Medak Police (IMAGE CREDITR: SWETCHA REPORTER)
నార్త్ తెలంగాణ

Medak Police: గిరిజన మహిళ హత్యకేసును 5 రోజుల్లోనే ఛేదించిన పోలీసులు.. వెలుగులోకి సంచలన నిజాలు!

Medak Police: మెదక్ జిల్లాలో సంచలనం సృష్టించిన గిరిజన మహిళ కమల (35) అత్యాచారం హత్య కేసును పోలీసులు చేధించారు. గిరిజన మహిళ హత్యకేసు పోలీస్ లు సవాల్ గా తీసుకున్నారు. మెదక్ రూరల్ సీఐ జార్జి ప్రత్యేక చొరవతో హత్యజరిగిన 5 రోజుల్లోనే కేసును దర్యాప్తు చేసి,నిందితున్ని పట్టుకొని కటకటాలకు పంపించారు.కేసు దర్యాప్తు వివరాలను జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రావు,అదనపు ఎస్పీ మహేందర్,డీఎస్పీ ప్రసన్నకుమార్, మెదక్ రూరల్ సీఐ జార్జి లతో కలసి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. మెదక్ జిల్లా ఎస్పీ. డి.వి. శ్రీనివాసరావు మాట్లాడుతూ 30 తీముల తో ప్రత్యేక దర్యాప్తు బృందాలు ఏర్పాటు చేసి 5 రోజుల్లోనే కేసును చేదించారు. నిందితుని అరెస్టు చేసి మీడియా ముందు ప్రవేశపెట్టారు.

Also Read: Medak District: మహిళను చీరతో చెట్టుకు కట్టేసి అత్యాచారం.. మెదక్ జిల్లాలో దారుణ ఘటన

బాధితురాలు కమల మృతి

మెదక్ జిల్లా కొల్చారం మండలం ఏడుపాయల మొదటి బ్రిడ్జి దాటిన తర్వాత కాంగ్రెస్ నేత గాలు అనిల్ కుమార్ వెంచర్ వెనుక గల అటవీ ప్రాంతంలో ఒక గిరిజన మహిళపై అత్యాచారం జరుగగా అక్కడ స్థానికుల సమాచారం మేరకు పోలీసులు సంఘటన స్థలం చేరుకుని మహిళను చికిత్స నిమిత్తం మెదక్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మహిళ పరిస్థితి ఈ విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తరలిస్తుండగా మార్గమధ్యంలో బాధితురాలు కమల మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసును ప్రతిష్టత్మకంగా తీసుకున్న జిల్లా ఎస్పీ. డి.వి. శ్రీనివాసరావు ఇద్దరు డిఎస్పీలు ముగ్గురు సీఐలు ఏడుగురు ఎస్సైలు సిసిఎస్ బృందం నిందితులకోసం గాలించారు. దీనిలో భాగంగా పోలీసులు మెదక్ నుండి నేరం జరిగిన సంఘటన స్థలం వరకు గల సిసి ఫుటేజీలను పరిశీలించి సీసీ ఫుటేజ్ ద్వారా సిద్ధి వినాయక వైన్స్ షాపు వద్ద నిందితుడిని పోలీసులు గుర్తించారు.

గతంలో నిందితుడిపై అత్యాచారం హత్య కేసుతో పాటు పలు కేసులు

కమలకు ఏడు పాయలలో పని ఇప్పిస్తానని చెప్పి నిందితుడు కమలను ఏడుపాయాలకు తీసుకుపోయిన ఆదారాలు పోలీస్ లకు లభించడంతో నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారించగా నేరాన్ని ఒప్పుకున్నట్లు జిల్లా ఎస్పీ తెలియజేశారు. నిందితుడు పాత నేరస్తుడే నని గతంలో నిందితుడిపై అత్యాచారం హత్య కేసుతో పాటు పలు కేసులు ఉన్నట్లు ఎస్పీ తెలియజేశారు. నిందితుడు పకిరా నాయక్ 10వ తారీఖు నాడు సాయంత్రం కమల అనే మహిళను మెదక్ నుండి కూలి పనికి అని తీసుకెళ్లి ఏడుపాయల దేవస్థానం దారిలోని మూడవ వంతెన దాటిన తర్వాత గాలి అనిల్ కుమార్ వెంచర్ వెనుక చెట్ల మధ్యకు తీసుకెళ్లి లైంగిక దాడి చేసి అనంతరం రాయితో తలపై బలంగా కొట్టి హతమార్చి ముక్కుపుడక దోచుకుని అక్కడి నుండి పారిపోయాడు.

అత్యాచారం హత్య కేసు నమోదైనట్లు ఎస్పీ వెల్లడి

నిందితుడు పకిరనాయక్( 36) సంవత్సరాలు స్వగ్రామం సంగారెడ్డి జిల్లా బట్పల్లి మండలం అంబుజిగూడ తండావాసిగా పోలీసులు గుర్తించారు. నిందితుడు పక్కిరా నాయక్ పై మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇదే తరహా అత్యాచారం హత్య కేసు నమోదైనట్లు ఎస్పీ వెల్లడించారు. మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంకో మహిళపై కూడా ఇదే తరహాలో మహిళను పరిచయం చేసుకొని అత్యాచారయత్నం చేయడానికి ప్రయత్నించాడని ఎస్పీ వెల్లడించారు. నిందితుడి ఒప్పుకోలు ఆధారంగా పోలీసులు మృతురాలి ముక్కుపుడక నిందితుడు వాడిన రాయి కట్టే నిందితుడి బట్టలు స్వాధీనం చేసుకున్నారు. అత్యాచారం హత్య కేసును వేగంగా ఛేదించినందుకు మెదక్ రూరల్ సీఐని, పోలీస్ సిబ్బందిని, సి సి ఎస్ టీం ను జిల్లా ఎస్పీ. డి.వి. శ్రీనివాసరావు అభినందించారు.వారికి రివార్డులు ఎస్పీ శ్రీనివాస్ రావు అందించారు.

Also ReadMedak Heavy Rains: ఆ జిల్లాల్లో దంచికొట్టిన వర్షం.. జలదిగ్బంధంలో ఏడుపాయల దుర్గమ్మ ఆలయం

Just In

01

Sujeeth Birthday: సుజీత్ బర్త్‌డే.. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ ట్వీట్ చూశారా?

Bottu Gambling: చిత్తు-బొత్తు ఆడుతున్న ఏడుగురి అరెస్ట్.. ఎంత డబ్బు దొరికిందంటే?

Mega Jathara: అసలైన మెగా జాతర సంక్రాంతి నుంచి మొదలు కాబోతోంది.. మెగా నామ సంవత్సరం!

Pak Targets Salman: సల్మాన్ ఖాన్‌పై పగబట్టిన పాకిస్థాన్.. ఉగ్రవాదిగా ముద్ర వేసేందుకు భారీ కుట్ర!

Hindu Rituals: దేవుడి దగ్గర కొబ్బరికాయను ఇలా కొడితే.. లక్ష్మీదేవి అనుగ్రహం పక్కా?