Sangareddy Rains: సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలో అర్దరాత్రి కురిసిన అకాల వర్షంతో వందల సంచుల వరి ధాన్యం నీటిలో తడిసిపోవడమే కాకుండా నీటి వరదలో మురికి కాలువల్లోకి కొట్టుకుపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విక్రయించేందుకు సిద్దంగా ఉన్న సుమారు 200 సంచుల వరి ధాన్యం వరద నీటిలో కొట్టుకుపోయినట్లుగా రైతులు చెబుతున్నారు. జోగిపేటలోని వరి కొనుగోలు కేంద్రంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయగా మార్కెట్ గంజ్‌లో అన్నాసాగర్, జోగిపేట ప్రాంత రైతులు వరి ధాన్యంను ఆరబెట్టుకున్నారు. సోమవారం అర్దరాత్రి 12 గంటల నుంచి 2 గంటల వరకు భారీ వర్షం కురిసింది.
Also Read: Medak District Rains: మెదక్ ఉమ్మడి జిల్లాలో వర్షం బీభత్సం.. నీటమునిగిన వేలాది ఎకరాల పంట
ఒక్కసారిగా గంజ్‌లో కొనుగోళ్లు ప్రారంభించగా రైతులు తాము పండించిన ధాన్యంను వారం రోజుల క్రితం నుంచే ఆరబెట్టుకుంటున్నారు. పగలంతా ఎండ కొట్టడంతో రైతులు ధాన్యంను ఆరబెట్టుకొని హాయిగా ఇంట్లో పడుకున్నారు. అర్దరాత్రి వర్షం కురవడంతో రైతులు వరి ధాన్యం ఆరబెట్టుకున్న గంజ్‌కు పరుగులు తీసారు. అదే రాత్రికి కొంత మంది రైతులు తమ ధాన్యంను వరదలో కొట్టుకుపోకుండా ఆపే ప్రయత్నం చేసినా లాభం లేకుండా పోయింది. జోగిపేటకు చెందిన రైతులు లింగం, అరీల్ గౌడ్, అన్నాసాగర్ గ్రామానికి చెందిన పోచయ్యలకు చెందిన వరి ధాన్యం వర్షం కారణంగా తడిసిపోయింది. తడిసిన ధాన్యంను వెంటనే కొనుగోలు చేయాలని రైతులను నిర్వాహకులను కోరారు.
ధాన్యంపై టార్పాలిన్లు కప్పుకొండి
మళ్లీ వర్షం రావచ్చునని కాబట్టి రైతులు వరి ధాన్యంపై టార్పాలిన్లు కప్పాలని మరో 24 గంటల్లో వర్షం రావచ్చునని మార్కెట్ కమిటీ సిబ్బంది మైకులో రైతులకు తెలియజేసారు. వాతారణం చల్లగా ఉన్నందున రైతులు జాగ్రత్త వహించాలని చెప్పారు. అధికారులు చెప్పే వరకు కుప్పలుగా పోసుకోవద్దని తెలిపారు.
ఫోటో–1ః జోగిపేట గంజ్‌లో ఆరబెట్టుకున్న ధాన్యం తడిసిపోయిన దృశ్యం
ఫోటో–2ః జోగిపేటలో తడిసిన ధాన్యంను చూపుతున్న రైతు దృశ్యం
ఫోటో–3 జోగిపేటలో వరి కుప్ప వద్ద నీరు చేరిన దృశ్యం
ఫోటో–4ః జోగిపేటలో «ఆరబెట్టిన ధాన్యంపై టార్పాలిన్లు కప్పాలని మైకులో చెబుతున్న మార్కెట్ సిబ్బంది
ఫోటో–5ః ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్న రైతుల పోచయ్య
Also Read: Medak Police: గిరిజన మహిళ హత్యకేసును 5 రోజుల్లోనే ఛేదించిన పోలీసులు.. వెలుగులోకి సంచలన నిజాలు!
