Jangaon(Image Credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Jangaon: బాలికపై సామూహిక అత్యాచారం.. 10 మంది యువకుల అరెస్టు

Jangaon: ప్రేమ పేరుతో బాలికను నమ్మించి, శారీరకంగా లోబరుచుకుని, ఆపై గోవాకు తీసుకెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో మొత్తం 10 మంది నిందితులను జనగామ(Jangaon) పోలీసులు(Police) అరెస్టు చేశారు.  జనగామ ఏసీపీ పండరి చేతన్ నితిన్(ACP Pandari Chetan Nitin) విలేకరుల సమావేశంలో ఈ వివరాలను వెల్లడించారు. జనగామ పట్టణానికి చెందిన ఒక యువకుడు బాలికను ప్రేమిస్తున్నట్లు నమ్మించాడు. ఆమె కూడా అతడిని నిజంగానే ప్రేమిస్తున్నట్లు భావించి, అతడితో శారీరక సంబంధాన్ని కొనసాగించింది.

 Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా

10 మందిని అక్కడికి పిలిపించి,

ఆ తర్వాత, ఆ యువకుడు బాలికను గోవాకు వెళ్దామని నమ్మించి కారులో తీసుకెళ్లాడు. గోవా చేరుకున్నాక, తన (friends)స్నేహితులైన మరో 10 మందిని అక్కడికి పిలిపించి, బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. జనగామ(Jangaon) కు తిరిగి వచ్చిన తర్వాత బాలిక ఈ విషయాన్ని తన చిన్నమ్మకు చెప్పడంతో, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు బాలిక నుంచి వివరాలు సేకరించి, దర్యాప్తు చేపట్టారు. పది మంది నిందితులను చాకచక్యంగా పట్టుకుని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు.

అరెస్టు అయిన వారిలో మహమ్మద్ ఒవైసీ, ముత్యాల పవన్‌కుమార్, బొద్దుల శివకుమార్, నూకల రవి, జెట్టి సంజయ్, ఎండీ అబ్దుల్, పుస్తకాల సాయితేజ, ముత్తాడి సుమంత్‌రెడ్డి, గుండ సాయిచరణ్ రెడ్డి, ఓరుగంటి సాయిరామ్ ఉన్నారని ఏసీపీ వివరించారు. ఈ కేసును ఛేదించడంలో ప్రతిభ చూపిన ఎస్సైలు భరత్, చెన్నకేశవులను వరంగల్ సీపీ సన్‌ప్రీత్ సింగ్, డీసీపీ రాజ మహేంద్ర నాయక్‌(DCP Raja Mahendra Naik)లు అభినందించారని ఏసీపీ తెలిపారు.

 Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ

Just In

01

Lunar Eclipse: నేడే చంద్రగ్రహణం.. ఆ రాశుల వారికీ పెద్ద ముప్పు.. మీ రాశి ఉందా?

Junior Mining Engineers: విధుల్లోకి రీ ఎంట్రీ అయిన టర్మినేట్ జేఎంఈటీ ట్రైనీలు!

GHMC: నిమజ్జనం విధుల్లో జీహెచ్ఎంసీ.. వ్యర్థాల తొలగింపు ముమ్మరం

MLC Kavitha: త్వరలో ప్రభుత్వానికి బుద్ధి చెబుతాం: ఎమ్మెల్సీ కవిత

Sahu Garapati: ‘కిష్కింధపురి’ గురించి ఈ నిర్మాత చెబుతుంది వింటే.. టికెట్ బుక్ చేయకుండా ఉండరు!