ అందించిన ప్రోత్సాహం, మద్దతు అమోఘమని కొనియాడాడు. సిరీస్ ఆరంభం నుంచే గంభీర్ చాలా స్పష్టమైన సందేశం ఇచ్చారని, జట్టు కోసం ఆడాలని, ఇంగ్లండ్‌ను వారి సొంత దేశంలో మట్టికరిపించాలని చెప్పారని కరుణ్ నాయర్ వెల్లడించాడు. గంభీర్ ఆలోచనల ప్రకారమే ఆటగాళ్లమంతా ఆడామని వివరించాడు. ఈ మేరకు రెవ్‌స్పోర్ట్స్‌తో (RevSports) కరుణ్ నాయర్ మాట్లాడాడు.

‘‘కోచ్ సందేశాన్ని ప్రతి ఒక్కరూ మనసులో పెట్టుకొని ఆడారు. సిరీస్‌లో ముందుకు సాగిన కొద్దీ అది మీకు స్పష్టంగా అర్థమై ఉంటుంది. గౌతీ భాయ్ (గౌతమ్ గంభీర్) మా అందరినీ ఎంతగానో ప్రోత్సాహించాడు. వ్యక్తిగతంగా నా విషయానికొస్తే ఆయన నాపై నమ్మకాన్ని ఉంచారు. అత్యుత్తమంగా ఆడేలా ప్రోత్సహించారు. నా శైలిలోనే జట్టు అవసరమైన విధంగా ఆడాలంటూ ప్రేరేపించారు’’ అని కరుణ్ నాయర్ పేర్కొన్నాడు.

Read also- ChatGPT Advice: చాట్‌జీపీటీ చెప్పింది గుడ్డిగా నమ్మిన దంపతులు.. చివరకు ఊహించని ట్విస్ట్

కాగా, 8 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్, ఇటీవలే ముగిసిన ఇంగ్లండ్ పర్యటనలో 4 మ్యాచ్‌లు ఆడాడు. 8 ఇన్నింగ్స్‌ల్లో బ్యాటింగ్ చేసి 25.62 సగటుతో 205 పరుగులు సాధించాడు. ఒక అర్ధశతకం మినహా పెద్ద స్కోర్లు ఏమీ చేయలేకపోయాడు. దేశవాళీ క్రికెట్‌లో అత్యద్భుతంగా రాణించినప్పటికీ, అంతర్జాతీయ వేదికపై 30లు, 40లు స్కోర్లకే పరిమితమయ్యాడు. ఒక్కటంటే ఒక్క పెద్ద ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు.

Read Also- Independence Day: ఆస్ట్రేలియాలో ఖలిస్థానీల దుశ్చర్య.. భారత కాన్సులేట్ వద్ద…

ఇంగ్లండ్ టూర్‌లో టీమిండియా మొత్తం 5 టెస్ట్ మ్యాచ్‌లు ఆడింది. ఒక మ్యాచ్ డ్రా అవ్వగా, 2-2తో సిరీస్ సమం అయింది. అయితే, ఈ సిరీస్ టీమిండియాలో మార్పు దశకు నాందిపలికింది. స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ లాంటి అనుభవజ్ఞులు లేకుండానే, శుభ్‌మన్ గిల్ నాయకత్వంలోని యువ భారత జట్టు అద్భుతంగా రాణించింది. నిజానికి ఇంగ్లండ్ సిరీస్‌కు భారత జట్టు స్వదేశంలో న్యూజిలాండ్ చేతిలో 3-0 వైట్‌వాష్‌కు గురైంది. స్వదేశంలో 12 ఏళ్ల కొనసాగిన భారత జైత్రయాత్రకు ముగింపు కూడా పడింది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా టూర్‌లో 1-3తో బోర్డర్-గావస్కర్ ట్రోఫీని కూడా కోల్పోయింది. దీంతో, టీమ్ మానసికంగా బలహీనంగా తయారైంది. దీంతో, ఇంగ్లండ్ పర్యటనలో తేలిపోతారేమో అన్న సందేహాలు వ్యక్తమయ్యాయి. కానీ, ఇంగ్లండ్ పర్యటనలో యువ ఆటగాళ్లు అద్భుతంగా రాణించి సిరీస్‌ను 2-2తో సమం చేశారు. ముఖ్యంగా, భారత జట్టు ప్రదర్శనపై విమర్శకులు ప్రశంసలు కురిపించారు.

Read Also- Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా ఎంపికపై అప్‌డేట్.. కెప్టెన్‌ ఎవరంటే?

Just In

01

BiggBoss9 Prize Money: బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్‌కు వచ్చే ప్రైజ్ మనీ ఎంతో తెలుసా.. సర్‌ప్రైజ్ గెస్ట్ ఎవరంటే?

Kerala News: కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ హవా.. పంచాయతీ ఎన్నికల్లో యూటీఎఫ్ సత్తా

Brown University: అమెరికాలో కాల్పులు.. ఇద్దరు మృతి, ఎనిమిది మంది పరిస్థితి విషమం

Etela Rajender: నేను ఏ పార్టీలో ఉన్నానో వారే చెప్పాలి: ఈటల రాజేందర్

Overdraft vs Personal Loan: ఓవర్‌డ్రాఫ్ట్ vs పర్సనల్ లోన్.. మీ డబ్బు అవసరంలో ఏది సరైన ఎంపిక?