Medak District Rains 9 IMAGE credit: swetcha reporter)
నార్త్ తెలంగాణ

Medak District Rains: మెదక్ ఉమ్మడి జిల్లాలో వర్షం బీభత్సం.. నీటమునిగిన వేలాది ఎకరాల పంట

Medak District Rains: మెదక్ ఉమ్మడి జిల్లాలో భారీ వర్షాలు కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో వేలాది ఎకరాల్లో పంట పొలాలు నీట మునిగి, రైతులు(Farmers)తీవ్రంగా నష్టపోయారు. మెదక్ జిల్లా(Medak District)లో సుమారు 1,500 ఎకరాల వరి, మొక్కజొన్న, పత్తి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని వ్యవసాయ శాఖ అధికారుల అంచనా వేస్తున్నారు. సిద్దిపేట జిల్లా(Siddipet District)లో సుమారు 1,800 ఎకరాలు నష్టపోయినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. సంగారెడ్డి జిల్లాలో(Sangareddy District)దాదాపు 2,000 ఎకరాల పంటలు దెబ్బతిన్నాయి.

 Also Read:Khammam Rains: ఆ జిల్లాలో భారీ వర్షాలు.. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు

లోతట్టు ప్రాంతాలు జలమయం

భారీ వర్షాల కారణంగా ఉమ్మడి మెదక్ జిల్లా (Medak District))లోని సింగూరు, గణపురం, పోచారం, హల్దీ ప్రాజెక్టులు నిండి పొంగిపొర్లుతున్నాయి. సింగూరు ప్రాజెక్టు(Singur Project)గేట్లు ఎత్తివేయడంతో మంజీర నది ఉగ్రరూపం దాల్చి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. దీని ప్రభావంతో ఏడుపాయల వన దుర్గామాత ఆలయం ఆరు రోజులుగా నీటిలో మునిగి జలదిగ్బంధంలోనే ఉంది. మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లోని పలు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. వాగులు పొంగిపొర్లడంతో అనేక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: TG in Top: అంగన్వాడీ సేవల్లో తెలంగాణ టాప్!

Just In

01

Government Lands: త్వరలో ప్రభుత్వానికి అందనున్న నిషేధిత భూముల జాబితా..!

Jubilee Hills Bypoll: మీకు అభివృద్ధి కావాలా.. అబద్ధాలు కావాలా.. జూబ్లీహిల్స్ ఓటర్లకు పొన్నం అల్టిమేటం!

Gadwal District: సెటిల్మెంట్లు అక్రమ వసూళ్లకు కేరాఫ్‌గా కేటిదొడ్డి పోలీస్ స్టేషన్.. ఎక్కడంటే..!

Kiran Kumar Reddy: కేటీఆర్ కొత్త ఆటో అవతారం ఎత్తాడు: చామల కిరణ్ కుమార్ రెడ్డి

IND vs AUS 1st T20: ఆసీస్‌తో ఫస్ట్ టీ20.. టాస్ పడిందోచ్.. బ్యాటింగ్ ఎవరిదంటే?