Minister Adluri Laxman: పాలకుర్తి అభివృద్ధికి కృషి చేస్తా.. మంత్రి
Minister Adluri Laxman(Image CRDIT: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Minister Adluri Laxman: పాలకుర్తి అభివృద్ధికి కృషి చేస్తా.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ హామీ

Minister Adluri Laxman: పాలకుర్తి నియోజకవర్గ రహదారుల అభివృద్ధికి 21 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు మైనారిటీ సంక్షేమ, ఎస్సీ, ఎస్టీ శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్(Minister Adluri Laxman) హామీ ఇచ్చారు.హైదరాబాద్‌లోని క్యాంపు కార్యాలయంలో పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి(MLA Yashaswini Reddy) మంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి నియోజకవర్గ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య సోదరభావపూర్వకంగా సంభాషణ సాగింది.నియోజకవర్గంలోని తండాలు, గూడాలలో రహదారుల దయనీయ పరిస్థితిని ఎమ్మెల్యే ప్రస్తావిస్తూ, గత పదేళ్లుగా ఏ ప్రభుత్వం పట్టించుకోక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వాపోయారు.

రహదారుల మరమ్మతులకు నిధులు కేటాయించాలని ఆమె కోరారు.ఎమ్మెల్యే అభ్యర్థనపై స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ వెంటనే 21 కోట్ల రూపాయలు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఈ నిర్ణయంతో పాలకుర్తి నియోజకవర్గ ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.నిధుల కేటాయింపుతో తండాలు, గూడాలలో రాకపోకలు సులభతరం అవుతాయని, అభివృద్ధి పనులు వేగవంతం కానున్నాయని ఎమ్మెల్యే యశస్విని రెడ్డి తెలిపారు.

 Also Read: Rajinikanth- Kamal Haasan: ఇద్దరు పెద్ద హీరోలతో ఒక సక్సస్‌ఫుల్ దర్శకుడు.. ఇక బాక్సాఫీస్ బద్దలే

ఆరోగ్యంగా ఉండాలంటే ఫిజియోథెర‌పి అవ‌సరం వరల్డ్ ఫిజియోథెరపీ డే లో క‌లెక్ట‌ర్‌

ప్ర‌జ‌లు ఆరోగ్యంగా, చురుకుగా ఉండాలంటే ఫిజియోథెరిపి అవ‌స‌రం అని జన‌గామ జిల్లా క‌లెక్ట‌ర్ రిజ్వాన్ భాషా షేక్ అభిప్రాయ‌ప‌డ్డారు. సోమ‌వారం జ‌న‌గామ‌లోని ప్రభుత్వ జనరల్ దావాఖానాలో వరల్డ్ ఫిజియోథెరపీ డేను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న‌క‌లెక్ట‌ర్ మాట్లాడుతూ ఫిజియోథెర‌పితో శ‌రీరంలోని న‌వ‌నాడులు చురుకుగా ప‌నిచేస్తాయ‌ని అన్నారు. శ‌రీరం స్ప‌ర్శ కొల్పోయిన‌ప్పుడు ఎక్కువ‌గా న‌రాల బ‌ల‌హీన‌తే ఒక ప్ర‌దాన కార‌ణ‌మ‌ని, మానసిక ఒత్తిడికి లోనైప్పుడు ఫిజియోథెరిపితో ఒత్తిడి నుండి ఉప‌శ‌మ‌నం క‌లిగి, కొన్ని వ్యాధుల నుంచి దూరం కావ‌చ్చ‌ని అన్నారు.

ర‌క‌రకాల వ్యాధుల నుండి త్వరగా కోలుకోవడంలో ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రజలు చురుకుగా, ఆరోగ్యంగా, స్వతంత్రంగా జీవించేందుకు ఫిజియోథెరపిస్టులు చేసే కీలకమైన సహకారం ఎంతో అవ‌స‌రమ‌ని అన్నారు. ప్ర‌తి ఒక్క‌రు ఫిజియోథెరిపిపై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని సూచించారు. ఈ సంద‌ర్భంగా రోగుల‌కు పండ్లు పంపిణి చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా వైద్యాధికారి డా. కె. మల్లికార్జున్ రావు, ఆర్ ఎం ఓ డాక్ట‌ర్ ఏ మ‌ధుక‌ర్‌రావు, వైద్యులు పాల్గొన్నారు.

 Also Read: CM Revanth Reddy: నెత్తిన నీళ్లు చల్లుకున్నంత మాత్రాన.. వాళ్ల పాపాలు తొలగిపోవు.. సీఎం రేవంత్

Just In

01

S Thaman: సినిమా ఇండస్ట్రీలో యూనిటీ లేదు.. టాలీవుడ్‌పై థమన్ ఫైర్

The Raja Saab: ఈసారి బ్యూటీఫుల్ మెలోడీతో.. ప్రోమో చూశారా!

Bigg Boss Buzzz: అబద్దం చెప్పమన్నా చెప్పను.. శివాజీకి షాకిచ్చిన సుమన్ శెట్టి!

Aswini Dutt: 50 సంవత్సరాల వైజయంతి ప్రయాణం.. నిర్మాత అశ్వినీదత్ ఎమోషనల్ లెటర్..!

Dharamshala T20: ధర్మశాల టీ20లో దక్షిణాఫ్రికాపై భారత్ గెలుపు..