ChatGPT
Viral, లేటెస్ట్ న్యూస్

ChatGPT Advice: చాట్‌జీపీటీ చెప్పింది గుడ్డిగా నమ్మిన దంపతులు.. చివరకు ఊహించని ట్విస్ట్

ChatGPT Advice: ఆధునిక సాంకేతిక యుగంలో చాట్‌జీపీటీ సరికొత్త విప్లవం అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ చాట్‌బాట్ సలహాలు, సూచనలు (ChatGPT Advice) తీసుకొని పలు రంగాలకు చెందిన చాలామంది అద్భుత ఫలితాలు సాధించారు. అయితే, చాట్‌జీపీటీ చెప్పే ప్రతిదానిని గుడ్డిగా నమ్మితే కొన్నిసార్లు ఊహించని ప్రతికూల పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించే ఘటన ఒకటి వెలుగుచూసింది.

స్పెయిన్‌కు చెందిన మెరీ కాల్డాస్ అనే ఇన్‌ఫ్లుయెన్సర్, తన భర్త అలెహాండ్రో సిడ్‌తో కలిసి ప్యూర్టో రికో (Puerto Rico) వెళ్లేందుకు ఒక రొమాంటిక్ ట్రిప్‌ ప్లాన్ చేసుకుంది. ఆమెకు ఇది డ్రీమ్ టూర్ కావడంతో అన్ని ఏర్పాట్లు ముందే పూర్తి చేసుకుంది. అయితే, టూర్ అసలు మొదలవకుండానే ముగిసిపోయింది. వారు చేసిన ఒకే ఒక్క పొరపాటు ఇందుకు కారణమైంది. చాట్‌జీపీటీ చెప్పింది వినిజజ ప్రయాణానికి సంబంధించిన పేపర్‌వర్క్‌ను పట్టించుకోకపోవడం వారు చేసిన మిస్టేక్ అయింది.

Read also- Independence Day: ఆస్ట్రేలియాలో ఖలిస్థానీల దుశ్చర్య.. భారత కాన్సులేట్ వద్ద…

ప్యూర్టో రికో ట్రిప్ వెళ్లడానికి ముందే తన ప్రయాణం, అక్కడి జీవనశైలికి సంబంధించిన అన్ని విషయాలను మెరీ కాల్డాస్ తెలుసుకుంది. టూర్‌కు సంబంధించిన వివరాలను వేలాది మంది సోషల్ మీడియా ఫాలోవర్స్‌తో కూడా పంచుకుంది. అయితే, జర్నీకి ముందు చట్టపరమైన నిబంధనలు తెసుకునేందుకు ప్రయత్నించిన ఆమె.. ప్యూర్టో రికో వెళ్లాలంటే వీసా అవసరమా? అని చాట్‌జీపీటీని ప్రశ్నించింది. ‘లేదు’ అంటూ చాట్‌జీపీటీ స్పష్టమైన సమాధానం ఇచ్చింది. నిజానికి చాట్‌జీపీటీ చెప్పింది కూడా నిజమే. స్పెయిన్ పాస్‌పోర్టు కలిగివున్న వ్యక్తులు యూఎస్ వీసా వేవర్ ప్రోగ్రామ్ కింద వీసా లేకుండానే ప్యూర్టో రికోను సందర్శించవచ్చు. కానీ, దీనిర్థం నేరుగా విమానం ఎక్కవచ్చు అని కాదు. ప్రయాణానికి ముందుగా ఈఎస్‌టీఏ (Electronic System for Travel Authorization) కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుంటే మాత్రమే ప్రయాణం చేయడం సాధ్యమవుతుంది. ఈ చిన్న విషయాన్ని దంపతులు తెలుసుకోలేకపోయారు. చాట్‌జీపీటీ చెప్పింది మాత్రమే పాటించారు.

పాపం.. అన్నీ బుక్ చేసుకున్నారు
అలెహాండ్రో సిడ్‌ దంపతులు ప్యూర్టో రికో టూర్ కోసం అన్నీ సిద్ధం చేసుకున్నారు. ఫ్లైట్స్‌, హోటల్స్‌, ఇతర కార్యాకలాపాలకు సంబంధించినవన్నీ బుక్ చేసుకున్నారు. కానీ, ఎయిర్‌పోర్టులో చెక్-ఇన్ కౌంటర్‌ వద్దకు వెళ్లాక వారికి అసలు నిజం తెలిసింది. ఈఎస్‌టీఏ లేకుండా బోర్డింగ్‌కి అనుమతి ఉండదని ఎయిర్‌పోర్టు అధికారులు స్పష్టం చేశారు.

విచారంలో మెరీ కాల్డాస్
డ్రీమ్ టూర్ అనూహ్యంగా రద్దు కావడంపై ఆ మరుసటి రోజు మెరీ కాల్డాస్ ఒక వీడియోను షేర్ చేసింది. టిక్‌టాక్, యూట్యూబ్‌లో ఒక వీడియోను పంచుకుంది. దంపతులు ఇద్దరూ తీవ్ర నిరుత్సాహానికి గురైనట్టుగా వీడియో చూస్తే అర్థమవుతోంది. ఎయిర్‌పోర్టులో నడుస్తున్న సమయంలో భర్త అలెహాండ్రో ఆమెను ఓదార్చుతూ తీసుకెళుతుండడం కనిపించింది. ‘‘ఏదైనా ప్రయాణం చేయడానికి ముందు నేను ఎక్కువ రీసెర్చ్‌ చేస్తుంటాను. కానీ, ఈసారి చాట్‌జీపీటీని అడిగాను. వీసా అవసరం లేదని అది చెప్పింది’’ అంటూ ఆమె వీడియోలో చెప్పింది. ‘‘చాట్‌జీపీటీ మీద నాకు నమ్మకం పోయింది. నేనెప్పుడైనా చాట్‌జీపీటీని తిడుతుండేదాన్ని. బహుశా అది ప్రతీకారం తీర్చుకుందేమో!’’ అని మెరీ కాల్డాస్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వేలాదిమంది వీక్షించారు. కొందరు ఆసక్తికరమైన కామెంట్లు కూడా చేశారు.

Read Also- Asia Cup 2025: ఆసియా కప్‌కు టీమిండియా ఎంపికపై అప్‌డేట్.. కెప్టెన్‌ ఎవరంటే?

ఒక చాట్‌బాట్ చెప్పినదాని ప్రకారం విదేశీ ప్రయాణాలకు ప్లాన్ చేసుకుంటే తప్పులు దొర్లుతాయని పలువురు విమర్శించారు. చాట్‌జీపీటీ ఇచ్చిన సమాధానం తప్పు కాదు, కానీ పూర్తి సమాధానం ఇవ్వలేదంతే అని మరికొందరు వ్యాఖ్యానించారు. కాగా, ప్యూర్టో రికో రికో అనేది కరేబియన్ దీవుల్లో ఉన్నప్పటికీ, అమెరికాకు చెందిన అన్‌ఇన్‌కార్పొరేటెడ్ టెరిటరీగా ఉంది. అంటే, అధికారికంగా చట్టం లేకుండానే అమెరికాలో అంతర్భాగంగా ఉంది. మొత్తంగా, టెక్నాలజీ ఎంత ఉపయోగపడినా, తుది నిర్ణయానికి ముందు ధృవీకరించుకోవడం చాలా అవసరమని ఈ ఉదంతం చాటిచెబుతోంది.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!