Nagarjuna Sagar dam: నాగార్జున సాగర్ జలాశయానికి ఎగువ నుంచి భారీగా వరద వస్తున్నది. శ్రీశైలం, జూరాల నుంచి వరద పోటెత్తుతుండంతో మరోసారి ప్రాజెక్ట్ 26 క్రస్ట్ గేట్లను ఎత్తారు. సాగర్ రిజర్వాయర్‌కు ఎగువ నుంచి 2 లక్షల 54 వేల క్యూసెక్కులకుపైగా ఇన్‌ఫ్లో వచ్చి చేరుతున్నది. ఇప్పటికే రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండడంతో వచ్చిన వరదను వచ్చినట్లు అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు.
Also Read: Jangaon: బాలికపై సామూహిక అత్యాచారం.. 10 మంది యువకుల అరెస్టు
నీటిమట్టం 590 అడుగులు
8 గేట్లను 10 అడుగులు, 18 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి స్పిల్ వే ద్వారా 2 లక్షల 62 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల నిలిపేశారు. ప్రధాన జల విద్యుత్ కేంద్రంలో విద్యుదుత్పత్తి కొనసాగుతున్నది. నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు (312.04 టీఎంసీలు) కాగా ప్రస్తుతం 589.90 అడుగులు 308.76 (టీఎంసీలు)గా ఉన్నది.
Also Read: Khammam District: ఆర్&ఆర్ ప్యాకేజీలో అవకతవకలు.. ఏడేళ్లుగా పోరాటం.. పట్టించుకోని అధికారులు

 Epaper
 Epaper  
			 
					 
					 
					 
					 
				 
				 
				 
				 
				 
				 
				 
				 
				